న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: డే/నైట్ టెస్టు‌పై కరోనా ఎఫెక్ట్.. మ్యాచ్ మధ్యలోనే వారు ఇంటికి!!

India vs Australia: Coronavirus outbreak impacts Adelaide Test as commentators sent home

అడిలైడ్‌: సుదీర్ఘ పర్యటనలో భాగంగా కంగారూల గడ్డపై భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌పై కరోనా మహమ్మారి ప్రభావం పడింది. ఆసీస్ ప్రధాన నగరం అయిన సిడ్నీలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో..టెస్ట్ సిరీస్‌కి కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లలో కొంత మందిని ఇంటికి పంపారు. ఇంటికి వెళ్లిన వారిలో ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌ లీ కూడా ఉన్నాడు. గురువారం డే/నైట్ టెస్టులో లీ కామెంటరీ చెప్పగా.. ఈరోజు మాత్రం విధులకు హాజరుకాలేదు.

కరోనా కేసులు నమోదవడంతో

కరోనా కేసులు నమోదవడంతో

టెస్ట్ సిరీస్‌ని ప్రసారం చేస్తున్న ఫాక్స్ స్పోర్ట్స్, ఛానెల్ 7 కూడా తమ స్టాఫ్‌లో కొంత మందిని ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా అధికారులు ఆదేశించింది. సిడ్నీలోని నార్తర్న్ బీచ్స్ ప్రాంతంలో శుక్రవారం 28 కరోనా కేసులు నమోదవడంతో ఛానల్ 7 మరియు ఫాక్స్ స్పోర్ట్స్ రెండూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. తమ సిబ్బందిని వైరస్ టెస్ట్ కోసం ఆసుపత్రికి పంపించాయి. డే/నైట్ టెస్టు రెండవ రోజు మొదటి బంతికి ముందు పరీక్షల కోసం పంపిన వారిలో కెమెరామెన్ మరియు ఫోటోగ్రాఫర్లు కూడా ఉన్నారు.

సిడ్నీ టెస్టుపై సందేహం

సిడ్నీ టెస్టుపై సందేహం

సెన్ రేడియో యాజయాన్యం బ్రాడ్ హాడిన్, గావిన్ రాబర్ట్‌సన్ మరియు మాట్ వైట్లను సిడ్నీకి తిరిగి పంపించింది. వీరందరూ మిగిలిన నాలుగు రోజులు స్టూడియో నుంచి వ్యాఖ్యానం చేయనున్నారు. డే/నైట్ టెస్టు అడిలైడ్‌ వేదికగా జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జనవరి 7 నుంచి 11 వరకూ జరగాల్సిన మూడో టెస్టుపై సందేహాలు నెలకొన్నాయి.

వారు బబుల్‌లో లేరు

వారు బబుల్‌లో లేరు

ఆస్ట్రేలియా గడ్డపై భారత్ సిరీస్ మొత్తం బయో-సెక్యూర్ వాతావరణంలో జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు జట్ల క్రికెటర్లతో పాటు కోచ్‌లు, సహాయ సిబ్బంది క్వారంటైన్‌లో ఉండి కరోనా పరీక్షల అనంతరం ఈ బబుల్‌లోకి వచ్చారు. అయితే మ్యాచ్ కామెంటేటర్లు, ఛానల్ స్టాఫ్ మాత్రం ఈ బబుల్‌లో లేరు. మ్యాచ్‌ గ్యాప్‌లో వారు ఇంటికి వెళ్లి.. మళ్లీ విధులకి వస్తున్నారు. ఈ క్రమంలో బ్రెట్ లీ కూడా ఇటీవల సిడ్నీ నుంచి రాగా.. ఛానల్ స్టాఫ్ కూడా అలానే వచ్చారు. సిడ్నీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని ఇంటికి వెళ్లిపోవాలని ఆదేశించారు.

అర్ధంతరంగా తప్పుకున్న లీ

అర్ధంతరంగా తప్పుకున్న లీ

కామెంటేటర్‌గా ఉన్న బ్రెట్‌ లీని క్వారంటైన్‌లో ఉండి.. విధులకి హాజరయ్యే వెసులబాటుని కల్పించారు. అయితే త్వరలోనే క్రిస్మస్ పండగ రాబోతుండటంతో.. ఫ్యామిలీతో సమయం గడపాలని నిర్ణయించుకున్నబ్రెట్ లీ తాను సిరీస్‌లో కామెంటేటర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో అడిలైడ్‌ వేదికగా జరుతున్న డే/నైట్ టెస్టు నుంచి లీ అర్ధంతరంగా తప్పుకున్నాడు. లీ స్థానంలో ఛానల్ యాజమాన్యం మరొకరికి తీసుకుంది. ఫాక్స్ స్పోర్ట్స్ బాస్ స్టీవ్ క్రాలే శుక్రవారం ఉదయం వ్యాఖ్యాత బ్రెట్ లీని సిడ్నీకి పంపినట్లు ధృవీకరించారు.

పృథ్వీ షా.. నీకు బ్యాటింగే రాదనుకున్నాం! క్యాచ్‌ పట్టడం కూడా రాదా?.. జట్టుకు భారంగా మారావ్!

Story first published: Friday, December 18, 2020, 16:32 [IST]
Other articles published on Dec 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X