
నీకు బ్యాటింగే రాదనుకున్నాం
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో 23వ ఓవర్లో మార్నస్ లబుషేన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను పృథ్వీ షా వదిలేశాడు. 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో లబుషేన్ ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అయితే షా వదిలేసిన క్యాచ్ అంత కష్టంగా కూడా ఏమీ లేదు. బ్యాటింగ్‌లో డకౌట్ అయ్యాడన్న విమర్శలున్న 'షా'ను నెటిజన్లు మరోసారి టార్గెట్ చేశారు. 'ఆ క్యాచ్ కూడా పట్టవా?' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. 'పృథ్వీ షా జట్టుకు భారంగా మారాడు' అని మరో నెటిజన్ ట్వీటాడు. 'నీకు బ్యాటింగే రాదనుకున్నాం.. ఇప్పుడు క్యాచ్ పట్టడం కూదా రాదని తెలిసిపోయింది', 'షా కెరీర్ డేంజర్ జోన్లో పడింది', 'భారత్ 10 మంది.. ఆసీస్ 12 మందితో ఆడుతుంది', 'క్యాచ్‌లు పట్టడం రానివాడు అంతర్జాతీయ క్రికెట్లోకి ఎలా వచ్చాడు' అంటూ షాను ఆటాడుకుంటున్నారు.
నక్కతోక తొక్కిన లబుషేన్
మార్నస్ లబుషేన్ ఈరోజు నక్కతోకను తొక్కాడు. ఇప్పటికే మూడు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సున్నా వద్ద బుమ్రా బౌలింగ్‌లో లబుషేన్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ సాహా వదిలేయగా.. 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద షమీ బౌలింగ్‌లో ఇచ్చిన సునాయస క్యాచ్‌ను బుమ్రా నేలపాలు చేశాడు. ఆపై 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బుమ్రా బౌలింగ్‌లో లబుషేన్ ఇచ్చిన మరో క్యాచ్‌ను పృథ్వీ చేజార్చాడు. ఈ అవకాశాలను అందిపుచ్చుకున్న లబుషేన్ (47 బ్యాటింగ్) క్రీజులో కుదురుకొని హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.

కోహ్లీ అసహనం
ఈ మ్యాచులో టీమిండియా చెత్త ఫీల్డింగ్‌తో తీవ్రంగా నిరాశపరిచింది. పదే పదే ఆసీస్ ఆటగాళ్లు ఇచ్చిన సులువైన క్యాచ్‌లను నేలపాలు చేసింది. దీంతో భారత ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. భారత ప్లేయర్లు క్రిస్మస్ మూడ్‌లో ఉన్నారని, తమ ప్రత్యర్థి క్యాచ్‌లు నేలపాలు చేస్తూ పండుగ గిఫ్ట్‌లు ఇస్తున్నారని విమర్శించాడు. 'భారత ఫీల్డర్లు క్రిస్మస్ మూడ్‌లో ఉన్నట్టున్నారు. వారం ముందుగానే క్రిస్మస్ బహుమతులు ఇచ్చేస్తున్నారు' అని సెటైర్లు వేశాడు. క్యాచ్‌లు చేజార్చడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అసహనం వ్యక్తం చేశాడు.

పాతుకుపోయిన లబుషేన్
భారత బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు మాథ్యూ వేడ్ (8), జో బర్న్స్ (8)లను బుమ్రా పెవిలియన్ చేర్చగా.. కీలక స్టీవ్ స్మిత్ (1) వికెట్‌తో పాటు ట్రావిస్ హెడ్ (7), కామెరూన్ గ్రీన్ (11)లను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులో లబుషేన్ (47 బ్యాటింగ్), కెప్టెన్ టిమ్ పైన్ (26 బ్యాటింగ్) ఉన్నారు. ముఖ్యంగా లబుషేన్ క్రీజులో పాతుకుపోయాడు. లబుషేన్, పైన్ 32 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆసీస్ ఇంకా భారత్ స్కోరుకు 133 పరుగులు వెనకపడి ఉంది.
51 సంవత్సరాల తర్వాత.. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు!!


Click it and Unblock the Notifications












