న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు: టీమిండియా బ్యాటింగ్ కోచ్

India batting coach Vikram Rathour reveals Virat Kohlis biggest strength

న్యూఢిల్లీ: సమకాలీన క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ అంతా ఒకవైపు.. విరాట్‌ కోహ్లీ ఒక్కడే ఒక వైపు.. కొన్నెళ్ల క్రితం అతడి మాటలో మాత్రమే దూకుడెక్కువ అన్న వాళ్లకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు. క్రీజులోకి వచ్చి ప్రత్యర్థులకు దడ పుట్టించాడు.. ఎంతలా అంటే 'మనం తప్పు చేయడానికి వీల్లేదు జాగ్రత్త... క్రీజ్‌లో కోహ్లీ ఉన్నాడు..! అని ప్రతి కెప్టెన్‌ తన సహచరులతో అనేంతా.. ఒకప్పుడు సచిన్‌.. ఇప్పుడు కోహ్లీ అని అందరూ చెప్పుకునేంతా.. తనదైన ఆటతో అన్ని ఫార్మాట్లలో ఈ తరం చూసిన అత్యుత్తమ నాయకుడుగా అవతరించాడు.

నేను చూసిన హార్డెస్ట్ క్రికెటర్..

నేను చూసిన హార్డెస్ట్ క్రికెటర్..

మైదానంలో తిరుగులేని శక్తిగా, భారత క్రికెట్‌ ముఖచిత్రంగా ఎదిగిన ఈ రథ సారథిపై భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత జట్టు బలమే కోహ్లీ అని కొనియాడాడు. తాజాగా ‘స్పోర్ట్స్ కీదా'‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ రన్ మిషన్ సక్సెస్‌కు గల కారాణాన్ని వెల్లడించాడు. పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయడమే కోహ్లీ అతిపెద్ద బలమని చెప్పుకొచ్చాడు.

‘నా ధృష్టిలో ఆటపట్ల విరాట్ కోహ్లీకి ఉన్న కమిట్‌మెంటే గొప్ప విషయం. ప్రపంచంలోనే బెస్ట్‌ ప్లేయర్‌గా నిలవాలనే తాపత్రయంతో చాలా కష్టపడుతుంటాడు. ఆ నిబద్ధతే ఈరోజు కోహ్లిని ఉన్నత స్థానంలో నిలిపింది. నేను చూసిన హార్డెస్ట్ వర్కింగ్ క్రికెట్ విరాట్ కోహ్లీనే. అన్నింటికంటే కోహ్లికున్న అనుకూలతలే అతని అతిపెద్ద బలం అని ఎప్పటికి నమ్ముతా.'అని రాథోడ్ తెలిపాడు.

కోహ్లీ అలా కాదు..

కోహ్లీ అలా కాదు..

ఇక విరాట్ ఒకే తరహా ఆడే ఆటగాడు కాదని, పరిస్థితులను బట్టి తన బ్యాటింగ్ శైలిని మార్చుతూ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడని ఈ బ్యాటింగ్ కోచ్ పేర్కొన్నాడు. ‘విరాట్ ఒకే డైమన్షన్ ఆటగాడు కాదు. పరిస్థితులను బట్టి అతని ఆటను మార్చుకుంటాడు. ఫార్మాట్‌కు తగ్గట్టు విభిన్నంగా ఆడుతుంటాడు. అదే అతని అతిపెద్దబలం'అని విక్రమ్ రాథోడ్ చెప్పాడు.

ఐపీఎల్ 2016 చూస్తే..

ఐపీఎల్ 2016 చూస్తే..

ఇక కోహ్లీ ఎంత భిన్నమైన ఆటగాడో ఐపీఎల్ 2016 చూస్తే అర్థమవుతందని ఈ భారత్ కోచ్ తెలిపాడు. ‘ఐపీఎల్‌ 2016 సీజన్‌లో కోహ్లీ నాలుగు సెంచరీలు బాదాడు. అందులో 40 సిక్సర్లు ఉన్నాయి. ఆ సీజన్ ఆసాంతం అత్యుత్తమ ఆటను ప్రదర్శించాడు. అంత దూకుడుగా ఆడిన విరాట్.. ఐపీఎల్‌ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో ఆడిన మొదటి మ్యాచ్‌లో ఒక్క సిక్స్ లేకుండా డబుల్‌ సెంచరీ సాధించాడు. రెండు నెలల పాటు తన దూకుడుతో అలరించిన కోహ్లీ అనంతరం టెస్ట్ ఫార్మాట్‌కు తగ్గట్టు తన బ్యాటింగ్ మార్చుకున్నాడు. అందుకే కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ లో ఒకడిగా నిలిచాడు.'అని రాథోడ్ చెప్పుకొచ్చాడు.

ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేం..

ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేం..

ఇక భారత జట్టులో మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదని రాథోడ్ పేర్కొన్నాడు. రిషభ్ పంత్‌కు టీమ్‌మెనేజ్‌మెంట్ మద్దతు ఉందని, అతనో ప్రత్యేకమైన ఆటగాడన్నాడు. పంత్ టచ్‌లోకి వస్తే ఆపడం కష్టమని, వరుస వైఫల్యాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని చెప్పుకొచ్చాడు.

క్రికెట్‌లో నెపోటిజమ్ లేదా? సచిన్ కొడుకనే అర్జున్‌ టెండూల్కర్‌ను ఎంపిక చేయలేదా?

Story first published: Sunday, June 28, 2020, 12:32 [IST]
Other articles published on Jun 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X