న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భలేవాడివి బాసు - మమ్మల్ని చీల్చి చెండాడావు: కోహ్లీని కలిసిన పాకిస్తాన్ బౌలర్లు..!!

 IND vs SA: Pakistan pacers Haris Rauf and Shaheen Afridi meets Virat Kohli in Perth

పెర్త్: టీ20 ప్రపంచకప్ 2022లో భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర సాగిస్తోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లల్లో ఘన విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థులను చిత్తు చేసింది. గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఇక తన తదుపరి మ్యాచ్‌ను ఆదివారం ఆడబోతోంది. దక్షిణాఫ్రికాను ఎదుర్కొనబోతోంది. ఈ రెండు జట్లు గ్రూప్-2లో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

భారత్, పాక్‌కు కీలకం..

భారత్, పాక్‌కు కీలకం..

ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. పెర్త్ స్టేడియం దీనికి వేదిక. ఈ మ్యాచ్ కోసం టీమ్ మొత్తం పెర్త్‌కు చేరుకుంది కూడా. అక్కడే నెట్ ప్రాక్టీస్ చేస్తోంది. తొలుత పాకిస్తాన్, అనంతరం నెదర్లాండ్స్‌ను ఓడించిన భారత్ ఇప్పుడిక దక్షిణాఫ్రికాను ఢీ కొట్టబోతోంది. టీమిండియాతో సమవుజ్జీగా ఉన్న జట్టు కావడం వల్ల ఈ మ్యాచ్‌‌లో పోరు ఎలా ఉంటుందనేది ఉత్కంఠతను రేపుతోంది.

ఒకే స్టేడియంలో..

ఒకే స్టేడియంలో..

ఇదే పెర్త్ స్టేడియంలో పాకిస్తాన్ కూడా తన తదుపరి మ్యాచ్‌ను ఆడుతోంది. అది కూడా రేపే. భారత్- దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ సాయంత్రం 4:30 గంటలకు షెడ్యూల్ కాగా.. 12:30 గంటలకు ఇదే పెర్త్‌లో పాకిస్తాన్.. నెదర్లాండ్స్‌ను తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో- ఈ రెండు జట్లు కూడా ఇప్పటికే పెర్త్‌కు చేరుకున్నాయి. నెట్ ప్రాక్టీస్‌లో తలమునకలయ్యాయి. సమవుజ్జీగా ఉన్న దక్షిణాఫ్రికాను గెలవడానికి భారత్ శ్రమిస్తోంది.

రెండు పరాజయాల అనంతరం..

అదే సమయంలో రెండు పరాజయాల అనంతరం పాకిస్తాన్ ఆడబోతోన్న తరువాతి మ్యాచ్ ఇది. సెమీ ఫైనల్స్ ద్వారాలు దాదాపుగా మూసుకుపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో నెదర్లాండ్స్‌ను ఎదుర్కొనబోతోంది. నెదర్లాండ్స్‌పై గెలిస్తే చాలదు పాకిస్తాన్‌కు. మెరుగైన నెట్ రన్‌రేట్‌ను సాధించుకోవాల్సిన అవసరం ఆ జట్టుపై ఉంది. ప్రస్తుతం గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో బాబర్ ఆజమ్ సేన అట్టడుగు స్థానంలో నిలిచింది.

పెర్త్ స్టేడియంలో..

పెర్త్ స్టేడియంలో..

కగా- పెర్త్ స్టేడియంలో ఓ అరుదైన సన్నివేశం కనిపించింది. క్యాంటీన్‌లో విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ బౌలర్లు హ్యారిస్ రవూఫ్, షహీన్ షా అఫ్రిది ఎదురుపడ్డారు. ఆప్యాయంగా పలకరించుకున్నారు. విరాట్ కోహ్లీ బౌల్‌తో క్యాంటీన్‌లో సూప్ తాగుతోండగా.. అతణ్ని పలకించారు వారిద్దరూ. షహీన్ షా అఫ్రిది, హ్యారిస్ రవూఫ్ మాట్లాడుతుండగా.. విరాట్ కోహ్లీ నవ్వుతూ బదులిచ్చాడు. అఫ్రిది చేతిలో జ్యూస్ గ్లాస్, రవూఫ్ చేతిలో ఖాళీ ప్లేట్ కనిపించింది.

హ్యారిస్ బౌలింగ్‌లోనే..

హ్యారిస్ బౌలింగ్‌లోనే..

ఈ నెల 23వ తేదీన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఈ ఇద్దరి బౌలింగ్‌ను చీల్చి చెండాడిన విషయం తెలిసిందే. హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లోనే విరాట్ కోహ్లీ రెండు సిక్సర్లను బాది- టీమిండియాకు విజయాన్ని అందించాడు. చివరి 12 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన దశలో 19వ ఓవర్‌ను బౌల్ చేశాడు హ్యారిస్ రవూఫ్. చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు విరాట్ కోహ్లీ. దీనితో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

టీమిండియాకు పేస్ అటాక్ రుచి చూపబోతోన్నాం - కప్ కొట్టబోతోన్నాం..!!

Story first published: Saturday, October 29, 2022, 14:52 [IST]
Other articles published on Oct 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X