న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: మొన్న భువీ.. నిన్న బుమ్రా.. నేడు అర్ష్‌దీప్ సింగ్.. గండంలా మారిన 19వ ఓవర్!

IND vs SA: Why Indian Bowlers Are Failing Big Time In 19th Over?

హైదరాబాద్: టీ20 ఫార్మాట్‌లో 19వ ఓవర్ టీమిండియా బౌలర్లకు గండంలా మారిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆసియాకప్ 2022 నుంచి ఈ ఓవర్ ఎవరూ వేసినా ధారళంగా పరుగులిస్తున్నారు. బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ 19వ ఓవర్‌ భారత్‌కు కలిసి రాలేదు. అప్పటి వరకు తన స్వింగ్‌తో ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి సౌతాఫ్రికా పతనాన్ని శాసించిన అర్ష్‌దీప్ సింగ్ కూడా 19వ ఓవర్‌లో చేతులెత్తేసాడు.

తనదైన యార్కర్లతో కట్టడి చేసే ప్రయత్నం చేసినా.. టీమిండియా దురదృష్టమో ఏమో కానీ ఈ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌లో కేశవ్‌మహరాజ్ రెండు బౌండరీలతో పాటు ఓ భారీ సిక్సర్ బాదాడు.

గండంలా 19వ ఓవర్..

ఆసియాకప్‌లో భువనేశ్వర్ కుమార్ సైతం 19వ ఓవర్లలోనే ధారళంగా పరుగులిచ్చి భారత ఓటమికి కారణమయ్యాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో మరోసారి అతనికి 19వ ఓవర్ ఇచ్చినా అదే సీన్ రిపీట్ అయ్యింది. దాంతో చివరి టీ20లో 19వ ఓవర్‌ను రోహిత్ బుమ్రా చేతికివ్వగా అతను కూడా ధారళంగా పరుగులిచ్చాడు. ఓ సిక్స్, ఫోర్‌తో పాటు ఓవర్ త్రో ద్వారా 6 పరుగులు రావడంతో మొత్తం 18 పరుగులు సమర్పించుకున్నారు. దాంతో 19వ ఓవర్ భారత బౌలర్లకు గండంలా మారిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఫన్నీ మీమ్స్..

19వ ఓవర్‌లో భారత బౌలర్లు విఫలమవుతున్న నేపథ్యంలో అభిమానులు ఫన్నీ మీమ్స్ సృష్టిస్తున్నారు. డెత్ ఓవర్ వైఫల్యం మీదంటే మీదని భారత బౌలర్లు ఒకరిపై ఒకరు నెట్టేస్తున్నారనే సెటైరికల్ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. భువనేశ్వర్‌ను ట్రోల్ చేసినవారిని తప్పుబడుతున్నారు. భువీ ఒక్కడే కాదు బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ కూడా విఫలమయ్యారని కామెంట్ చేస్తున్నారు. ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం 19వ ఓవర్ టీమిండియాకు కలిసిరావడం లేదని ట్వీట్ చేశాడు.

స్వింగ్ కింగ్ అర్ష్‌దీప్

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు మాత్రమే చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25), వేన్ పార్నెల్(37 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 24), కేశవ్ మహరాజ్(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/32) మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్(2/24), హర్షల్ పటేల్(2/26) రెండేసి వికెట్లు తీసారు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.

చెలరేగిన సూర్య

అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 110 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. సూర్యకుమార్ యాదవ్(33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50), కేఎల్ రాహుల్(56 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా, అన్రిచ్ నోర్జ్ తలో వికెట్ తీసారు.

Story first published: Thursday, September 29, 2022, 14:22 [IST]
Other articles published on Sep 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X