న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జడేజా వచ్చాడు..! మయాంక్ అగర్వాల్ అరంగ్రేటంతో బాక్సింగ్ డే టెస్టుకు టీమిండియా

India vs Australia: India Announce Playing XI For Melbourne Test, Mayank Agarwal To Debut, Ravindra Jadeja Returns

మెల్‌బోర్న్‌: పెర్త్ పరాజయం అనంతరం టీమిండియా.. జట్టు ఎంపికలో కీలక మార్పులు చేసింది. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌ వేదికగా బుధవారం నుంచి మూడో టెస్ట్‌లో తలపడేందుకు బీసీసీఐ తుది జట్టును ప్రకటించింది. అనుకున్నట్లుగానే రోహిత్ శర్మకు జట్టులో చోటిచ్చింది. స్పిన్నర్ లోటును భర్తీ చేసేందుకు జడేజాను తీసుకుంది. యువ ఆటగాడు పృథ్వీషా గాయంతో సిరీస్‌ నుంచి దూరం కావడంతో అనూహ్యంగా రప్పించిన కర్ణాటక బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌కు తుది జట్టులో అవకాశం కల్పించింది. దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా టెస్టు ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మురళి విజయ్‌లను వేటుకు గురిచేసింది. ఇద్దరిని బెంచ్‌కే పరిమితం చేసింది.

రోహిత్‌ శర్మ తిరిగి అవకాశం

రోహిత్‌ శర్మ తిరిగి అవకాశం

వెన్ను నొప్పితో రెండు టెస్టుకు దూరమైన రోహిత్‌ శర్మ తిరిగి అవకాశం దక్కించుకున్నాడు. దీంతో ఓపెనర్లుగా మయాంక్‌ అగర్వాల్‌-రోహిత్‌ శర్మ వస్తారా? లేక మయాంక్‌ అగర్వాల్, హనుమ విహారిలతో ఇన్నింగ్స్‌ ప్రారంభించి భారీ ప్రయోగం చేస్తారా అనే సందేహంలో పడేసింది బీసీసీఐ. ఈ మ్యాచ్‌తో మయాంక్‌ అగర్వాల్‌ అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇక పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌కు కూడా ఉద్వాసన పలికిన జట్టు మేనేజ్‌మెంట్‌.. స్పిన్నర్‌ రవీంద్ర జడేజాకు అవకాశం కల్పించింది.

రాహుల్ రావడమంటే.. ఆసీస్, కివీస్ అభిమానులకు శుభవార్తే!!

1-1గా నిలిచి మూడో టెస్టు ఆధిక్యం కోసం

1-1గా నిలిచి మూడో టెస్టు ఆధిక్యం కోసం

నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఇరు జట్లు 1-1గా నిలిచి సమంగా దూసుకెళ్తున్నాయి. దీంతో ఇరు జట్లు మూడో టెస్ట్‌ విజయంపై దృష్టిసారించాయి. ఎలాగైన విజయం సాధించి సిరీస్‌లో పై చేయి సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి.

16మందితో కూడిన జట్టును ప్రకటించి

సోమవారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరగనున్న పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు 16మందితో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. మరో 24గంటల్లో మ్యాచ్ మొదలవుతుందనగా మూడో టెస్టుకు భారత తుది జట్టును ప్రకటించి అభిమానుల్లో ఉత్కంఠను నెలకొల్పింది.

భారత తుది జట్టు:

విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), అజింక్యా రహానే (వైస్‌ కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారి, చతేశ్వర పుజారా, రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా

1
43625
Story first published: Tuesday, December 25, 2018, 11:06 [IST]
Other articles published on Dec 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X