న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: ఓయ్ అంపైర్ నిద్రపోయావా? అది ఎలా వైడ్? బుడ్డ పోరడిని అడిగిన చెబుతాడు!

IND vs SL: Netizens slam umpire for controversial wide call in 2nd T20I vs Sri Lanka

కొలంబో: చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది. మరికొద్ది గంటల్లో సిరీస్‌ విజేతను నిర్ణయించే మూడో టీ20 జరగనుంది. కరోనా కారణంగా ప్రధాన ఆటగాళ్లు దూరమవడంతో పాటు పేలవ బ్యాటింగ్‌తో ధావన్ సేన మూల్యం చెల్లించుకుంది.

కానీ స్వల్ప స్కోర్‌ను కాపాడేందుకు బౌలర్లు సాయశక్తులా ప్రయత్నించారు. ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగారు. దాదాపు విజయం ఖాయమనుకున్న తరుణంలో పట్టుదలగా ఆడిన శ్రీలంక సైలెంట్‌గా మ్యాచ్‌ను ముగించింది. అయితే ఈ మ్యాచ్ చివరి ఓవర్‌లో అంపైర్ ఇచ్చిన వైడ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అసలేం జరిగిందంటే..?

శ్రీలంక విజయానికి చివరి ఓవర్‌లో 8 పరుగులు కావాలి. భారత యువ పేసర్ చేతన్ సకారియా బంతిని అందుకోగా.. ఫస్ట్ బాల్‌కు సింగిల్ వచ్చింది. ఇక రెండో బంతికి బ్యాట్స్‌మన్ ముందుకు జరగ్గా సకారియా తెలివిగా ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధించాడు. బంతి బ్యాట్‌ను మిస్సయి కీపర్ చేతిలో పడగా.. సంజూ శాంసన్ తడబడ్డాడు.

దాంతో బ్యాట్స్‌మెన్ సింగిల్ తీసారు. కానీ ఆశ్చర్యకరంగా ఫీల్డ్ అంపైర్ వైడ్ ప్రకటించాడు. ఈ నిర్ణయంతో భారత ఆటగాళ్లు అవాక్కయ్యారు. కెప్టెన్ శిఖర్ ధావన్ అంపైర్‌తో వాదించాడు కూడా. కానీ అంపైర్ తన నిర్ణయానికే కట్టుబడటంతో శ్రీలంకకు ఓ బంతితో పాటు పరుగు కలిసి వచ్చింది. దాంతో సమీకరణం 5 బంతుల్లో 5గా మారింది.

ఓ అంపైర్.. నిద్రపోయావా?

అయితే అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యత హర్షా భోగ్లే సైతం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. టెర్రిబుల్ వైడ్ కాల్ అని ట్వీట్ చేశాడు. ఇక అభిమానులైతే అంపైర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుడ్ పోరడని అడిగినా అది వైడ్ కాదని చెబుతారని ఒకరంటే.. అంపైర్ నిద్రపోయాడని ఒకరు.. శ్రీలంక జట్టు ఓటమిని చూడలేక అంపైర్ అలా చేశాడని మరొకరు కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంకొందరు ఎల్బీడబ్ల్యూ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ అంపైర్లపై విమర్శలు గుప్పించారు.

సైలెంట్ విక్టరీ..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులు చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (42 బంతుల్లో 5 ఫోర్లతో 40), తొలి మ్యాచ్‌ ఆడిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ (23 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌‌తో 29), రుతురాజ్‌ గైక్వాడ్‌ (18 బంతుల్లో 1 ఫోర్‌‌తో 21) ఫర్వాలేదనిపించారు. అకిల ధనంజయ రెం డు వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్‌లో శ్రీలంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసి గెలుపొందింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' ధనంజయ డిసిల్వా (34 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌‌తో 40 నాటౌట్‌), చమిక కరుణరత్నే (6 బంతుల్లో 1 సిక్స్‌‌తో 12 నాటౌట్‌) కడదాక క్రీజులో నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. కుల్దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు తీశాడు.

Story first published: Thursday, July 29, 2021, 16:18 [IST]
Other articles published on Jul 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X