న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: 'ఇక నా కెరీర్ ముగిసిందనుకున్నా.. మళ్లీ క్రికెట్ ఆడనేమో అని భయపడ్డా'

IND vs ENG: I thought my career was over, Ollie Robinson responds on his tweet controversy

నాటింగ్‌హామ్: ఇక తాను మళ్లీ క్రికెట్ ఆడనేమో అని భయపడ్డానని ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్‌ ఒలీ రాబిన్‌సన్‌ తెలిపాడు. ఒకానొక దశలో తన కెరీర్ ముగిసిందని అనుకున్నాడట. గత జూన్‌లో న్యూజిలాండ్‌పై రాబిన్‌సన్‌ టెస్ట్ అరంగేట్రం చేసాడు. ఆ మ్యాచులో బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీయడమే కాకుండా.. బ్యాటింగ్‌లోనూ లోయర్‌ ఆర్డర్‌లో విలువైన పరుగులు చేశాడు. కివీస్ టెస్ట్ సమయంలోనే గతంలో రాబిన్‌సన్‌ చేసిన జాతి వివక్ష, విద్వేషాలకు సంబంధించిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) అతడిపై నిషేధం విధించింది. ఆపై విచారణ చేసి శిక్షను తగ్గించింది.

Oksana Chusovitina: లేటు వయసులోనూ అద్భుతాలు.. ఉజ్బెకిస్తాన్‌ మహిళా అథ్లెట్‌కు ఘనమైన వీడ్కోలు!!Oksana Chusovitina: లేటు వయసులోనూ అద్భుతాలు.. ఉజ్బెకిస్తాన్‌ మహిళా అథ్లెట్‌కు ఘనమైన వీడ్కోలు!!

జాతివివక్ష ట్వీట్లు:

జాతివివక్ష ట్వీట్లు:

జూన్ నెలలో న్యూజిలాండ్‌తో ఆడిన తొలి టెస్టులోనే ఒలీ రాబిన్‌సన్‌ ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేశాడు. అదే సమయంలో 2012-13 కాలంలో అతడు చేసిన జాతివివక్ష, విద్వేషపూరిత ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో రాబిన్సన్ క్షమాపణలు చెప్పాడు. 'నేను జాత్యహంకారిని, సెక్సిస్ట్‌ని కాదని స్పష్టం చేయాలనుకుంటున్నా. నా తప్పిదంకు తీవ్రంగా చింతిస్తున్నా. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడుతున్నా. ఆ సమయంలో నేను ఆలోచనా రహితంగా, బాధ్యతారహితంగా ఉన్నా. నా మానసికస్థితి సరిగా లేదు. నా చర్యలు క్షమించరానివి. ఆ ట్వీట్లకు పూర్తిగా చింతిస్తున్నా. ఇపుడు నేను ఒక వ్యక్తిగా పరిణతి చెందా' అని రాబిన్సన్ పేర్కొన్నాడు.

8 మ్యాచ్‌ల నిషేధం, జరిమానా:

8 మ్యాచ్‌ల నిషేధం, జరిమానా:

ఒలీ రాబిన్‌సన్‌ క్షమాపణ చెప్పినప్పటికీ.. ఈసీబీ అతనిపై చర్యలు తీసుకుంది. రాబిన్సన్‌ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. దాంతో రాబిన్‌సన్‌ కెరీర్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి. మళ్లీ ఇంగ్లండ్ జట్టుకు ఆడడని వార్తలు వచ్చాయి. అయితే రాబిన్సన్‌ చేసిన ట్వీట్లపై ఈసీబీ విచారణ జరిపి నిషేధాన్ని ఎత్తివేసింది. కేవలం 8 మ్యాచ్‌ల నిషేధం, జరిమానా విధించి కెరీర్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంది. దీంతో టీమిండియాతో టెస్ట్ సిరీస్ ఆడేందుకు అతడికి లైన్ క్లియర్ అయింది. 8 మ్యాచ్‌లలో ఇప్పటికే మూడు పూర్తయ్యాయి. ఇంకా ఐదు మ్యాచుల నిషేధం అనిపై ఉంది. నాటింగ్‌హామ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడాడు.

కెరీర్‌పై సందేహాలు వచ్చాయి:

కెరీర్‌పై సందేహాలు వచ్చాయి:

'ఆ ఘటన జరిగిన తర్వాత నేను నా న్యాయవాదులతో మాట్లాడుతున్నా. నేను కొన్ని సంవత్సరాల పాటు నిషేధించబడతానని, ఇంగ్లండ్ తరపున మళ్లీ ఆడలేనని అనుకున్నాం. మరో రెండు సంవత్సరాలలో నాకు 30 ఏళ్లు వస్తాయి. మరొకరు వచ్చి నా స్థానాన్ని ఆక్రమించుకోగలుగుతారు. కాబట్టి నా కెరీర్‌పై సందేహాలు మొదలయ్యాయి. ఒకోసారి ఇక నా కెరీర్ ముగిసిందనే ఆలోచనలు వచ్చేవి. అదృష్టవశాత్తూ అలా జరగలేదు. ఈరోజు అంతా బాగానే ఉంది. నిజం చెప్పాలంటే.. నా జీవితంలో ఆ రెండు రోజులు భారంగా గడిచాయి' అని ఒలీ రాబిన్‌సన్‌ చెప్పాడు.

మంచి వ్యక్తిగా మారా:

మంచి వ్యక్తిగా మారా:

'ఆ ఘటన నాపై మాత్రమే కాదు.. నా కుటుంబంపై కూడా ప్రభావం చూపింది. వారు చాలా బాధపడ్డారు. నేను ఇప్పుడు ఎంతో నేర్చుకున్నాను. పరిణితి సాధించా. ఇక నేను ముందుకు సాగాలని చూస్తున్నాను. నేను 18 ఏళ్ల యువకుడిగా ఉన్నపుడు ఆ ట్వీట్‌లు చేశాను. అవి మాత్రమే కాకుండా చాలా తప్పులు చేసాను. గత 10 సంవత్సరాలలో ఒక మంచి వ్యక్తిగా మారా. నేను ఇప్పుడు ఒక తండ్రిని. నన్ను ఉత్తమ వ్యక్తిగా ప్రజలు చూస్తారని ఆశిస్తున్నాను' అని ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్‌ ఒలీ రాబిన్‌సన్‌ ధీమా వ్యక్తం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ప్రస్తుతం 107 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Story first published: Saturday, August 7, 2021, 20:11 [IST]
Other articles published on Aug 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X