న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs WI: గాయంతో పొలార్డ్ దూరం! ఇషాన్ ఔట్.. రాహుల్ ఇన్! భారత్‌దే బ్యాటింగ్

West Indies opt to bowl, KL Rahul back for India

అహ్మదాబాద్: టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు వెస్టిండీస్ రెగ్యులర్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ దూరమయ్యాడు. దాంతో నికోలస్ పూరన్ తాత్కలిక సారథిగా జట్టును నడిపిస్తున్నాడు. టాస్‌ గెలిచి పూరన్ చేజింగ్‌కు మొగ్గు చూపాడు.

అహ్మదాబాద్ మైదానం సెకండ్ బ్యాటింగ్‌కు అనుకూలమనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. పొలార్డ్ కొంచెం అస్వస్థతకు గురయ్యాడని దాంతోనే ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని తెలిపాడు. అతని స్థానంలో ఒడీన్ స్మిత్‌ను తీసుకున్నామని చెప్పాడు. విజయం కోసం సాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నాడు.

ఇక భారత జట్టులో ఓ కీలక మార్పు చేసుకుంది. వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేకు దూరమైన కేఎల్ రాహుల్ రీఎంట్రీ ఇవ్వడంతో ఇషాన్ కిషన్‌ బెంచ్‌కు పరిమితమయ్యాడు. మిగతా జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఫస్ట్ వన్డేలో అదరగొట్టిన స్పిన్ ద్వయం చాహల్, సుందర్‌లను భారత టీమ్‌మేనేజ్‌మెంట్ కొనసాగించింది.

ఇక టాస్ గెలిచినా తాము బ్యాటింగే తీసుకునే వాళ్లమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. వీలైనన్ని పరుగులు చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచుతామని తెలిపాడు. జట్టులో ఒకే ఒక మార్పు చోటు చేసుకుందన్నాడు. ఇషాన్ స్థానంలో రాహుల్‌ను తీసుకున్నామని చెప్పాడు.

తొలి వన్డేలో భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. అటు బౌలింగ్‌లో ప్రత్యర్థిని కట్టడి చేసిన తర్వాత బ్యాటింగ్‌ జోరుతో 28 ఓవర్లలోనే ఆట ముగించింది. ఈ మ్యాచ్ ఆడటం ద్వారా విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

స్వదేశంలో 100 వన్డే మ్యాచ్‌ల మైలురాయిని అందుకున్నాడు. ఫలితంగా భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్(164), ఎంఎస్‌ ధోని(127), అజహారుద్దీన్(113), యువరాజ్‌ సింగ్‌(108)ల సరసన కోహ్లీ చేరాడు. క్రికెట్‌ చరిత్రలో ఇలా స్వదేశాల్లో 100 వన్డేలు ఆడిన ఆటగాళ్లు కోహ్లీ కంటే ముందు 35 మంది మాత్రమే ఉన్నారు.

తుది జట్లు:

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిధ్ కృష్ణ

IND vs WI 1st ODI: Team India Win 1000th ODI, Take 1-0 Lead | Oneindia Telugu

వెస్టిండీస్: షై హోప్(కీపర్), బ్రాండన్ కింగ్, డారెన్ బ్రావో, శమరా బ్రూక్స్, నికోలస్ పూరన్(కెప్టెన్), జాసన్ హోల్డర్, ఓడీన్ స్మిత్, ఫాబియన్ అలెన్, అకీల్ హోస్సెన్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్

Story first published: Wednesday, February 9, 2022, 13:36 [IST]
Other articles published on Feb 9, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X