న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పార్టనర్ మారాడు.. పిచ్ మారింది.. రాహుల్ మారడా?'

Ind vs Aus 4th Test : KL Rahul Trolled On Social Media After Falling Cheaply Again | Oneindia Telugu
India vs Australia: KL Rahul trolled on social media after falling cheaply again

సిడ్నీ: ఆస్ట్రేలియాతో తలపడుతున్న టీమిండియా రెండు టెస్టుల్లో ఓపెనర్‌గా దిగాడు కేఎల్ రాహుల్.. వట్టి పేలవమైన ప్రదర్శన చేసి సింగిల్ డిజిట్‌తో పెవిలియన్ చేరుతుండటంతో మూడో టెస్టుకు వేటు వేసింది టీమిండియా మేనేజ్‌మెంట్. కానీ.. రోహిత్ శర్మ తన సతీమణి కాన్పు విషయంలో ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో నుంచే భారత్‌కి వచ్చేశాడు. ప్రయోగాత్మక ఓపెనర్‌ హనుమ విహారిని మిడిలార్డర్‌లోకి స్థాన మార్పు చేస్తూ.. మళ్లీ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌కి మరో అవకాశమిచ్చారు సెలక్టర్లు. అయితే.. ఈ అవకాశాన్ని కూడా రాహుల్ చేజార్చుకుని కెరీర్‌ని ప్రశ్నార్థకం చేసుకున్నాడు.

ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో టీమిండియా విజయాలు అందుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. కానీ, రాహుల్ మాత్రం అతనిపై ఆశలు పెట్టుకున్న వారిని తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో వరుసగా విఫలమవుతున్న భారత ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సిడ్నీ వేదికగా గురువారం ఆరంభమైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఓపెనర్‌గా మళ్లీ తుది జట్టులో చోటు దక్కించుకున్న కేఎల్ రాహుల్.. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు.

1
43626
హేజిల్‌వుడ్ బౌలింగ్‌లోనే రాహుల్ నాలుగో సారి

హేజిల్‌వుడ్ బౌలింగ్‌లోనే రాహుల్ నాలుగో సారి

ఆసీస్ ఫాస్ట్ బౌలర్ హేజిల్‌వుడ్ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా విసిరిన బంతిని కేఎల్ రాహుల్ (9: 6 బంతుల్లో 2 ఫోర్లు) వెంటాడే ప్రయత్నం చేశాడు. దీంతో.. బ్యాట్ అంచును తాకిన బంతి ఫస్ట్ స్లిప్‌లోకి దూసుకెళ్లగా.. ఫీల్డర్ షాన్ మార్ష్ ఎలాంటి తడబాటు లేకుండా సులువుగా క్యాచ్ అందుకున్నాడు. కేఎల్ రాహుల్ నాలుగో సారి హేజిల్‌వుడ్ బౌలింగ్‌లోనే ఔటవ్వడం గమనార్హం.

సచిన్‌ను అచ్రేకర్ నిందించిన వేళ..

పార్టనర్ మారాడు... పిచ్ మారింది

సంవత్సరం మారింది. పార్టనర్ మారాడు. పిచ్ మారింది. కానీ, రాహుల్ స్కోరు బోర్డు తీరు మాత్రం మారడం లేదు.

రాహుల్ ఫామ్‌లోకి వచ్చేందుకు

కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించడం లేదు.

నిద్రలేచేలోపే రాహుల్ అవుటా

నిద్రలేచేలోపే రాహుల్ అవుటైపోయాడు. ఐదు నిమిషాల ఆలస్యంతో లెజెండ్ బ్యాటింగ్ మిస్సయిపోయాను.

రాహుల్ కంటే ఇంకా బాగానే

ఈ ఓపెనర్ రాహుల్ కంటే ఇంకా బాగానే పనిచేస్తుంది.

Story first published: Thursday, January 3, 2019, 10:42 [IST]
Other articles published on Jan 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X