న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత క్రికెటర్ల సందడి: బోట్‌పై నుంచి అమాంతం నీళ్లలోకి దూకిన ధావన్ (వీడియో)

Shikhar Dhawan, Mayank Agarwal hang out with Kieron Pollard in Port of Spain ahead of 3rd ODI

హైదరాబాద్: వెస్టిండిస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో ఆఖరిదైన మూడో వన్డే బుధవారం జరగనుంది. అయితే, రెండో వన్డే ముగిసిన తర్వాత భారత క్రికెటర్లకు కాస్త విరామం లభించడంతో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని దీవుల్లో సందడి చేశారు.

వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ సైతం వీరితో జత కలిశారు. భారత క్రికెటర్లు శిఖర్ ధావన్, నవదీప్ షైనీ, శ్రేయస్ అయ్యర్, ఖలీల్ అహ్మద్, వృద్ధిమాన్ సాహాలు ట్రినిడాడ్ అండ్ టుబాకోలోని దీవులను కలియదిరిగారు. ఈ సందర్భంగా వీరంతా బోట్ రైడ్‌ని అస్వాదించారు.

వరల్డ్ టైటిల్ నెగ్గిన భారత తొలి మహిళ: ఎవరీ ఐశ్వర్య పిస్సే?

అనంతరం బోట్‌పై నుంచి నీళ్లలోకి దూకుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్... పేసర్ ఖలీల్ అహ్మద్‌కు బక్రీదు శుభాకాంక్షలు తెలిపాడు. సోమవారం బక్రీదు పండుగ అన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను భారత క్రికెటర్లు తన ఇనిస్టాగ్రామ్ ఖాతాల్లో పోస్టు చేశారు.

View this post on Instagram

Everything is artificial, except this!🌅

A post shared by Rohit Sharma (@rohitsharma45) on

View this post on Instagram

Open water, the greenery and fresh air = bliss. 😄

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on

View this post on Instagram

You can’t tell me I ain’t fly!

A post shared by Shreyas Iyer (@shreyas41) on

కాగా, మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా గత ఆదివారం వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 59 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీ (120) సెంచరీతో రాణించగా.. శ్రేయస్ అయ్యర్ (71) హాఫ్ సెంచరీ చేయడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 279 పరుగులు చేసింది.

నాకు సెలక్టర్‌ కావాలనుంది.. కానీ అవకాశం ఇచ్చేదెవరు: సెహ్వాగ్ ట్వీట్

అనంతరం వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విండీస్ లక్ష్యాన్ని 46 ఓవర్లలో 270కి సవరించారు. అయితే, లక్ష్య చేధనలో వెస్టిండిస్ జట్టు 27 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 148 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్నా... ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి 210 పరుగులకే కుప్పకూలింది.

Story first published: Tuesday, August 13, 2019, 15:17 [IST]
Other articles published on Aug 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X