For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టార్క్, హాజెల్‌ఉడ్ ఇన్: లార్డ్స్ టెస్టుకు జట్టుని ప్రకటించిన ఆస్ట్రేలియా

Australia announce squad for 2nd Ashes Test: Mitchell Starc, Josh Hazlewood in, no place for James Pattinson

హైదరాబాద్: లార్డ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న రెండో యాషెస్ టెస్టుకు ఆస్ట్రేలియా 12 మంది సభ్యులతో కూడిన జట్టుని ప్రకటించింది. తొలి టెస్టులో చోటు దక్కించుకోని మిచెల్ స్టార్క్, జోష్ హెజెల్‌ఉడ్‌లకు జట్టు మేనేజ్‌మెంట్ రెండో టెస్టులో అవకాశమిచ్చింది.

మరోవైపు తొలి టెస్టులో నిరాశపరిచిన జేమ్స్ ప్యాటిన్సన్‌ బెంచికే పరిమితమయ్యాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 251 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించడంతో సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రెండు సెంచరీలు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.


లార్డ్స్ టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు:

టిమ్ పైన్(కెప్టెన్/వికెట్ కీపర్), డేవడ్ వార్నర్, కామెరూన్ బాన్‌క్రాప్ట్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మ్యాథ్యూ వేడ్, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, పీటర్ సిడ్డిల్, నాథన్ లయాన్, జోష్ హెజెల్‌ఉడ్

మరోవైపు లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ బరిలో దిగడం దాదాపు ఖాయమైంది. రెండో టెస్టుకు ముందే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు 12 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గాయం కారణంగా ఆటకు దూరమైన అండర్సన్ స్థానంలో జోఫ్రా ఆర్చర్‌ను ఎంపిక చేసింది.

Story first published: Tuesday, August 13, 2019, 16:38 [IST]
Other articles published on Aug 13, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+