న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హ‌డ‌లెత్తించిన హేజిల్‌వుడ్, క‌మ్మిన్స్‌.. కుప్ప‌కూలిన కోహ్లీసేన.. ఆస్ట్రేలియా టార్గెట్ 90

India 36/9 after Mohammed Shami retires hurt, Australia target 90

అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్‌ తడబడ్డారు. పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ ధాటికి భారత ఆటగాళ్లు ఒక సెషన్ కూడా ఆడకుండానే పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌ పూర్తిగా చేతులెత్తేయడంతో.. 21.2 ఓవర్లలో 36 పరుగులకే టీమిండియా చాపచుట్టేసింది. మొహ్మద్ షమీ రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. శనివారం మూడో రోజు ఆట మొదలైన రెండో ఓవర్‌ నుంచే వికెట్ల వేట మొదలెట్టిన ఆసీస్‌ బౌలర్లు గంటన్నరలో భారత బ్యాట్స్‌మెన్‌ను కుప్పకూల్చారు. ఒక్క భారత బ్యాట్స్‌మెన్‌ కూడా రెండంకెల స్కోర్‌ నమోదు చేయకపోవడంతో ఆస్ట్రేలియా ముందు భారత్ 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది.

 టెస్టుల్లో అత్యల్ప స్కోరు..

టెస్టుల్లో అత్యల్ప స్కోరు..

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా మరీ ఘోరంగా విఫలమైంది. 4,9,2,0,4,0,8,4,0,4, 1.. ఇవి టీమిండియా ఆటగాళ్లు నమోదు చేసిన వరుస స్కోర్లు. పింక్‌ బాల్‌ స్టులో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్‌ ఎలా సాగిందనడానికి ఈ పరుగులే నిదర్శనం. అసలు ఆడుతుంది అంతర్జాతీయ మ్యాచ్‌ లేక గల్లీ క్రికెట్‌ అనే అనుమానం కలిగింది. 31 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి టెస్టు చరిత్రలో అతి తక్కువ స్కోరు నమోదు చేసింది. టెస్టుల్లో తమ అత్యల్ప స్కోరు (42)ను తిరగరాసింది. టెస్టు చరిత్రలోనే 4వ అత్యల్ప స్కోరును సమం చేసింది.

 హేజ‌ల్‌వుడ్‌ నిప్పులు:

హేజ‌ల్‌వుడ్‌ నిప్పులు:

శుక్రవారం చివరి సెషన్‌లోనే ఓపెనర్ పృథ్వీ షా (4) ఔటవగా.. నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా (2: 17 బంతుల్లో) ఈరోజు ఆరంభంలోనే ఫాస్ట్ బౌలర్ కమిన్స్‌ బౌలింగ్‌లో అతనికే సులువైన క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత స్పీడ్ బౌల‌ర్లు జోష్ హేజ‌ల్‌వుడ్‌, ప్యాట్ క‌మ్మిన్స్‌లు ఇండియ‌న్ టాప్ ఆర్డ‌ర్‌ను దెబ్బ‌తీశారు. నిప్పులు చెరిగే బంతులు వేస్తూ.. భార‌త బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టారు. దీంతో టెస్ట్ స్పెసలిస్ట్ చతేశ్వర్ పుజారా (0), కెప్టెన్ విరాట్ కోహ్లీ (4) వైస్ కెప్టెన్ అజింక్య రహానె (0)తో పాటు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (9: 40 బంతుల్లో 1x4) వరుస ఓవర్లలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. దీంతో కీలక వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆస్ట్రేలియా లక్ష్యం 90:

ఆస్ట్రేలియా లక్ష్యం 90:

ఆపై ఆడుకుంటారనుకున్న వృద్ధిమాన్ సాహా (4), హనుమ విహారి (8) కూడా ఔట్ అవ్వడంతో భారత్ ఆశలు వదులుకుంది. అశ్విన్ (0), ఉమేష్ (4) కూడా అందరిని అనుసరించారు. చివరికి మహ్మద్‌ షమి(1) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుతిరగడంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 53 పరుగుల ఆధిక్యం లభించడంతో ఆస్ట్రేలియా లక్ష్యం 90 పరుగులుగా నమోదైంది. హాజిల్‌వుడ్‌ 5/8, కమిన్స్‌ 4/21 నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడడంతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ పేక మేడలా కూలింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోర్‌ నమోదు చేయలేదంటే కోహ్లీసేన ఎలా ఆడిందో అర్థమవుతుంది.

రెండో ఇన్నింగ్స్‌: చెలరేగిన కమిన్స్.. ఆరు వికెట్లు కోల్పోయిన భారత్!!

Story first published: Saturday, December 19, 2020, 11:51 [IST]
Other articles published on Dec 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X