న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: సైనీ స్థానంలో నెట్ బౌలర్ .. ఎవరీ సందీప్ వారియర్! ఖాతాలో ఓ హ్యాట్రిక్!

Who Is Sandeep Warrior: Know Everything About Him

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న ఆఖరి టీ20లో భారత్ తరఫున మరో యువ ఆటగాడు అరంగేట్రం చేశాడు. జట్టులో కరోనా కలకలం రేగడంతో 9 మంది ఆటగాళ్లు దూరమైన విషయం తెలిసిందే. దాంతో నెట్ బౌలర్లుగా శ్రీలంక పర్యటనకు వచ్చిన ఐదుగురు బౌలర్లను బీసీసీఐ టీమ్‌తో కలిపింది. అయితే బుధవారం జరిగిన రెండో టీ20లో నలుగురు ప్లేయర్లు అరంగేట్రం చేయగా.. యువ పేసర్ నవ్‌దీప్ సైనీ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దాంతో అతని స్థానంలో నెట్ బౌలర్ అయిన సందీప్ వారియర్‌కు నేటి మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కింది. మ్యాచ్‌కు ముందు టీమ్ సపోర్ట్ స్టాఫ్ చేతుల మీదుగా సందీప్ క్యాప్ అందుకున్నాడు.

2013లోనే ఆర్‌సీబీలోకి..

కుడి చేతి మీడియం పేస్ బౌలర్ అయిన శంకరన్‌కుట్టి సందీప్ వారియర్‌కు ఐపీఎల్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. కేరళకు చెందిన 30 ఏళ్ల సందీప్.. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో కేరళ టీమ్‌ తరఫున ఆడుతున్నాడు. 2013లోనే ఆర్‌సీబీ టీమ్‌లోకి వచ్చిన సందీప్.. మూడు సీజన్లపాటు బెంచ్‌కే పరిమితమయ్యాడు. 2015లో సందీప్‌ను ఆర్‌సీబీ విడుదల చేయగా.. ఆ తర్వాత ఫామ్ కోల్పోయి మళ్లీ ఐపీఎల్ ఆడే అవకాశాన్ని అందుకోలేకపోయాడు.

44 వికెట్లతో సత్తా చాటి..

ఇక కేరళ టీమ్ తరఫున 2013లో రంజీల్లోకి అరంగేట్రం చేసిన సందీప్... 2018-19 రంజీ సీజన్‌లో 44 వికెట్ల తేడాతో దుమ్మురేపాడు. ఆ సీజన్‌లో కేరళ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అతని సూపర్ పెర్ఫామెన్స్‌తో కేరళ ఫస్ట్‌టైమ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. కీలక మ్యాచ్‌లో విదర్బా చేతిలో ఓటమిపాలైంది. సందీప్ సూపర్ పెర్ఫామెన్స్‌తో ఆ ఏడాది ఐపీఎల్‌లో మళ్లీ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఆ సీజన్‌లో కేకేఆర్ తరఫున 3 మ్యాచ్‌లు ఆడిన సందీప్ రెండు వికెట్లు తీసాడు. గతేడాది ఒకే మ్యాచ్ ఆడే అవకాశం రాగా.. ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.

ఆంధ్ర టీమ్‌పై హ్యాట్రిక్

ఆంధ్ర టీమ్‌పై హ్యాట్రిక్

ఇక 2019 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టుపై సందీప్ హ్యాట్రిక్ వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఇక ఐపీఎల్ 2021 సీజన్ అర్థంతరంగా రద్దవ్వడానికి కారణమైన వరుణ్ చక్రవర్తీతో సందీప్ వారియర్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఇప్పటి వరకు 57 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సందీప్ 186 వికెట్లు తీశాడు. 55 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 66, 47 టీ20 మ్యాచ్‌ల్లో 46 వికెట్లు పడగొట్టాడు. ఈ పెర్పామెన్స్‌తోనే శ్రీలంక పర్యటనకు నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. కరోనా కారణంగా అనూహ్యంగా లభించిన అవకాశంతో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆదిలోనే కెప్టెన్ శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయింది.

Story first published: Thursday, July 29, 2021, 20:30 [IST]
Other articles published on Jul 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X