న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'స్పిన్‌ బౌలింగ్‌ను మెరుగుపరుచుకుని జట్టులో ఐదో బౌలర్‌గా స్థిరపడాలనుకుంటున్నా'

Important that I keep improving my off-spin and fit in as a fifth bowler says Hanuma Vihari

ఆంటిగ్వా: ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ను మరింత మెరుగుపరుచుకోవాలి. టీమిండియా క్రికెట్‌ జట్టులో ఐదో బౌలింగ్‌ ఆప్షన్‌గా స్థిరపడాలనుకుంటున్నా అని తెలుగు కుర్రాడు హనుమ విహారి పేర్కొన్నాడు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 318 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అజింక్య రహానే (102; 242 బంతుల్లో 5×4) సెంచరీ సాధించగా.. హనుమ విహారి (93; 128 బంతుల్లో 10×4, 1×6) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. పేస్‌ బౌలర్లు బుమ్రా (5/7), ఇషాంత్‌ శర్మ(3/31), షమీ (2/13)లు విండీస్‌ను భయపెట్టారు.

<strong>'ఈ సెంచరీ నాకెంతో ప్రత్యేకం.. కష్టకాలంలో అండగా నిలిచిన వారికి అంకితం'</strong>'ఈ సెంచరీ నాకెంతో ప్రత్యేకం.. కష్టకాలంలో అండగా నిలిచిన వారికి అంకితం'

ఐదో బౌలింగ్‌ ఆప్షన్‌గా స్థిరపడాలి:

ఐదో బౌలింగ్‌ ఆప్షన్‌గా స్థిరపడాలి:

మ్యాచ్ అనంతరం హనుమ విహారి మాట్లాడుతూ... 'నా ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ను మరింత మెరుగుపరుచుకోవాలి. ఎప్పుడో ఒకసారి బౌలింగ్‌ చేయడం కాకుండా.. రెగ్యులర్‌ బౌలింగ్‌ ఆప్షన్‌ కావాలి. అదే నా లక్ష్యం. జట్టులో ఐదో బౌలింగ్‌ ఆప్షన్‌గా స్థిరపడాలనుకుంటున్నా. ఐదో బౌలింగ్‌ ఆప్షన్‌లో నేను ఫిట్‌ కావాలనుకుంటున్నా. నా కోసం మాత్రమే కాకుండా జట్టుకు కోసం నా బౌలింగ్ ఉపయోగపడాలి' అని విహారి అన్నాడు.

స్పిన్‌ను మరింత మెరుగుపరుచుకోవాలి:

స్పిన్‌ను మరింత మెరుగుపరుచుకోవాలి:

'నేను సాధ్యమైనన్ని ఎక్కువ ఓవర్లు వేస్తే జట్టుకు ఉపయోగపడాలనేది కోరిక. అందుకోసం నా ఆఫ్‌ స్పిన్‌ను మరింత మెరుగుపరుచుకోవాలి. భారత క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ స్పిన్నర్లు ఎందరో ఉన్నారు. వారి నుంచి పాఠాలు నేర్చుకోవడం నా అదృష్టంగా భావిస్తా. అశ్విన్ భారత అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరు. అతనితో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం, ఆఫ్-స్పిన్ బౌలింగ్ గురించి మాట్లాడటం ఆనందంగా ఉంది' అని విహారి తెలిపాడు. భారత జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా చోటు సంపాదించడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని విహారి స్పష్టం చేశాడు.

విహారిలో మంచి ఆటగాడున్నాడు:

విహారిలో మంచి ఆటగాడున్నాడు:

విహారి వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఓపెనర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా విహారి టెస్టుల్లో రాణిస్తున్నాడు. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులతో ఆకట్టుకున్నాడు. విహారి సెంచరీ చేస్తాడని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎదురుచూశాడు.. కానీ, అతను ఔట్ అవ్వడంతో భారత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసాడు. రహానేతో కలిసి విహారి 135 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కూడా కీలక సమయంలో 32 పరుగులు చేసాడు. 'విహారిలో మంచి ఆటగాడున్నాడు. అతని ఆట అమోగం' అని కోహ్లీ ప్రశంసించాడు.

ప్రో కబడ్డీ 2019.. 100 రైడ్ పాయింట్లు సాధించిన ఢిల్లీ రైడర్‌

Story first published: Monday, August 26, 2019, 16:24 [IST]
Other articles published on Aug 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X