న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కోహ్లీసేనదే పూర్తి ఆధిపత్యం! టీమిండియాకు భారీ లీడ్!

 IND vs NZ: India lead by 332 after Ajaz Patels historic 10-wicket haul

ముంబై: సెన్సేషన్ బౌలింగ్‌కు తోడుగా బ్యాటింగ్‌లో ఓపిక కనబర్చడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. మయాంక్ అగర్వాల్(311 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో 150) భారీ శతకానికి అక్షర్ పటేల్(128 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీ తోడవడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 325 పరుగులు చేసింది. అనంతరం బౌలింగ్‌లో మహమ్మద్ సిరాజ్(3/19), రవిచంద్రన్ అశ్విన్(4/8), అక్షర్ పటేల్(2/14) సత్తా చాటడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులకే ఆలౌటైంది.

అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌.. చతేశ్వర్ పుజారా(29 బ్యాటింగ్), మయాంక్ అగర్వాల్(38 బ్యాటింగ్) నిలకడగా ఆడటంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ కలుపుకొని భారత్ 332 రన్స్ ఆధిక్యం‌లో ఉంది. ఫీల్డింగ్ చేస్తూ శుభ్‌మన్ గిల్ గాయపడటంతో పుజారా ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి వచ్చింది.

 తడబడ్డ భారత్..

తడబడ్డ భారత్..

221/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. కివీస్ స్పిన్నర్ ఆజాజ్ పటేల్.. ఓకే ఓవర్‌లో వరుసబంతుల్లో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ వృద్దిమాన్ సాహా(25), అశ్విన్‌(0)ను ఔట్ చేశాడు. ముందుగా సాహాను వికెట్ల ముందు బోల్తా కొట్టించిన ఆజాజ్.. ఆ మరుసటి బంతికే క్రీజులోకి వచ్చిన అశ్విన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ బంతిని అంచనా వేయడంలో విఫలమైన అశ్విన్.. గోల్డెన్ డక్‌గా తెల్ల మొహం వేస్తూ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్‌తో కలిసి మయాంక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ జోడీ 65 పరుగులు జోడించిన అనంతరం మయాంక్‌‌ను ఆజాజ్ పటేల్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.

 10 వికెట్లు.. ఆజాజ్ ఒక్కడే

10 వికెట్లు.. ఆజాజ్ ఒక్కడే

ఆ కొద్ది సేపటికే హాఫ్ సెంచరీ సాధించిన అక్షర్ పటేల్‌ను కూడా ఆజాజ్ పటేల్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్ది సేపటికే జయంత్ యాదవ్‌ను క్యాచ్ ఔట్ చేసిన ఆజాజ్.. సిరాజ్‌ను కూడా అదే తరహాలో పెవిలియన్ చేర్చి వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా చరిత్ర కెక్కాడు. ఆజామ్ కన్నా ముందు భారత దిగ్గజం అనిల్ కుంబ్లే, ఇంగ్లండ్ లెజెండ్ జిమ్ లేకర్ ఈ ఫీట్ సాధించారు. 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో జిమ్ లేకర్ ఒకే ఇన్నింగ్స్‌లో 53 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీసి ఈ ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత మరో 43 ఏళ్లకు అనిల్ కుంబ్లే 1999లో పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో 74 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. కుంబ్లే తర్వాత మళ్లీ 22 ఏళ్లకు ఆజాజ్ పటేల్ ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

చుక్కలు చూపించిన సిరాజ్

చుక్కలు చూపించిన సిరాజ్

ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మహమ్మద్ సిరాజ్ ధాటికి ఒకే ఓవర్‌లో ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే ఓపెనర్లు టామ్ లాథమ్(10), విల్ యంగ్(4)‌ను తనదైన బౌలింగ్‌తో పెవిలియన్ చేర్చిన సిరాజ్.. తన మరుసటి ఓవర్‌లో సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ముందుగా విల్ యంగ్‌ను స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చిన సిరాజ్.. ఆ తర్వాత టామ్ లాథమ్‌ను షార్ట్ పిచ్ బాల్‌తో బొల్తా కొట్టించాడు. తన మరుసటి ఓవర్‌లో సూపర్ ఇన్ స్వింగ్ డెలవరీతో టేలర్ ఆఫ్ స్టంప్ ఎగరగొట్టాడు. దాంతో 17 పరుగులకే కివీస్ మూడు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది.

స్పిన్నర్లు చెలరేగడంతో..

స్పిన్నర్లు చెలరేగడంతో..

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డారెల్ మిచెల్‌(8)ను అక్షర్ పటేల్‌ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. మిచెల్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆ కొద్ది సేపటికి క్రీజులోకి వచ్చి హెన్రీ నికోల్స్‌ను అశ్విన్ తన ఫస్ట్ ఓవర్‌లోనే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే జయంత్ యాదవ్.. రచిన్ రవీంద్రను స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో కివీస్ 38 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ స్కోర్‌తోనే ఆ జట్టు టీ బ్రేక్‌కు వెళ్లింది. విరామం అనంతరం న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఎంతోసేపు సాగలేదు. 12 ఓవర్ల వ్యవధిలోనే మిగిలిన నాలుగు వికెట్లను న్యూజిలాండ్ కోల్పోయింది. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్‌(8)ను అశ్విన్ క్యాచ్ ఔట్ చేయగా.. అదే ఓవర్ చివరి బంతికి క్రీజులోకి వచ్చిన టీమ్ సౌథీ ఔటయ్యాడు. చివర్లో సోమర్ విల్లేను అశ్విన్ క్యాచ్ ఔట్‌గా వెనక్కి పంపాడు. తన మరుసటి ఓవర్‌లోనే కైల్ జెమీసన్‌ను కూడా అశ్విన్ ఔట్ చేయడంతో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది

Story first published: Saturday, December 4, 2021, 18:37 [IST]
Other articles published on Dec 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X