న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG 1st Test Playing 11: మయాంక్ ఔట్..జడేజా డౌట్..స్టోక్స్ లేకుండా ఇంగ్లండ్..తుది జట్లు ఇవే!

IND vs ENG 1st Test: India Predicted Playing 11 And Can Virat Kohli Team Crush England

హైదరాబాద్: సుదీర్ఘ విరామం అనంతరం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ బుధవారం ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) రెండో ఎడిషన్‌కు ఈ సిరీస్‌తోనే తెరలేవనుంది. దాంతో ఇరు జట్లు ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అంతేకాకుండా సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించేందుకు కోహ్లీసేన తహతహలాడుతోంది.

ఒలంపిక్స్ క్రీడలు చరిత్ర

న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎదురైన పరాభావం నుంచి పాఠాలు నేర్చుకున్న కోహ్లీసేన మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది. మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో భారత్ వేదికగా ఎదురైన వరుస పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని జోరూట్ సేన భావిస్తోంది. ఈ క్రమంలో ఈ సిరీస్ ద్వారా అభిమానులకు కావాల్సిన అసలు సిసలు మజా లభించనుంది.! అయితే ఫస్ట్ టెస్ట్ బరిలో దిగే కోహ్లీసేనపై ఓ లుక్కెద్దాం.

మయాంక్ ఔట్..

మయాంక్ ఔట్..

ఇక ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ప్రారంభానికి ముందే భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ప్రాక్టీస్ సెషన్‌లో కంకషన్‌కు గురయ్యాడు. మహమ్మద్ సిరాజ్ వేసిన షార్ట్ పిచ్ బాల్ అతని తలకు తగలడంతో అతను ఫస్ట్ టెస్ట్‌కు దూరయ్యాడు. దాంతో రోహిత్ శర్మకు జతగా కేఎల్ రాహుల్ దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి రోహిత్‌కు జతగా మయాంక్‌ను ఆడించి రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలని కోహ్లీసేన భావించింది. తద్వారా బలహీనంగా ఉన్న బ్యాటింగ్ లైనప్‌ను పటిష్టం చేయాలనుకుంది. కానీ ఆదిలోనే కోహ్లీసేనకు మయాంక్ రూపంలో గట్టి సవాల్ ఎదురైంది.

పుజారాకు మరో చాన్స్..

పుజారాకు మరో చాన్స్..

ఇటీవల కాలంలో దారుణంగా విఫలమవుతున్న టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజరాకు మరో అవకాశం దక్కనుంది. వరుసగా విఫలమవుతున్నా అతని బ్యాటింగ్ సామర్థ్యంపై కెప్టెన్ కోహ్లీ మరోసారి నమ్మకం ఉంచనున్నాడు. దాంతో అతను ఫస్ట్ డౌన్‌లో రానుండగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో బ్యాటింగ్‌కు రానున్నారు. ప్రస్తుతానికైతే ఈ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులేదు. రోహిత్, రాహుల్ మంచి ఆరంభాన్ని అందించి.. ఈ నలుగురులో ఏ ఇద్దరూ రాణించినా భారత బ్యాటింగ్‌కు తిరుగుండదు.

జడేజా/ శార్దూల్ ఠాకూర్..

జడేజా/ శార్దూల్ ఠాకూర్..

ఇక ఫస్ట్ టెస్ట్ కోసం ఇంగ్లండ్ వేల్స్ బోర్డు పేస్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌ను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో పూర్తిగా స్పిన్ పిచ్‌లు రెడీ చేసి ప్రయోజనం పొందినట్లు ఇక్కడ.. వీరు పేస్, స్వింగ్‌కు అనుకూలించే వికెట్లు సిద్దం చేసే అవకాశం ఉంది. మైదానంలోని వికెట్ ఫొటోలు చూస్తుంటే పిచ్‌పై పచ్చిక ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తిగా పేస్‌కు అనుకూలమైన పిచ్‌ను సిద్దం చేస్తే మాత్రం భారత్ ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగనుంది. అప్పుడు శార్దూల్ ఠాకూర్‌కు జట్టులో చోటు దక్కడం ఖాయం. అలా కానీ పరిస్థితుల్లో రెగ్యూలర్ స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా‌కు అవకాశం దక్కుతుంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు ఖాయం.

సిరాజ్/మహమ్మద్ షమీ..

సిరాజ్/మహమ్మద్ షమీ..

స్వింగ్ బౌలర్ల కొరతతో పాటు ఎక్స్ ట్రా పేసర్ లేకుండా న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో బరిలోకి దిగి కోహ్లీసేన మూల్యం చెల్లించుకుంది. ఆ అనుభవం దృష్ట్యా టీమ్‌మేనేజ్‌మెంట్ స్వింగ్ బౌలర్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఆ లెక్కన హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు జట్టులో చోటు దక్కడం ఖాయం. అలా కాకుండా అనుభవానికే ఓటేస్తే మాత్రం ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ‌ బరిలోకి దిగుతారు. లీడ్ పేసర్‌గా జస్‌ప్రీత్ బుమ్రా ఆడటం ఖాయం. సిరాజ్‌ను తీసుకుంటే షమీని పక్కనపెట్టవచ్చు. ఒకవేళ ఇషాంత్‌కు ఫిట్‌నెస్ సమస్యలుంటే షమీ బరిలోకి దిగుతాడు.

బెన్ స్టోక్స్ ఔట్.. కరన్ ఇన్

బెన్ స్టోక్స్ ఔట్.. కరన్ ఇన్

ఈ సిరీస్‌కు బెన్‌ స్టోక్స్‌లాంటి స్టార్‌ ఆటగాడు దూరం కావడం ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బ. అయితే యువ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ ఆ స్థానంలో తన వంతు పాత్ర పోషించనున్నాడు. అండర్సన్, బ్రాడ్‌లాంటి సీనియర్లతో పాటు రాబిన్సన్‌ మూడో పేసర్‌గా ఆడవచ్చు. ఇటీవల భారత పర్యటనకు వెళ్లి ఘోరమైన ప్రదర్శన కనబర్చిన బ్యాట్స్‌మెన్‌ బర్న్స్, సిబ్లీ, క్రాలీలకు సొంతగడ్డపైనైనా రాణించి ఆకట్టుకునేందుకు ఇది సరైన అవకాశం. ప్రధాన బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా తీవ్ర ఒత్తిడిలో ఉన్న రూట్‌కు కూడా ఈ సిరీస్‌ కీలకం

కానుంది.

ఫస్ట్ టెస్ట్.. తుది జట్లు(అంచనా)

ఫస్ట్ టెస్ట్.. తుది జట్లు(అంచనా)

భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), రిషభ్ పంత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ/మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా

ఇంగ్లండ్‌: జో రూట్‌ (కెప్టెన్‌),రోరీ బర్న్స్, డామ్ సిబ్లీ, జాక్ క్రాలీ, జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్, స్యామ్‌ కరన్, రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్

Story first published: Wednesday, August 4, 2021, 10:46 [IST]
Other articles published on Aug 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X