న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI vs ZIM 1st ODI: రాహుల్ త్రిపాఠి అరంగేట్రం! ఇషాన్ కిషన్ డౌట్!

 India Playing XI vs ZIM 1st ODI: Rahul Tripathi likely to make India debut

హైదరాబాద్: జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగే తొలి వన్డే‌కు సిద్దమైంది. ఆసియా కప్ ముందు ఈ సిరీస్ జరుగుతుండటంతో సీనియర్ ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకోగా.. కేఎల్ రాహుల్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టు బరిలోకి దిగుతోంది. ఆసియాకప్‌కు ఎంపికైన జట్టులో నలుగురు ఆటగాళ్లు మాత్రమే ఈ సిరీస్ ఆడుతున్నారు. కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా, అక్షర్ పటేల్‌తో పాటు ఆవేశ్ ఖాన్‌లు ఈ సిరీస్‌లో సత్తా చాటడంపై ఫోకస్ పెట్టారు. ఇక్కడ రాణించి ఆసియాకప్‌లో బరిలోకి దిగే భారత తుది జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో రాహుల్‌కు ఇది లిట్మస్ టెస్ట్‌లా మారింది.

 రాహుల్ త్రిపాఠి అరంగేట్రం..

రాహుల్ త్రిపాఠి అరంగేట్రం..

ఆసియాకప్ జట్టులో చోటు దక్కించుకున్న నేపథ్యంలో ఈ నలుగురి ఆటగాళ్లు జింబాబ్వేతో తొలి మ్యాచ్‌లో చోటు దక్కడం ఖాయమైంది. మిగతా స్థానాల్లోనే ఎవరికి అవకాశం దక్కుతుందా? అనేది ఆసక్తిగా మారింది. ఐపీఎల్‌లో సత్తా చాటిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠికి ఈసారైనా అవకాశం దక్కుతుందా? లేదా? అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఐర్లాండ్ పర్యటనకు ఎంపికైనప్పటికీ త్రిపాఠికి తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే టాప్ ఆటగాళ్ల గైర్హాజరీలో త్రిపాఠికి అవకాశం దక్కుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 ఓపెనర్లుగా రాహుల్, ధావన్..

ఓపెనర్లుగా రాహుల్, ధావన్..

చివరి నిమిషంలో జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్.. శిఖర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఆసియా కప్ నేపథ్యంలో పూర్తి స్థాయి మ్యాచ్ ప్రాక్టీస్ లభించాలనే రాహుల్‌ను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేశారు. కాబట్టి అతను మూడు మ్యాచ్‌ల్లో ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. వెస్టిండీస్ పర్యటనలో ధావన్‌తో కలిసి అదరగొట్టిన శుభ్‌మన్ గిల్ ఫస్ట్ డౌన్‌లో దిగే అవకాశం ఉంది. ఓపెనర్‌గా గిల్ రాణించినా.. రాహుల్ కోసం మిడిలార్డర్‌లో ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 ఇషాన్ కిషన్ డౌట్..

ఇషాన్ కిషన్ డౌట్..

నాలుగో స్థానంలో రాహుల్ త్రిపాఠి బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే అతనికి ఇషాన్ కిషన్‌తో పోటీ నెలకొంది. ఐదు ఆరు స్థానాల్లో బరిలోకి దిగే దీపక్ హుడా, సంజూ శాంసన్ రైట్ హ్యాండ్ బ్యాటర్లు కావడం త్రిపాఠి కూడా కుడి చేతివాటం అయిన నేపథ్యంలో లెఫ్టాండర్ అయిన ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వచ్చు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌లో అతన్ని పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ పంపించే అవకాశం ఉంది. దీనిపై పెద్దగా ఫోకస్ పెట్టకుంటే మాత్రం రాహుల్ త్రిపాఠి ఆడటం ఖాయం. వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజూ ప్లేస్‌కు డోకాలేదు. ఇటీవల వెస్టిండీస్‌తో అతను దుమ్మురేపాడు. దీపక్ హుడా పార్ట్ టైమ్ బౌలర్‌గా అవకాశం అందుకోనున్నాడు.

శార్దూల్ ఔట్.. సిరాజ్ ఇన్..

శార్దూల్ ఔట్.. సిరాజ్ ఇన్..

స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ ఆడటం ఖాయం. మరో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ బరిలోకి దిగనున్నాడు. వాషింగ్టన్ సుందర్ గాయంతో సిరీస్‌కు దూరమవడంతో అతనికి పోటీ లేకుండా పోయింది. ప్రధాన పేసర్‌గా మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగనుండగా.. దీపక్ చాహర్, ఆవేశ్ ఖాన్ అతనితో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. శార్దూల్ ఠాకూర్ జట్టులోకి తీసుకుంటే మాత్రం దీపక్ చాహర్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు.

 తుది జట్టు (అంచనా):

తుది జట్టు (అంచనా):

కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి/ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సంజూ శాంసన్(కీపర్), అక్షర్ పటేల్, దీపక్ చాహర్/శార్దూల్ ఠాకూర్, సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్

Story first published: Tuesday, August 16, 2022, 15:19 [IST]
Other articles published on Aug 16, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X