న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs BAN:అమ్మతోడు ఒక్క బంతి ఆడితే ఒట్టు.. ఉమ్రాన్ మాలిక్ పేస్‌కు వణికిపోయిన బంగ్లా బ్యాటర్లు!

IND vs BAN: Umran Malik cleaned up Najmul Hossain Shanto with 151kph pace in his second over

ఢాకా: టీమిండియా యువ పేసర్, కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ మరోసారి తన పేస్‌తో బ్యాటర్లను భయపెట్టాడు. అనూహ్యంగా బంగ్లాదేశ్ పర్యటనకు ఎంపికైన ఈ పేస్ సంచలనం.. రెండో వన్డేలో దుమ్మురేపాడు. గంటకు 151 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తూ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతని పేస్ ధాటికి బంగ్లా బ్యాటర్ల కనీసం ఒక్క బంతిని కూడా టచ్ చేయలేకపోయారు. దాంతో ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ వేసిన తొలి ఓవర్‌ మెయిడిన్‌గా నిలిచింది. ఇక బంగ్లా ఫస్ట్ డౌన్ బ్యాటర్ నజ్ముల్ హోస్సెన్ షాంటో(21)‌ను ఉమ్రాన్ మాలిక్ ఔట్ చేసిన తీరు నభూతో నభవిష్యత్తు.

తన రెండో ఓవర్ తొలి బంతికే షాంటోనూ ఉమ్రాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. గంటకు 151 కిలోమీటర్ల వేగంతో విసిరిన ఈ బంతి షాంటో ఆఫ్ వికెట్‌ను ఎగరగొట్టింది. వేగంగా దూసుకొచ్చిన బంతి ధాటికి వికెట్ గాల్లో పల్టీలు కొట్టింది. ఈ స్టన్నింగ్ డెలివరీకి షాంటోతో పాటు మైదానంలో ఉన్న అభిమానులు, ప్రేక్షకులు అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఉమ్రాన్ మాలిక్ వేసిన తొలి 5 ఓవర్లలో రెండు ఓవర్లు మెయిడిన్ అయ్యాయి. ఉమ్రాన్ వేసిన బంతులను టచ్ చేసేందుకు కూడా బంగ్లా బ్యాటర్లు తడబడ్డారు.

న్యూజిలాండ్ పర్యటనలో వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఉమ్రాన్ మాలిక్.. మహమ్మద్ షమీ గాయపడటంతో చివరి నిమిషంలో బంగ్లా పర్యటనకు ఎంపికయ్యాడు. ఆలస్యంగా రావడంతో తొలి వన్డే ఆడలేకపోయిన ఉమ్రాన్.. రెండో వన్డేలో కుల్దీప్ స్థానంలో చోటు దక్కించుకొని దుమ్మురేపాడు.
ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా టాస్ ఓడగా.. బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది.

IND vs BAN: Umran Malik cleaned up Najmul Hossain Shanto with 151kph pace in his second over

భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. కుల్దీప్ సేన్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ చోటు దక్కించుకోగా.. గాయం నుంచి అక్షర్ పటేల్ కోలుకోవడంతో షెహ్‌బాజ్ అహ్మద్ బెంచ్‌కు పరిమితమయ్యాడు. మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ బౌలింగ్‌కు బంగ్లా బ్యాటర్లు చేతులెత్తేసారు. 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. క్రీజులో మెహ్‌దీ హసన్, మహ్మదుల్లా ఉన్నారు.

Story first published: Wednesday, December 7, 2022, 13:56 [IST]
Other articles published on Dec 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X