న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs AUS: భారత స్పిన్‌ను చితక్కొట్టేందుకు ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్!

IND vs AUS: Australia specifically preparing for sliders against R Ashwin, Axar Patel and Jadeja

హైదరాబాద్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా విజయమే లక్ష్యంగా సిద్దమవుతోంది. బీసీసీఐ మోసపూరిత ధోరణిని గ్రహించిన ఆ జట్టు ఈ సారి ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండానే నేరుగా ఆడనుంది. ఈ సిరీస్ కోసం 20 రోజులు ముందుగానే సన్నాహకాలు మొదలుపెట్టింది. భారత్‌కు బయల్దేరేముందు సిడ్నీ వేదికగా భారత్‌లో ఉండే స్పిన్‌ పిచ్‌ను సిద్దం చేసుకొని సాధన చేసింది.

ఉపఖండ పరిస్థితులకు అలవాటు పడేందుకు 10 రోజులు ముందగానే భారత్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా.. బెంగళూరు సమీపంలో ఆలూరులో ప్రాక్టీస్ చేస్తోంది. సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం అంత సులువైన పనికాదని భావించిన ఆస్ట్రేలియా.. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నదమవుతోంది.

స్పిన్ కోచ్‌గా వెటోరీ..

స్పిన్ కోచ్‌గా వెటోరీ..

బీసీసీఐ పేస్ పిచ్‌లతో తమను తప్పుదోవ పట్టిస్తుందని ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు అవసరం లేదని ముందే తేల్చుకున్న ఆసీస్‌...నెట్స్‌లోనే భిన్నమైన పిచ్‌లను రెడీ చేసి సాధన చేస్తోంది. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే క్రమంలో ఆ జట్టు కోచింగ్‌ బృందంలో న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్ డానియెల్‌ వెటోరీకి చోటు కల్పించింది.

ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న వెటోరీ అనుభవం, సూచనలు కచ్చితంగా ఆసీస్‌కు ఉపయోగపడతాయి. గతంలో ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుతో కలిసి పని చేసిన సాన్నిహిత్యంతో పిచ్‌ల ఏర్పాటు, ప్రాక్టీస్‌ విషయంలో ఆర్‌సీబీ బృందం సహకారాన్ని ఆ్రస్టేలియా హెడ్‌ కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ తీసుకున్నాడు.

పాత వీడియోలతో..

నాలుగు టెస్టుల వేదికల్లో ఎదురయ్యే పిచ్‌లపై ఒక అంచనాతో అదే తరహా పిచ్‌లను సిద్ధం చేసి ఆసీస్‌ ప్రాక్టీస్‌ చేస్తోంది. నెమ్మదైన టర్నింగ్‌ పిచ్, బాగా ట్యాంపరిగ్‌కు సహకరించే పిచ్, భిన్నమైన బౌన్స్‌లను నాగపూర్, ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో ఆ జట్టు ఎదుర్కోవాల్సి రావచ్చు. సీమ్‌కు అనుకూలించే ధర్మశాల తరహా పచ్చిక ఉన్న పిచ్‌పై కూడా ఆ్రస్టేలియా సాధన మొదలు పెట్టింది.

ఇక భారత స్పిన్నర్లను చితక్కొట్టేందుకు వెటోరీ పర్యవేక్షణలో ఆసీస్ బ్యాటర్లు సిద్దమవుతున్నారు. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్‌లను సునాయసంగా ఆడేందుకు.. వారి బౌలింగ్ వీడియో ఫుటేజీలను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు.

దేశవాళీ స్పిన్నర్లతో..

ముఖ్యంగా అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌ల బౌలింగ్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇందు కోసం వారి బౌలింగ్ శైలి కలిగి ఉన్న భారత దేశవాళీ స్పిన్నర్లను రప్పించుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్షర్‌ పటేల్‌ను పోలి ఉండే జమ్ము కశ్మీర్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఆబిద్‌ ముస్తాక్‌, అశ్విన్‌లా బౌలింగ్ చేసే బరోడా స్పిన్నర్ మహేశ్ పితీయా, జడేజాలా బౌలింగ్ చేసే శశాంక్ మల్హోత్రాలను ప్రాక్టీస్ క్యాంప్‌కు రప్పించి సాధన చేస్తున్నారు.

ఆబిద్‌ ఈ సీజన్‌ రంజీ ట్రోఫీలో అగ్రశ్రేణి జట్లపై సత్తా చాటి మొత్తం 32 వికెట్లతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ దేశవాళీ స్పిన్నర్ల బౌలింగ్‌లో ఆసీస్ బ్యాటర్లు తడబడినట్లు క్రిక్‌బజ్ పేర్కొంది.

ప్రాక్టీస్ ప్లాన్ చెప్పిన కోచ్..

ప్రాక్టీస్ ప్లాన్ చెప్పిన కోచ్..

ఇక అశ్విన్, అక్షర్ పటేల్, జడేజాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తమ జట్టు ప్రత్యేకంగా సాధన చేస్తుందనే విషయాన్ని ఆస్ట్రేలియా టీమ్ హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డోనాల్డ్ వెల్లడించాడు. ముఖ్యంగా కొత్తబంతితో భారత స్పిన్నర్లు వేసే బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాడు. అనూహ్య బౌన్స్‌తో వచ్చే స్పిన్‌ను ఎలా ఆడాలనే విషయంపై ఓపెనర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని చెప్పాడు.

Story first published: Friday, February 3, 2023, 11:03 [IST]
Other articles published on Feb 3, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X