న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: ఆ ఇద్దరి కోసం కర్చీఫ్ వేసుక్కూర్చున్న ఫ్రాంఛైజీలు - కోట్లు పలికే ఛాన్స్..!!

 IND vs BAN, T20 World Cup 2022: Litton Das and Taskin Ahmed likely to get IPL 2023 contract

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ సూపర్ 12లో భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. మరో ఘన విజయాన్ని అందుకుంది. అడిలైడ్‌ ఓవల్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. డక్ వర్త్ లూయిస్ విధానంలో అయిదు పరుగుల తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి మిగిల్చిన పరాభవాన్ని బంగ్లాపై తీర్చుకుంది టీమిండియా. తొలుత బ్యాటింగ్‌లో, అనంతరం బౌలింగ్‌లో దమ్ము దులిపింది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా గ్రూప్ 2లో పాయింట్ల టేబుల్ టాపర్‌గా నిలిచింది.

ఓడినా..

ఓడినా..

డక్‌వర్త్ లూయిస్ విధానంలో బంగ్లాదేశ్- 16 ఓవర్లల్లో 150 పరుగులు చేయాల్సి ఉండగా.. 145 వద్దే నిలిచిపోయిందా జట్టు ప్రస్థానం. 16 ఓవర్లల్లో ఆరు వికెట్లను కోల్పోయి 145 పరుగులే చేయగలిగింది. ఈ విజయంతో భారత్.. టీ20 ప్రపంచకప్ 2022 సెమీ ఫైనల్స్‌కు మరింత చేరువైంది. ఇంచ్ దూరంలో నిలిచింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే- మొత్తం ఎనిమిది పాయింట్లతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. తన తరువాతి మ్యాచ్‌లో జింబాబ్వేను ఢీ కొట్టబోతోంది రోహిత్ సేన.

బంగ్లా పోరాట స్ఫూర్తి..

బంగ్లా పోరాట స్ఫూర్తి..

ఈ మ్యాచ్‌లో పరాజయాన్ని చవిచూసినప్పటికీ- బంగ్లాదేశ్ ఆడిన తీరు ప్రశంసలను అందుకుంటోంది. భారత జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో మడమ తిప్పని పోరాట స్ఫూర్తిని బంగ్లాదేశ్ బ్యాటర్లు ప్రదర్శించారంటూ కితాబిస్తోన్నారు మాజీ క్రికెటర్లు. బంగ్లాదేశ్ ఓపెనర్లు లిట్టన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో.. తొలి ఏడు ఓవర్లల్లో భారత బౌలర్లను బెంబేలెత్తించిన ఉదంతాన్ని గుర్తు చేస్తోన్నారు. వర్షం అడ్డుపడకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేదంటూ అభిప్రాయపడుతున్నారు.

కట్టి పడేసిన లిట్టన్..

కట్టి పడేసిన లిట్టన్..

ప్రత్యేకించి- బంగ్లాదేశ్ ఓపెనర్ లిట్టన్ దాస్ బ్యాటింగ్ శైలి, అతను ఆడిన విధానం, దూకుడు స్వభావం, టీమిండియా బౌలర్లపై కౌంటర్ అటాక్‌కుదిగిన తీరు.. అభిమానులను కట్టిపడేసింది. 27 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును నెలకొల్పాడు. 222.22 స్ట్రైక్ రేట్‌తో స్కోర్ బోర్డును ఉరకలెత్తించాడు లిట్టన్. అతను అవుట్ అయ్యేంత వరకూ మ్యాచ్- బంగ్లాదేశ్ చేతుల్లోనే ఉంది. ఆ తరువాతే పట్టు కోల్పోయింది.

ఐపీఎల్ కాంట్రాక్ట్ రెడీ..

ఐపీఎల్ కాంట్రాక్ట్ రెడీ..

పక్కా టీ20 ఫార్మట‌్‌లో టీమిండియా బౌలర్లపై చెలరేగిన లిట్టన్ దాస్‌పై ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీలు కన్ను వేసినట్టే. అతన్ని తమ జట్టులోకి తీసుకోవడానికి పోటీ పడే అవకాశాలు లేకపోలేదు. ఐపీఎల్ 2023 సీజన్ నాటికి అతను ఏదైనా ఓ ఐపీఎల్ ఫ్రాంఛైజీలో కనిపించడం దాదాపు ఖాయమైనట్టే. 2015లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన లిట్టన్ దాస్.. నిలకడగా రాణిస్తోండటం ప్లస్ పాయింట్.

63 టీ20ల్లో..

63 టీ20ల్లో..

ఇప్పటివరకు 63 టీ20 ఇంటర్నేషనల్స్‌ను ఆడిను అనుభవం ఉంది లిట్టన్ దాస్‌కు. 1,318 పరుగులు చేశాడు. స్ట్రైకింగ్ రేట్ 126.48. స్పిన్, పేస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన గల స్ట్రోక్ ప్లేయర్. మంచి డిఫెన్స్ టెక్నిక్స్ అతనిలో ఉన్నాయి. పార్ట్ టైమ్ వికెట్ కీపర్‌ రోల్‌లో కూడా ఇమిడి పోగలడు. ఐపీఎల్‌ మ్యాచ్‌లల్లో ఆడటానికి ఇదిచాలనే అభిప్రాయాలు ఉన్నాయి.

తస్కిన్ అహ్మద్..

తస్కిన్ అహ్మద్..

బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలింగ్ సంచలనం తస్కిన్ అహ్మద్‌కు కూడా ఐపీఎల్ 2023లో ఆడే అవకాశం రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ 2022లో మూడు మ్యాచ్‌లల్లో ఎనిమిది వికెట్లను పడగొట్టాడు. నెదర్లాండ్స్‌పై ఫియరీ స్పెల్ వేశాడు. 25 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లను కూల్చాడు. ఇదివరకే అతనికి ఐపీఎల్‌లో ఆడే అవకాశం వచ్చినప్పటికీ.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఎన్ఓసీ ఇవ్వకపోవడం వల్ల ఆ అవకాశాన్ని చేజారింది.

విరాట్ కోహ్లీపై సంచలన ఆరోపణలు - బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో..!!

Story first published: Thursday, November 3, 2022, 12:18 [IST]
Other articles published on Nov 3, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X