న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దశాబ్దాల నాటి కల నెరవేరింది.. సిరీస్ భారత్ వశం

India vs Australia : Virat Kohli Feels Proud In Winning Match Against Australia | Oneindia Telugu
India vs Australia, 4th Test, Day 5 at Sydney: Kohli Hails Series Victory as Greatest Achievement

సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుని రికార్డులు తిరగరాసింది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్‌ను వర్షం కారణంగా రద్దు చేశారు. చివరి రోజు మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే ముగిసింది. దీంతో సిడ్నీ టెస్టును 'డ్రా'గా ముగించడంతో 2-1 తేడాతో గవాస్కర్‌ - బోర్డర్‌ సిరీస్‌‌ను గెలిచి దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఘనతను కోహ్లీ సేన సాకారం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్లలో తొలి సారి టెస్టు సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకోవడం విశేషం. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో మాత్రం భారత్‌ సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్‌కు 7 విజయాలు దక్కాయి.

ఆఖరి రోజు అవాంతరంతో ముగిసిన మ్యాచ్

ఆఖరి రోజు అవాంతరంతో ముగిసిన మ్యాచ్

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌కు వరుణుడు పలుమార్లు అడ్డం పడ్డాడు. రెండు రోజుల నుంచి ఆటకి మధ్యలో అంతరాయం కలిగిస్తున్న వర్షం.. సోమవారం కూడా కొనసాగి మ్యాచ్ ఆడేందుకు వీలుకాలేదు. ఉదయం నుంచి సిడ్నీలో చిరుజల్లు కురుస్తుండటంతో.. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. దీంతో.. అప్పటికే రెండు గంటలు ఆట సమయం వృథా అయిపోయింది. దీంతో తప్పని పరిస్థితుల్లో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ని భారత్ 2-1తో చేజిక్కించుకుంది.

క్రికెటర్ కంటే ముందు.. అదే కావాలనుకున్నా: మయాంక్

కంగారూలని ఫాలో ఆన్ ఆడించిన కోహ్లీ

కంగారూలని ఫాలో ఆన్ ఆడించిన కోహ్లీ

323 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా ఆదివారం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది ఆసీస్. అంతకంటే ముందు అదే రోజు ఓవర్‌నైట్ స్కోరు 236/6తో తొలి ఇన్నింగ్స్‌‌ని కొనసాగించడంతో కుల్దీప్ యాదవ్ (5/99) ధాటికి 300 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో.. 322 పరుగుల భారీ ఆధిక్యం భారత్‌కి లభించింది. కోహ్లీ అనూహ్య నిర్ణయం తీసుకుంటూ కంగారూల జట్టుని కెప్టెన్ కోహ్లీ ఫాలో ఆన్ ఆడించాడు. అయితే.. కొద్దిసేపటికే వెలుతురులేమి కారణంగా ఆదివారం ఆట నిలిచిపోయింది.

తొలి ఇన్నింగ్స్‌ని 622/7తో డిక్లేర్ చేసిన భారత్

అప్పటికి ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 6/0తో నిలవగా.. క్రీజులో ఓపెనర్లు ఖవాజా (4 బ్యాటింగ్: 12 బంతుల్లో 1ఫోర్), హారిస్ (2 బ్యాటింగ్: 12 బంతుల్లో) ఉన్నారు. ఆ జట్టు ఓటమిని తప్పించుకోవాలంటే సోమవారం మొత్తం క్రీజులో నిలవాల్సి ఉండగా.. చివరి రోజు కాస్తా వర్షార్ఫణం అయింది. శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (193: 373 బంతుల్లో 22ఫోర్లు), రిషబ్ పంత్ (159 నాటౌట్: 189 బంతుల్లో 15ఫోర్లు, 1సిక్సు)సెంచరీలు బాదడంతో తొలి ఇన్నింగ్స్‌ని భారత్ 622/7తో డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.

టెస్టు సిరీస్ విజయం ముగిసిందిలా

అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో, మెల్‌బౌర్న్ టెస్టులో 137 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియాపై 146 పరుగులతో ఆస్ట్రేలియా గెలుపొంది విజయం సాధించింది. ఇక ఆఖరిదైన సిడ్నీ టెస్టులో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. సిరీస్ మొత్తంలో 521 పరుగులతో ఛటేశ్వర్‌ పుజారా సిరీస్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలువగా, అత్యధిక వికెట్లు బుమ్రా (21 వికెట్లు) పడగొట్టాడు. మహ్మద్‌ షమీ 16 వికెట్లు, ఇషాంత్‌ శర్మ 11 వికెట్లు తీశారు.

1
43626
Story first published: Monday, January 7, 2019, 10:30 [IST]
Other articles published on Jan 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X