న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Women's T20 World Cup ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

ICC Womens T20 World Cup Final: Australia won the toss and choose To bat first

మెల్‌బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో ఇక్కడ జరుగుతున్న ఫైనల్ ‌మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కావడం.. వరల్డ్ కప్ ఫైనల్ ఒత్తిడి ఉంటుందనే నేపథ్యంలో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మెగ్‌ లాన్నింగ్ బ్యాటింగ్ వైపే మొగ్గుచూపింది. ఇక సెమీఫైనల్లో ఆడిన జట్టుతోనే ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నట్లు చెప్పుకొచ్చింది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై.. ఎన్నడూ లేని జనసమూహం మధ్య ఈ రోజును తమదిగా మార్చుకుంటామని ఈ సందర్భంగా మెగ్ లాన్నింగ్ ధీమా వ్యక్తం చేసింది.

ఇక టాస్ ఓడిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. తాము కూడా తొలుత బ్యాటింగ్ చేయాలనుకున్నామని, కానీ ఛేజింగ్ చేసే సత్తా తమ జట్టుకు ఉందని తెలిపింది. మరోసారి తమ బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేస్తామని భారత కెప్టెన్ చెప్పుకొచ్చింది. ఇక భారత జట్టు కూడా ఎలాంటి మార్పుల్లేకుండానే టైటిల్ ఫైట్‌కు సిద్ధమైంది. తొలిసారి ఫైనల్ చేరిన భారత మహిళలు తమ కలను సాకారం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుండగా.. వరుసగా ఆరుసార్లు ఫైనల్‌కు చేరిన అనుభవం.. నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన చరిత్రతో మరోసారి సొంతగడ్డపై సొంత అభిమానుల మధ్య విజయ కేతనం ఎగరవేయాలని ఆతిథ్య జట్టు భావిస్తోంది.

ఇక ఈ మ్యాచ్‌కు అభిమానులు రికార్డు స్థాయిలో పోటెత్తారు. ఓవైపు అంతర్జాతీయ మహిళల దినోత్సవం.. మరోవైపు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్ జన్మదినం కావడంతో భారత మహిళలు చిరస్మరణీయ విజయాన్నందుకోవాలని భారత అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మైదానానికి కూడా భారీ సంఖ్యలో హాజరై భారత మహిళలకు మద్దతుగా నిలుస్తున్నారు.

తుది జట్లు:
భారత్‌: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ, తానియా భాటియా, హర్లీన్‌ డియోల్‌, రాజేశ్వరి గైక్వాడ్‌, రీచా ఘోశ్‌, వేద కృష్ణమూర్తి, శిఖ పాండే, అరుంధతి రెడ్డి, పూజ వస్త్రాకర్‌, పూనమ్‌, రాధా యాదవ్‌.

ఆస్ట్రేలియా: మెగ్‌ లానింగ్‌ (కెప్టెన్‌), ఎరిన్‌ బర్న్స్‌, నికోలా కేరీ, ఆష్లీ గాడ్నర్‌, రేచల్‌ హేన్స్‌, అలిసా హీలీ, జెస్‌ జొనాసెన్‌, డెలిసా కిమ్మిన్స్‌, సోఫీ మొలినెక్స్‌, బెత్‌ మూనీ, ఎలిస్‌ పెర్రీ, మెగాన్‌ స్కట్‌, అనాబెల్‌ సదర్లాండ్‌, తాల్యా వ్లామ్నిక్‌, జార్జియా హరెహామ్‌.

Story first published: Sunday, March 8, 2020, 12:29 [IST]
Other articles published on Mar 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X