న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: ఇషాన్ ఔట్.. భువీకి రెస్ట్.. ఆ ఇద్దరికి చాన్స్! క్లీన్ స్వీప్ గబ్బర్ సేన టార్గెట్! తుది జట్లు ఇవే!

IND vs SL 3rd Match: India Playing 11, Sri Lanka Playing 11 And Match Prediction For Final ODI

కొలంబో: తొలి రెండు వన్డేల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించి 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. శుక్రవారం జరిగే ఆఖరి వన్డేలోనూ విజయ దుందుభి మోగించాలని పట్టుదలతో ఉంది. ప్రయోగాలపై దృష్టిపెట్టినా.. శ్రీలంకను క్లీన్‌స్వీప్‌ చేయడమే లక్ష్యంగా గబ్బర్ సేన బరిలోకి దిగుతోంది. మరోవైపు వరుస పరాజయాలతో కుదేలైన లంకేయులు ఒక్క మ్యాచైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో టీ20 సిరీసు బరిలోకి దిగాలనుకుంటున్నారు.

పటిష్టంగా టీమిండియా..

పటిష్టంగా టీమిండియా..

యువ ఆటగాళ్లతో టీమిండియా బలంగా ఉంది. రెండో వన్డేల్లో కీలక బ్యాట్స్‌మెన్ అంతా ఔటైనా.. దీపక్ చాహర్ అసాధారణ ఇన్నింగ్స్‌తో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్నందించాడు. రెండో వన్డేలో ఎంతో మెరుగైన ప్రదర్శన చేసిన శ్రీలంక చాహర్ ధాటికి ఓటమి ముంగిట కుదేలైంది. మూడో వన్డేలోనూ లంకేయుల నుంచి ఇదే తరహా ప్రతిఘటన ఎదురవ్వవచ్చు. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోవడంతో ఆఖరి వన్డేలో రిజర్వ్ బెంచ్‌ను ఆడించే చాన్సుంది. అయితే ఎవరిని తీసి మరెవరిని ఆడిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్ పృథ్వీ షాను కదలించే ప్రయత్నం చేయకపోవచ్చు. అదే జరిగితే పడిక్కల్, రుతురాజ్ ఇంకొన్నాళ్లు నిరీక్షించాల్సిందే. ఇషాన్ కిషన్ బదులో గాయం నుంచి కోలుకున్న సంజూ శాంసన్‌కు అవకాశం దక్కవచ్చు. సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండేలు అద్భుతంగా రాణిస్తుండటంతో మిడిలార్డర్‌లో మార్పులు ఉండకపోవచ్చు.

భువనేశ్వర్‌కు రెస్ట్..

భువనేశ్వర్‌కు రెస్ట్..

హార్దిక్ పాండ్యా ఇంకా టచ్‌లోకి రాలేదు. మూడో వన్డే అతని బౌలింగ్, బ్యాటింగ్ సత్తాకు పరీక్షగా నిలవనుంది. కృనాల్‌ పాండ్యాను జట్టులోంచి తప్పించలేని స్థితి. యుజ్వేంద్ర చాహల్ రెండు వన్డేల్లో రాణించగా.. కుల్దీప్ రెండో వన్డేలో విఫలమయ్యాడు. అయినా ఈ ఇద్దరి కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ కుల్దీప్‌ను తప్పించాలనుకుంటే మాత్రం రాహుల్ చాహర్ లేదా వరుణ్ చక్రవర్తీకి అవకాశం దక్కవచ్చు. మునపటి సత్తా ప్రదర్శించలేకపోతున్న భువనేశ్వర్ కుమార్‌కు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే నవ్‌దీప్ సైనీ జట్టులోకి రావచ్చు.

ఎడమచేతి వాటం పేసర్‌ చేతన్‌ సకారియాతో అరంగేట్రం చేయించే అవకాశం లేకపోలేదు.

ఆత్మవిశ్వాసంతో వెళ్తారా?

ఆత్మవిశ్వాసంతో వెళ్తారా?

శ్రీలంక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మొదటి వన్డేలో పూర్తిగా తేలిపోయినా రెండో మ్యాచులో గట్టిపోటీనిచ్చారు. అయితే గెలిచే మ్యాచులో ఓటమి వారి ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తుందనడంలో సందేహం లేదు. ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, మినోద్‌ భనుక మంచి ఆరంభాలే ఇస్తున్నారు. ఆ శుభారంభాలను మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోరుగా మలవడం లేదు. మధ్య ఓవర్లలో ఎక్కువ బంతులు తింటూ వికెట్లు పారేసుకుంటున్నారు. కెప్టెన్‌ డసన్ శనక, ధనంజయ డిసిల్వా ఫర్వాలేదనిపిస్తున్నా ఎక్కువ పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. చివరి మ్యాచులో లెగ్‌స్పిన్‌తో ఆకట్టుకున్న వనిందు హసరంగ మరోసారి కీలకం కానున్నాడు. శ్రీలంక జట్టులో రెండు మార్పులు చోటు చేసుకోనున్నాయి. పేసర్ కసున్ రజితా గాయపడటంతో లాహిరూ కుమారకు అవకాశం దక్కనుంది. దారళంగా పరుగులిచ్చిన సందకన్ ప్లేస్‌లో అకిలా ధనుంజయను ఆడించవచ్చు.

పిచ్/వెదర్ రిపోర్టు..

పిచ్/వెదర్ రిపోర్టు..

రెండో వన్డేకు ఉపయోగించిన పిచ్‌నే ఈ మ్యాచ్‌కు ఉపయోగించనున్నారు. అదే జరిగితే మరోసారి భారీ స్కోర్లు నమోదుకానున్నాయి. ఈ వికెట్ బ్యాటింగ్‌కు స్వర్గదామం. అదే విధంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఈ మ్యాచ్‌కు వర్ష గండం ఉంది. శుక్రవారం ఏ సమయంలోనైనా వర్షం పడవచ్చని, ఆటకు అంతరాయం కలుగవచ్చని అక్కడి వాతావరణశాఖ పేర్కొంది. మేఘావృతమైందని, చిరుజల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.

తుది జట్లు:(అంచనా)

తుది జట్లు:(అంచనా)

భారత్: శిఖర్ ధావన్(కెప్టెన్), పృథ్వీ షా, ఇషాన్ కిషన్/ సంజూ శాంసన్(కీపర్), మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ /నవ్‌దీప్ సైనీ, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్/రాహుల్ చాహర్/వరుణ్ చక్రవర్తీ

శ్రీలంక: అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుక(కీపర్), భానుక రాజపక్స, ధనుంజయ డిసిల్వా, చరిత్ అసలంక, డసన్ షనక(కెప్టెన్), వానిందు హసరంగ, చమిక కరుణరత్నే, దుష్మంత చమీరా, అకిలా ధనుంజయ, లాహిరు కుమారా

Story first published: Thursday, July 22, 2021, 21:59 [IST]
Other articles published on Jul 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X