న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అండర్-19 వరల్డ్‌కప్ సెమీస్ ప్రివ్యూ : భారత్ vs పాక్ గెలిచేదెవరు? టైటిల్ ఫైట్‌కు చేరేదెవరు?

U19 World Cup 2020 Semi Final 1 | India vs Pakistan Team Comparison
 ICC U-19 World Cup 2020: India vs Pakistan, Super League Semi-Final 1: Preview, Timings, TV Channel, Live Streaming Info

కేప్‌టౌన్: ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆసక్తి పోరుకు రంగం సిద్ధమైంది. యావత క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమరానికి సమయం రానే వచ్చింది. విశ్వకప్ వేదికగా ... రోమాలు నిక్క బొడుచుకునే ఉద్వేగ భరిత దృశ్యాలకు దాయాదుల సమరం వేదిక కానుంది. భారత్, పాకిస్థాన్ మధ్య మంగళవారం జరిగే హైఓల్టేజ్‌ సెమీస్ మ్యాచ్‌ ఇరు దేశాల అభిమానులను అలరించనుంది.

చివరగా గత వన్డే వరల్డ్‌కప్‌లో పోటీ పడ్డ ఇరు జట్లూ ఆరు నెలల విరామం తర్వాత కుర్రాళ్లతో మళ్లీ కదనరంగంలోకి దిగనున్నాయి..! ఓటమెరుగని జట్టుగా జోరు మీదున్న టీమిండియానే ఈ మ్యాచ్‌లో హాట్‌ ఫేవరెట్‌..! కానీ, అంచనాలకు అందని పాక్‌ ఏమైనా చేయగలదు..! మరి మనోళ్లు విజయాల జోరును కొనసాగిస్తారా..? లేదో చూడాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే..!

హాట్ ఫేవరేట్ భారత్..

హాట్ ఫేవరేట్ భారత్..

క్వార్టర్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఖంగుతినిపించిన ప్రియమ్ గార్గ్ నేత‌ృత్వంలోని యువ భారత్ మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. లీగ్ దశలో మూడింటికి మూడు గెలిచి ఓటమెరుగని జట్టుగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక క్వార్టర్స్‌లో అఫ్గానిస్తాన్‌ను ఓడించిన పాకిస్థాన్ సెమీస్‌ పోరుకు సిద్ధమైంది. మొత్తం ఈ మెగా టోర్నీలో ఘన చరిత్ర ఉన్న డిఫెండింగ్ చాంపియన్ భారత్ 6 సార్లు ఫైనల్‌కు చేరి 4 సార్లు విజేతగా నిలిచింది. ఇక ఐదు సార్లు ఫైనల్‌కు చేరిన పాక్ రెండు సార్లు మాత్రమే టైటిల్ అందుకుంది. అండర్-19 ప్రపంచకప్ వేదికగా భారత్, పాక్ మధ్య జరిగిన గత ఐదు మ్యాచ్‌ల్లో భారత్ ఒక్కటంటే ఒక్కటే ఓడి నాలుగు గెలిచింది.

బలంగా భారత్..

బలంగా భారత్..

యశస్వీ జైస్వాల్, దివ్యాన్ష్ సక్సెనా, తిలక్ వర్మ, ప్రియామ్ గార్గ్, దృవ్ జురెల్‌లో భారత బ్యాటింగ్ బలంగా ఉండగా.. పేసర్లు కార్తీక్ త్యాగి, ఆకాష్ సింగ్ అద్భుత ఫామ్‌లో ఉండగా. స్పిన్నర్లు రవి బిష్ణోయ్, అథర్వ అంకోలేకర్‌తో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. బ్యాటింగ్‌లో టాపార్డర్ విఫలమైనా.. తక్కువ స్కోర్‌కు పరిమితమైనా.. కాపాడుకునే బలం భారత్ బౌలర్ల సొంతం. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇదే జరిగింది.

టీనేజ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ టోర్నీ ఆసాంతం మెరుపులు మెరిపించాడు. ఇప్పటికే 4 ఇన్నింగ్స్‌ల్లో 207 పరుగులు చేశాడు. ఇందులో 82.47 సగటుతో మూడు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.

బౌలింగ్ విభాగంలో రవిబిష్ణోయ్ 11 వికెట్లతో నాలుగో హైయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.. ఇందులో జపాన్ పై 4/5 తో బెస్ట్ పెర్పామెన్స్ కనబర్చాడు. కార్తీక్ త్యాగి, ఆకాష్ సింగ్ తమ పేస్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తున్నారు.

పటిష్టంగానే పాకిస్థాన్..

పటిష్టంగానే పాకిస్థాన్..

గ్రూప్ స్టేజ్‌లో మూడు మ్యాచ్‌ల్లో రెండు నెగ్గిన పాక్ గ్రూప్-సిలో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక ఆ జట్టులో మహ్మద్ హరిస్ ఫామ్‌లో ఉన్నాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 110 రన్స్‌‌ చేశాడు. ఇక బౌలింగ్‌లో అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ ఆమిర్ ఖాన్ రాణిస్తున్నారు. ఇప్పటి వరకు అఫ్రిది 9 వికెట్లు తీయగా.. ఆమిర్ ఖాన్ 7 వికెట్లు పడగొట్టాడు.

పిచ్ ..

పిచ్ ..

సెన్యూస్ పార్క్ పిచ్‌ తొలుత బ్యాటింగ్ చేసిన వారికే అనుకూలం. ఇక్కడ జరిగిన గత నాలుగు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే 230కి పైగా పరుగులు చేశాయి. ఇక ఈ పిచ్‌పై ఛేజింగ్ చాలా కష్టం. దీంతో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్లు తొలుత బ్యాటింగ్ ఎంచుకోనున్నాయి.

టైమింగ్ & చానెల్...

ఇక ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 10 గంటలకు స్టార్ స్పోర్ట్స్-3, తెలుగులో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

తుది జట్లు(అంచనా)..

భారత్:

ప్రియమ్ గార్గ్(సి), ఆకాశ్ సింగ్, అథర్వ అంకోలేకర్, దృవ్ జురెల్(వికెట్ కీపర్), దివ్యాన్స్ సక్సెనా, కార్తీక్ త్యాగి, రవి బిష్ణోయ్, శశ్వత్ రావత్, యశస్వీ, తిలక్ వర్మ, సిద్దేశ్

పాకిస్థాన్: రొహైల్ నజీర్(సి,కీపర్), ఆమిర్, అబ్దుల్, ఆమిర్ ఖాన్, ఆరిష్ అలీ, హైదర్ అలీ, మహ్మద్ అబ్బాస్, హురారియా, తాహిర్ హుస్సెన్, షాహజాద్, ఇర్ఫాన్

Story first published: Monday, February 3, 2020, 21:41 [IST]
Other articles published on Feb 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X