న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs WI, 3rd ODI: ఒత్తిడిలో శిఖర్ ధావన్, గాడిలో పడేనా?

 IND vs WI: Shikhar Dhawan under pressure to score big with series on line in 3rd ODI

హైదరాబాద్: టీ20 సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరిస్‌పై కన్నేసింది. వెస్టిండిస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్‌లో ఇప్పటికే టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో ఆఖరిదైన మూడో వన్డే బుధవారం జరగనుంది. దీంతో మూడో వన్డేలో కూడా విజయం సాధించి 2-0తో సిరీస్‌ సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.

అయితే, గాయం తర్వాత విండిస్ పర్యటనలో పునరాగమనం చేసిన టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఇంకా గాడిన పడకపోవడం అభిమానులను ఆందోళన కలిగిస్తోంది. మూడు టీ20ల సిరిస్‌లో ధావన్ 1, 23, 3 పరుగులతో నిరాశ పరిచాడు. తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఇక, రెండో వన్డేలో 2 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు.

<strong>లార్డ్స్‌లో యాషెస్ రెండో టెస్టు: ఇరు జట్ల నమోదైన గణాంకాలివే!</strong>లార్డ్స్‌లో యాషెస్ రెండో టెస్టు: ఇరు జట్ల నమోదైన గణాంకాలివే!

మూడు వన్డేల సిరిస్ అనంతరం

మూడు వన్డేల సిరిస్ అనంతరం

మూడు వన్డేల సిరిస్ అనంతరం టీమిండియా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టెస్టుల్లో చోటు దక్కించుకునేందుకు ధావన్‌కు మూడో వన్డే చివరి అవకాశం కానుంది. ఈ నేపథ్యంలో మూడో వన్డేలో ధావన్ ఒత్తిడిని ఎలా అధిగమిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. వన్డే సిరీస్‌ తర్వాత విండిస్‌తో టీమిండియా రెండు టెస్టులను ఆడనుండగా.. ధావన్‌ స్థానంలో టెస్టులకి మయాంక్ అగర్వాల్‌ని ఓపెనర్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో.. విండీస్‌ పర్యటనలో ధావన్ ఆఖరిగా బుధవారమే రాత్రే కనిపించునున్నాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లకు ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ కనిపిస్తుండటంతో ధావన్ కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తోంది.

స్టార్క్, హాజెల్‌ఉడ్ ఇన్: లార్డ్స్ టెస్టుకు జట్టుని ప్రకటించిన ఆస్ట్రేలియా

11 ఇన్నింగ్స్‌ల తర్వాత కోహ్లీ సెంచరీ

11 ఇన్నింగ్స్‌ల తర్వాత కోహ్లీ సెంచరీ

మరోవైపు 11 ఇన్నింగ్స్‌ల తర్వాత సెంచరీ బాదిన కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మంచి ఊపు మీదున్నాడు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌‌లు విఫలం కావడంతో రెండో వన్డేలో జట్టుని గెలిపించే బాధ్యత తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. వన్డేల్లో 42వ సెంచరీ సాధించి అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

మూడో వన్డేలో కుల్దీప్ డౌటే

మూడో వన్డేలో కుల్దీప్ డౌటే

ఇక, భారత బౌలర్లు సైతం అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. రెండో వన్డేలో భువనేశ్వర్‌ కుమార్‌ (4/31) రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మహ్మద్‌ షమి (2/39) ఫర్వాలేదనిపించాడు. కుల్దీప్‌ యాదవ్‌ (2/59) వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకోవడం జట్టును ఇబ్బందుల్లోకి నెడుతోంది.

భారత క్రికెటర్ల సందడి: బోట్‌పై నుంచి అమాంతం నీళ్లలోకి దూకిన ధావన్ (వీడియో)

సైనీని తుది జట్టులోకి తీసుకునే అవకాశం

సైనీని తుది జట్టులోకి తీసుకునే అవకాశం

దీంతో మూడో వన్డేలో షమీకి విశ్రాంతినిచ్చి యువ ఆటగాడు నవదీప్‌ సైనీని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. టీ20 సిరీస్‌‌ను చేజార్చుకున్న వెస్టిండిస్ జట్టు కనీసం రెండో వన్డే గెలిచి వన్డే సిరీస్‌ను కాపాడుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తుది జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

భారత్‌: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్‌పంత్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, కేదార్‌ జాదవ్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, నవదీప్‌ సైని

వెస్టిండీస్‌: జేసన్ హోల్డర్‌ (కెప్టెన్), క్రిస్‌గేల్‌, జాన్‌ క్యాంప్‌బెల్‌, ఎవిన్‌ లూయిస్‌, షైహోప్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, నికోలస్‌ పూరన్‌, రోస్టన్‌ ఛేజ్‌, ఫాబియన్‌ అలెన్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, కీమో పాల్‌, షెల్డన్‌ కాట్రెల్‌, ఒషాన్‌ థామస్‌, కీమర్‌ రోచ్‌

Story first published: Tuesday, August 13, 2019, 18:57 [IST]
Other articles published on Aug 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X