న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs BAN: రసవత్తరంగా రెండో టెస్ట్.. డేంజర్ జోన్‌లో టీమిండియా..పట్టుబిగించిన బంగ్లాదేశ్‌!

IND vs BAN: Axar Patel keeps India in the hunt after top order collapse in 2nd test against Bangladesh

మిర్పూర్: భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ అనూహ్య మలుపు తిరిగి రసవత్తరంగా మారింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభం వరకు టీమిండియాదే పూర్తి ఆధిపత్యం కనిపించగా.. రఫ్ ప్యాచెస్ ఏర్పడిన పిచ్‌పై బంగ్లా స్పిన్నర్లు దుమ్ములేపారు. 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాకిచ్చారు. మెహ్‌దీ హసన్ మీరాజ్(3/12) తీన్మార్ వేయడంతో టీమిండియా 37 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బంగ్లా స్పిన్ ధాటికి శుభ్‌మన్ గిల్(7), కేఎల్ రాహుల్(2), విరాట్ కోహ్లీ(6), విరాట్ కోహ్లీ(1) క్రీజులో నిలబడలేకపోయారు.

టీమిండియా 45/4

దాంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 23 ఓవర్లలో 4 వికెట్లకు 45 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(26 బ్యాటింగ్), నైట్ వాచ్‌మన్ జయదేశ్ ఉనాద్కత్(3 బ్యాటింగ్) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 100 పరుగులు కావాలి. మరోవైపు బంగ్లా గెలుపునకు 6 వికెట్లు కావాలి. బంగ్లా బౌలర్లలో మెహ్‌దీ హసన్‌కు తోడుగా షకీబ్ అల్ హసన్ ఓ వికెట్ పడగొట్టాడు. నాలుగో రోజు తొలి సెషన్‌లో ఫలితం తేలనుంది. విజయంపై ఇరు జట్లు నమ్మకంగా ఉన్నాయి.

బంగ్లాదేశ్ 231 ఆలౌట్..

అంతకుముందు 7/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్.. 231 పరుగులకు కుప్పకూలింది. జకీర్ హసన్(51), లిటన్ దాస్(73) హాఫ్ సెంచరీలతో బంగ్లాను ఆదుకున్నారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. అశ్విన్, మహమ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్‌కు తలో వికెట్ దక్కింది. కుల్దీప్ యాదవ్ లేని లోటు కనిపించింది. స్పిన్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై భారత పేసర్లు వికెట్ల కోసంశ్రమించాల్సి వచ్చింది. లేకుంటే బంగ్లాదేశ్ 200లోపే ఆలౌటయ్యేది.

145 పరుగుల లక్ష్యంతో...

145 పరుగుల లక్ష్యంతో...

తొలి ఇన్నింగ్స్ 87 పరుగుల పరుగుల ఆధిక్యంతో భారత్ ముందు 145 పరుగుల లక్ష్యం నమోదైంది. భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియా చివరి సెషన్‌లోనే మ్యాచ్‌ను ముగిస్తుందని అంతా అనుకున్నారు. కానీ మూడు రోజుల పాటు పిచ్‌పై బాగా పరుగెత్తడంతో రఫ్ ప్యాచెస్ ఏర్పడ్డాయి. ఈ రఫ్ ప్యాచెస్‌ను బంగ్లా బౌలర్లు వాడుకున్నారు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌లను తమ స్పిన్‌తో బోల్తా కొట్టించారు. నాలుగో రోజు తొలి సెషన్‌లో జాగ్రత్తగా ఆడటం టీమిండియాకు చాలా ముఖ్యం. వికెట్లు కోల్పోతే జట్టు తీవ్ర ఒత్తిడికి లోనవ్వాల్సి ఉంటుంది. పంత్, అయ్యర్ ఉన్న నేపథ్యంలో 100 పరుగులు పెద్ద కష్టం కాకపోయినా పిచ్‌ను నమ్మలేని పరిస్థితి.

స్వల్ప స్కోర్లు...

స్వల్ప స్కోర్లు...

బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 227 ఆలౌట్ (మోమినల్ హక్ 84, ఉమేశ్ యాదవ్ 4/25, అశ్విన్ 4/71)

భారత్ తొలి ఇన్నింగ్స్: 314 ఆలౌట్(రిషభ్ పంత్ 93, అయ్యర్ 87, షకీబ్ అల్ హసన్ 4/79)

బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 231 ఆలౌట్ (లిటన్ దాస్ 72, జకీర్ హసన్ 51, అక్షర్ పటేల్ 3/68)

భారత్ రెండో ఇన్నింగ్స్ 23 ఓవర్లలో 45/4 (అక్షర్ పటేల్(26 బ్యాటింగ్), ఉనాద్కత్(3 బ్యాటింగ్))

Story first published: Saturday, December 24, 2022, 17:18 [IST]
Other articles published on Dec 24, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X