న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs WI: రెండో వన్డేలో భారత్ గెలవాలంటే ఈ రెండు మార్పులు చేయాల్సిందే!

IND vs WI: Team India should make 3 Tactical Changes for 2nd ODI aginst West Indies

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అదే వేదిక.. అదే ప్రత్యర్థి.. మూడు రోజుల వ్యవధిలో వెస్టిండీస్‌తో రెండో వన్డే ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. శుక్రవారం తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థి భయపెట్టినా.. కీలక సమయంలో ఒత్తిడి అధిగమించి మూడు పరుగుల తేడాతో భారత్‌ గెలిచింది. ఆదివారం రెండో మ్యాచ్‌లోనూ నెగ్గి మరో పోరు మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.

ఈ మ్యాచ్‌లోనూ పరాజయం పాలైతే సిరీస్‌ కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎలాగైన విజయం సాధించాలని విండీస్‌ భావిస్తుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ గెలిచి పరాజయాల పరంపరకు బ్రేక్ ఇవ్వాలనుకుంటుంది. ఈ క్రమంలోనే రెండో వన్డే సైతం అభిమానులకు కావాల్సిన మజాను అందించనుంది. అయితే రెండో మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే వ్యూహాత్మకంగా రెండు మార్పులు చేయాల్సి ఉంది.

సంజూ శాంసన్‌ను తప్పించాలి..

సంజూ శాంసన్‌ను తప్పించాలి..

తొలి వన్డేలో టాప్-3 బ్యాటర్లంతా హాఫ్ సెంచరీలు కొట్టడంతో 350 పరుగులు చేసేలా కనిపించిన భారత్ మిడిలార్డర్ వైఫల్యం కారణంగా సాధారణ స్కోర్‌కే పరిమితమైంది. అందుకే విజయం కోసం చివరి బాల్ వరకూ పోరాడాల్సి వచ్చింది. ముఖ్యంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సంజూ శాంసన్ తొలి వన్డేలో నిరాశ పరిచాడు. ఇషాన్ కిషన్‌ను కాదని అవకాశం ఇస్తే సంజూ శాంసన్ 12 పరుగులే చేశాడు. కాబట్టి అతన్ని పక్కనపెట్టి ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోవాలి. శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా రాణించడంతో ఇషాన్‌ను ఫస్ట్ డౌన్‌లో పంపించాలి.

అర్షదీప్ సింగ్‌కు చాన్సివ్వాలి..

అర్షదీప్ సింగ్‌కు చాన్సివ్వాలి..

ఇక పేసర్ ప్రసిధ్ కృష్ణ తొలి వన్డేలో దారుణంగా విఫలమయ్యాడు. దారళంగా పరుగులివ్వడమే కాకుండా ఒక్క వికెట్ కూడా తీయలేదు. మహమ్మద్‌ సిరాజ్‌ (2/57), శార్దూల్ ఠాకూర్ (2/54), యుజ్వేంద్ర చాహల్ (2/58) రాణించడంతో ప్రసిధ్ వైఫల్యం పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే రెండో వన్డేలో కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొత్త బంతితో సత్తా చాటగలిగిన అర్షదీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకోవాలి. అతను డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కూడా. ఐపీఎల్‌లో చాలా మ్యాచ్‌లో కట్టడిగా బౌలింగ్ చేశాడు.

తుది జట్లు(అంచనా)

తుది జట్లు(అంచనా)

శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్(కీపర్), శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ/అర్షదీప్ సింగ్

వెస్టిండీస్‌: షై హోప్‌, కింగ్‌, బ్రూక్స్‌, మేయర్స్‌, పూరన్‌ (కెప్టెన్‌), పావెల్‌, హోల్డర్‌, అకీల్‌, అల్జారి జోసెఫ్‌, మోటీ, సీల్స్‌

Story first published: Sunday, July 24, 2022, 13:01 [IST]
Other articles published on Jul 24, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X