న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA:రాహుల్ చెత్త కెప్టెన్సీ .. బవుమా, డస్సెన్ సెంచరీ! భారత్‌ ముందు కొండంత లక్ష్యం!

IND vs SA: Temba Bavuma, Rassie van der Dussen hundreds helps South Africa set 297-run target

పార్ల్: టీమిండియా తాత్కలిక సారథి కేఎల్ రాహుల్ చెత్త కెప్టెన్సీకి పేలవ ఫీల్డింగ్, పసలేని బౌలింగ్ తోడవడంతో భారత్ ముందు సౌతాఫ్రికా 297 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ జట్టు కెప్టెన్ టెంబా బవుమా(143 బంతుల్లో 8 ఫోర్లతో 110), రాసీ వాన్ డెర్ డస్సెన్(96 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్స్‌లతో 129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది.

బవుమా, డస్సెన్ నాలుగో వికెట్‌కు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ తీశాడు. మిగత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. శార్దూల్ ఠాకూర్ 72 పరుగులు సమర్పించుకొని కెరీర్‌లోనే అత్యంత చెత్త ప్రదర్శనను మూటగట్టుకున్నాడు.

ఆరంభం అదిరినా..

ఆరంభం అదిరినా..

ఇన్నింగ్స్ ఆరంభంలోనే సౌతాఫ్రికాకు గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ జన్నెమన్ మలాన్(6)‌ను జస్‌ప్రీత్ బుమ్రా కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ బవుమాతో క్వింటన్ డికాక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమవడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి సౌతాఫ్రికా వికెట్ నష్టానికి 39 పరుగులే చేసింది. అయితే 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బవుమా ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను రిషభ్ పంత్ వదిలేయగా.. అశ్విన్ బౌలింగ్‌లో డికాక్ ఇచ్చిన క్యాచ్‌ను బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో శ్రేయస్ అయ్యర్ నేలపాలు చేశాడు.

రాహుల్ కెప్టెన్సీ వైఫల్యం..

రాహుల్ కెప్టెన్సీ వైఫల్యం..

అయితే డికాక్‌కు అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేయగా.. బవుమా మాత్రం సూపర్ బ్యాటింగ్‌తో చెలరేగాడు. అయితే క్రీజులోకి వచ్చిన ఎయిడెన్ మార్క్‌రమ్(4).. అరంగేట్ర ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ సూపర్ త్రోకు రనౌట్‌గా వెనుదిరిగాడు.దాంతో సౌతాఫ్రికా 68 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డస్సెన్‌తో బవుమా చెలరేగాడు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ.. రాహుల్ ఎన్ని వ్యూహాలు పన్నినా చిక్కలేదు. బౌలర్లను మార్చడంలో కెప్టెన్‌గా రాహుల్ విఫలమయ్యాడు. చాహల్, శార్దూల్, భువీ విఫలమవుతున్న వేళ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌తో ఒక్క ఓవర్ కూడా వేయించలేదు.

బవుమా, డస్సెన్ సెంచరీ..

ఇక మంచి బంతులను గౌరవిస్తూ వీలుచిక్కిన వాటిని బౌండరీలకు తరలించిన ఈ జోడీ.. క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో రన్‌రేట్ తగ్గకుండా జాగ్రత్తపడింది.

శార్దూల్ ఠాకూర్ వేసిన 28వ ఓవర్‌లో క్విక్ సింగిల్ తీసి బవుమా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. భువీ 35వ ఓవర్‌లో డస్సెస్ అర్థ శతకం సాధించాడు.

ఆ తర్వాత మరింత నిలకడగా ఆడిన ఈ జోడీ.. వేగంగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. ఠాకూర్ వేసిన 43వ ఓవర్‌లో సిక్స్, ఫోర్‌తో డస్సెన్ జోరు కనబర్చగా.. అతని మరుసటి ఓవర్‌లో క్విక్ సింగిల్‌తో బవుమా సెంచరీ సాధించాడు. ఆ కొద్దిసేపటికే భువనేశ్వర్ కుమార్ వేసిన 48వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసి డస్సెన్ కూడా శతకం సాధించాడు.

రికార్డు భాగస్వామ్యం..

ఇక 49వ ఓవర్‌లో బవుమాను క్యాచ్ ఔట్ చేసిన బుమ్రా.. నాలుగో వికెట్‌కు నమోదైన 204 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరదించాడు. భారత్‌కు సౌతాఫ్రికాకు ఇదే రికార్డు పార్టనర్‌షిప్ కావడం గమనార్హం. క్రీజులోకి వచ్చిన మిల్లర్(1)తో డస్సెన్ ధాటిగా ఆడుతూ సౌతాఫ్రికాకు భారీ స్కోర్ అందించాడు. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ వేసిన చివరి ఓవర్‌లో సిక్స్, బౌండరీతో 17 పరుగులు పిండుకున్నాడు.

Story first published: Wednesday, January 19, 2022, 18:29 [IST]
Other articles published on Jan 19, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X