న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ 1st Test: ఇలా చేయవద్దని రూల్ బుక్‌లో ఉందా? అంపైర్‌తో రవిచంద్రన్ అశ్విన్ వాగ్వాదం! (వీడియో)

IND vs NZ 1st Test: Ashwin involved in an argument with Nitin Menon over bowling with a diagonal run-up

కాన్పూర్: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ బుక్‌లోని ప్రతీ రూల్‌ను సవాల్ చేస్తూ తరుచూ వివాదాల్లో నిలుస్తుంటాడు. ఆ మధ్య మన్కడింగ్‌తో బ్యాట్స్‌మన్‌‌ను ఔట్ చేసి ఆ నిబంధననే మార్చాలనే చర్చకు తెరలేపాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లోనూ అదే తరహా ప్రవర్తనతో అంపైర్ మందలింపుకు గురయ్యాడు. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షగా నిలిచిన న్యూజిలాండ్ ఓపెనర్లను పెవిలియన్ చేర్చేందుకు అశ్విన్ తన బౌలింగ్ అస్త్రాలన్ని ఉపయోగించాడు. ఈ క్రమంలోనే విభిన్నమైన రనప్‌తో బ్యాట్స్‌మన్‌ను బోల్తాకొట్టించాలనుకున్నాడు. డయాగ్నల్ రనప్‌తో కొన్ని బంతులను బౌలింగ్ చేశాడు.

రూల్ బుక్‌లో ఉందా?

అయితే ఈ రన్నప్‌ను అంపైర్ నితిన్ మీనన్ వ్యతిరేకించాడు. ఈ తరహా రనప్‌తో బౌలింగ్ చేయడానికి వీల్లేదని మందలించాడు. అయితే ఇలా చేయవద్దని రూల్ బుక్‌లో ఉందా? అంటూ అశ్విన్ ఎదురు ప్రశ్నించాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నడవగా.. కెప్టెన్ అజింక్యా రహానే జోక్యం చేసుకున్నాడు. ఈ రనప్ కారణంగా అంపైర్‌గా తనకు ఇబ్బందవుతుందని, ఎల్బీ డబ్ల్యూను గుర్తించలేమని రహానేకు వివరించాడు.

వెనక్కి తగ్గిన అశ్విన్..

ఇక నిబంధనల్లో డయాగ్నల్ రనప్ చేయవద్దని ఎక్కడా లేదు. ఆఫ్ స్పిన్నర్‌ డయాగ్నల్ రనప్ చేసుకోవచ్చు. కాకపోతే పిచ్ డేంజర్ ఏరియాలో మాత్రం పరుగెత్తకూడదు. అయితే అశ్విన్ రనప్ అంపైర్ వ్యూను డిస్టర్బ్ చేయడమే కాకుండా నాన్‌స్ట్రైకర్‌కు కూడా ఇబ్బంది తలెత్తింది. వాదోపవాదనల తర్వాత అశ్విన్ వెనక్కుతగ్గాడు. తనదైన శైలిలోనే బౌలింగ్ చేశాడు. ఇదే విషయంపై భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ చర్చించడం టీవీ కెమెరాల్లో కనిపించింది.

ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్..

ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్..

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వారి మధ్య జరిగిన సంభాషణను ఊహిస్తూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. అలా బౌలింగ్ చేస్తే తాను ఎల్బీ డబ్ల్యూ చూడలేనని అంపైర్ అశ్విన్‌ను హెచ్చరించాడనీ, దానికి అశ్విన్.. ఇప్పటి వరకు ఏం చూశావని ప్రశ్నించాడని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ఎట్టకేలకు కమ్ బ్యాక్ చేసింది. రెండో రోజు ఆటలో ఒక్క వికెట్ తీయలేకపోయిన భారత్ బౌలర్లు మూడో రోజు ఆటలో దుమ్మురేపారు. ఫస్ట్ సెషన్‌లో రెండు, రెండో సెషన్‌లో నాలుగు వికెట్లు తీశారు.

మరో మూడు వికెట్లే..

మరో మూడు వికెట్లే..

129/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్, కెప్టెన్ కేన్ విలియమ్సన్(64 బంతుల్లో 68) వికెట్లను ఫస్ట్ సెషన్‌లోనే కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ సూపర్ క్యాచ్‌కు విల్ యంగ్ వెనుదిరగ్గా.. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో విలియమ్సన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్‌(11 )తో కలిసి ఆచితూచి ఆడిన లాథమ్ మరో వికెట్ పడకుండా ఫస్ట్ సెషన్ ముగించాడు. ఇక సెకండ్ సెషన్ ఆరంభంలోనే టేలర్‌, హెన్రీ నికోల్స్‌(2)లను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే సెంచరీకి చేరువైన టామ్ లాథమ్‌ను అక్షర్ పటేలే స్టంపౌట్‌గా వెనక్కిపంపాడు. మూడో సెషన్ ఆరంభంలోనే బ్లండెన్‌ను కూడా అక్షర్ పెవిలియన్ చేర్చాడు.

Story first published: Saturday, November 27, 2021, 15:18 [IST]
Other articles published on Nov 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X