క్రికెటర్ కంటే ముందు.. అదే కావాలనుకున్నా: మయాంక్

సిడ్నీ: అవకాశం అందగానే సత్తా నిరూపించుకున్నాడు టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్. తొలి టెస్టు మ్యాచ్‌లోనే అదరగొట్టి క్రమంగా తన స్థాయిని పెంచుకుంటూనే ఉన్నాడు. అరంగేట్ర టెస్టులో 118 పరుగులు చేసి సత్తా చాటాడు. ఆసీస్‌తో సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ 77 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో తనదైన మార్క్ చూపించిన మయాంక్.. జాతీయ జట్టులో చేరినా.. మరో కలను నెరవేర్చుకోలేకపోయానని అంటున్నాడు. క్రికెటర్ల కలలకు తుది గమ్యంగా నిలిచే టీమిండియాలో చోటు కంటే వేరేది ఉందని మాయంక్‌కు ఇటీవల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని గురించి చెప్పుకొచ్చాడు.

సైన్స్ చదివి పైలట్ అవ్వాలనుకున్నా
‘చిన్నప్పటి నుంచి విమానాలు అంటే చాలా ఇష్టం. ఆ కారణంతోనే సైన్స్ చదివి పైలట్ అవ్వాలనుకున్నా. కానీ అనుకోకుండా క్రికెట్‌ను ఆప్షన్‌గా ఎంచుకున్నా. దాంతో క్రికెట్ కలైతే తీరింది. కర్ణాటక జట్టుకు నేను ఆడే సమయంలో నా మీద నాకు నమ్మకం పెరిగింది. అప్పటిదాకా క్రికెట్ ఆడగలనా అనే సందేహం ఉండేది. కానీ సొంత రాష్ట్రానికి ఆడేటప్పుడే నాకు క్రికెట్ సరైందనిపించింది.

అయోమయం పడకుండా లక్ష్యం మీదే
అంతకుముందు పైలట్‌ని అవ్వాలని ఉందన్న నా కోరికను మా తల్లిదండ్రుల ముందు బయటపెట్టా. దానికి వాళ్లు నన్ను ఏమీ అనలేదు. అంతేకాదు తర్వాత క్రికెటర్‌ని అవుతానన్నా అభ్యంతరం చెప్పలేదు. అంతేకాకుండా వెన్నంటే ఉండి నాకెంతో ప్రోత్సాహాన్ని అందించారు. అయోమయం పడకుండా ఒక లక్ష్యం మీదే ఏకాగ్రత నిలిపేలా చేశారు. నా కోరికలను, ఆసక్తులను భయపడకుండా ఎప్పటికప్పుడు బయటికి వ్యక్తం చేయమని కోరే వారు.

టీమిండియా మ్యాచ్‌లకు సిద్ధంగా ఉండమని
‘ఓసారి నాతో రవి శాస్త్రి సర్ మాట్లాడుతూ.. టీమిండియా మ్యాచ్‌లకు సిద్ధంగా ఉండమని, త్వరలో నాకు కూడా అవకాశం వస్తుందని అన్నారు. ఆ మాట వినగానే నోట మాట రాలేదు. కాసేపు అలాగే ఉండిపోయా. తర్వాత ఒకింత భావోద్వేగానికి గురయ్యాను. పైలట్ కోరికను పక్కన పెట్టాక దృష్టంతా క్రికెట్ మీదే పెట్టాను. భారత జట్టుకు ఆడాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను. అది ఇప్పటికి నెరవేరింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications