న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: సౌతాఫ్రికా చేతిలో వరుస ఓటములు.. టీమిండియాకు కలిసిరాని రాహుల్ ద్రవిడ్ కోచింగ్!

IND vs SA: Is Rahul Dravid The Right Coach For Team India?

హైదరాబాద్: భారత గడ్డపై సౌతాఫ్రికా క్రికెట్ టీమ్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో టీ20లోనూ బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్మురేపి 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా 5 టెస్ట్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. బౌలర్ల సమష్టి పోరాటానికి తోడు హెన్రిచ్ క్లాసెన్(46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 81) ఖతర్నాక్ బ్యాటింగ్‌తో చెలరేగాడు. భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (40; 35 బంతుల్లో 2×4, 2×6) టాప్‌ స్కోరర్‌. ఛేదనలో క్లాసెన్‌ మెరుపులతో సౌతాఫ్రికా 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భువనేశ్వర్‌ (4/13) గొప్పగా బౌలింగ్‌ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.

బెడిసికొడుతున్న ద్రవిడ్ నిర్ణయాలు..

బెడిసికొడుతున్న ద్రవిడ్ నిర్ణయాలు..

అయితే కీలక టీ20 ప్రపంచకప్ ముందు భారత్ వరుస పరాజయాలను ఎదుర్కొవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ 2022 సీజన్‌లో సత్తా చాటిన ఆటగాళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో విఫలమవడం కలవరపెడుతోంది. అంతేకాకుండా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నిర్ణయాలు జట్టుకు నష్టం చేస్తున్నాయి. రెండో టీ20లో దినేశ్ కార్తీక్.. బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తు తీసుకున్న నిర్ణయం బెడిసి కొట్టింది. ఏడో స్థానంలో పంపించడంతో భారత్ పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచలేకపోయింది.

జట్టులో అనేక మార్పులు..

జట్టులో అనేక మార్పులు..

అంతేకాకుండా సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో అనుభవం, యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేయడంలోనూ ద్రవిడ్ విఫలమయ్యాడు. గతంలో మాదిరి శిఖర్ ధావన్‌ను కెప్టెన్ చేయకుండా.. పంత్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాడు. అతను అనుభవలేమితో కెప్టెన్సీని ఒత్తిడిగా భావిస్తూ తడబడుతున్నాడు. కనీసం హార్దిక్ పాండ్యాకైనా కెప్టెన్సీ ఇయ్యాల్సిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత జట్టులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. విరాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రోహిత్ కెప్టెన్సీ అందుకున్నాడు.

ఉమ్రాన్ మాలిక్ పక్కనపెట్టడంతో..

ఉమ్రాన్ మాలిక్ పక్కనపెట్టడంతో..

ఇక సౌతాఫ్రికా పర్యటనలో భారత్ టెస్ట్, వన్డే సిరీస్‌లను 1-2, 0-3 కోల్పోయింది. ఇప్పుడు 5 టీ20ల సిరీస్‌లో 0-2తో వెనుకంజలో నిలిచింది. ప్రపంచకప్ ముందు ద్రవిడ్ చేస్తున్న ప్రయోగాలు జట్టుకు నష్టం చేస్తున్నాయి. ఐపీఎల్‌లో తన పేస్‌తో ప్రపంచ బ్యాటర్లను వణికించిన ఉమ్రాన్ మాలిక్‌ నేర్చుకునే దశలోనే ఉన్నాడని జట్టులోకి తీసుకోవడం లేదు. ఇది కూడా భారత్ విజయవకాశాలను దెబ్బతీసింది.

Story first published: Monday, June 13, 2022, 11:44 [IST]
Other articles published on Jun 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X