న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాహుల్ రావడమంటే.. ఆసీస్, కివీస్ అభిమానులకు శుభవార్తే!!

 Twitter left baffled as KL Rahul gets retained in ODI squad for Australia, New Zealand series

న్యూఢిల్లీ: బీసీసీఐ సోమవారం ముందస్తు చర్యగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌ల కోసం 16 మందితో కూడిన భారత్ జట్టుని ప్రకటించేసింది. అందులో పేలవంగా విఫలమవుతోన్న కేఎల్ రాహుల్‌కి మళ్లీ చోటివ్వడంపై అభిమానులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవల ముగిసిన రెండు టెస్టుల్లోనూ ఘెరంగా విఫలమైన కేఎల్ రాహుల్.. అంతకముందు జరిగిన టీ20 సిరీస్‌లోనూ ఫెయిలయ్యాడు. అయినప్పటికీ.. అతనికి చోటిచ్చిన సెలక్టర్లు.. రిషబ్ పంత్‌పై వన్డేల్లో వేటు వేశారు.

ఫైనల్‌ ఇన్నింగ్స్‌లో మాత్రమే149 పరుగులతో

వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ సిరీస్‌లలో రాహుల్‌ దారుణ వైఫల్యం చెందాడు. ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో ఓవల్‌ ఫైనల్‌ ఇన్నింగ్స్‌లో మాత్రమే149 పరుగులతో సత్తా చాటాడు. దీంతో రాహుల్‌ మళ్లీ టెస్టు ఫామ్‌ సాధించినట్లుగా భ్రమపడ్డారంతా.. కానీ స్వదేశంలో వెస్టిండీస్‌ సిరీస్‌ సమయానికి మళ్లీ మొదటికొచ్చేశాడు.

రెండు టెస్టుల్లో మొత్తంగా కలిపి 48

ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల్లో మొత్తంగా కలిపి కేఎల్ రాహుల్ 48 పరుగులే చేశాడు. ఆసీస్‌తో ఆడిన రెండు టీ20 సిరీస్‌లోనూ 27 పరుగులకే పరిమితమైపోయాడు. ఈ పర్యటనకి ముందు భారత్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లోనూ 59 పరుగులతోనే సరిపెట్టుకున్నాడు. నాలుగు నెలలుగా పేలవ ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ జట్టులోంచి తీసేస్తేనే మంచిదంటూ సీనియర్లు ఆగ్రహానికి లోనవుతూనే ఉన్నాడు.

కోహ్లీకి దూకుడెక్కువ.. అందరికీ అందుకే నచ్చుతాడేమో..: టిమ్ పైనె

పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నా..

కానీ.. తాజాగా మళ్లీ వన్డే, టీ20 జట్టులోనూ అతనికి సెలక్టర్లు చోటివ్వడంపై అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. విమర్శకులకు బాగా దొరికిపోతున్న రాహుల్‌ వైఫల్యాలతో గడిపేస్తున్నాడు. ఈ ఏడాది ఆడిన 14 ఇన్నింగ్స్‌ల్లో రాహుల్‌ 11 పర్యాయాలు ఎల్బీడబ్ల్యూ, క్లీన్‌ బౌల్డ్‌గానో అవుటయ్యాడు. 7 ఇన్నింగ్స్‌లుగా రాహుల్‌ కనీసం ఒక్క హాఫ్ సెంచరీ సాధించలేదు.

Story first published: Tuesday, December 25, 2018, 8:57 [IST]
Other articles published on Dec 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X