న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ, ఐసీసీల మధ్య ట్యాక్స్ వార్.. ఒప్పందాలు రద్దు చేసుకుంటామని వార్నింగ్!

 ICC threatens BCCI, can terminate hosting agreement for the T20 World Cup in 2021

ముంబై: కరోనా వైరస్‌‌ ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)లో ఎన్నికల వేడి మొదలైంది. క్రికెట్‌‌ పెద్దన్న బీసీసీఐ, ఐసీసీ మధ్య ఎప్పటి నుంచో ఉన్న రాజకీయ వైరం తీవ్రమైంది. భారత్ ఆతిథ్యం ఇచ్చే 2021 టీ20 ప్రపంచ‌కప్‌‌, 2023 వన్డే ప్రపంచ‌కప్‌‌ విషయంలో ఇరు వర్గాల మధ్య వార్‌‌ నడుస్తోంది. ఈ రెండు మెగా టోర్నీలకు సంబంధించిన పన్ను మినహాయింపుకు సంబంధించిన లేఖ‌ విషయంలో భారత క్రికెట్ బోర్డు, అంతర్జాతీయ క్రికెట్‌ బాడీ మధ్య చాలా కాలం నుంచి గొడవ జరుగుతోంది. బీసీసీఐ గ్యారంటీ లేఖ సమర్పించడానికి ఇప్పటికే డెడ్‌‌లైన్‌‌ కూడా ముగిసింది.

ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాం..

ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాం..

దీంతో ఈ రెండు మెగా టోర్నీలకు పన్ను మినహాయింపులకు చేపట్టిన చర్యల వివరాలను ఆధారాలతో సహా తెలియజేయాలని ఐసీసీ జనరల్‌ కౌన్సిల్‌, కంపెనీ సెక్రటరీ జొనాథన్‌ హాల్‌ తాజాగా బీసీసీఐ సెక్రటరీకి లేఖ రాశారు. పన్నుల మినహాయింపులకు సంబంధించి విధించిన గడువును బీసీసీఐ పట్టించుకోవడంలేదని ఆయన ఆక్షేపించారు. అంతేకాదు.. ‘పన్ను మినహాయింపు విషయంలో తక్షణమే స్పందించకపోతే.. నిబంధనల ప్రకారం మే 18 తర్వాత ఎప్పుడైనా ఈ రెండు టోర్నమెంట్లకు సంబంధించి బీసీసీఐతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాం' అని హెచ్చరించడం గమనార్హం.

 ఆ అధికారం మాకు లేదు..

ఆ అధికారం మాకు లేదు..

దీనిపై బోర్డు పెద్దలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ‘పన్నులపై నిర్ణయం తీసుకొనే అధికారం బీసీసీఐకి లేదు. పన్ను మినహాయింపులు సాధ్యమా..కాదా..అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అయినా ఫార్ములా వన్‌కు పన్ను మినహాయింపులేని విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఐసీసీ చైర్మన్‌‌ పదవి కోసం నామినేషన్ల ప్రక్రియ మంగళవారం మొదలవనుంది.

ఈ సమయంలో అకస్మాత్తుగా మెయిల్స్‌‌ ఎందుకు వస్తున్నాయో మేం అర్థం చేసుకోగలం. టీ20, వన్డే వరల్డ్‌‌కప్‌‌ ఇప్పడే జరిగేవి కావు కాబట్టి కొంత కాలం వేచి చూడొచ్చు. గ్యారంటీ లెటర్‌‌ గడువు విషయానికి వస్తే లాక్‌‌డౌన్‌‌ ముగిసేంత వరకూ దీనిపై మేం ప్రభుత్వంతో మాట్లాడే పరిస్థితి లేదు అని ఐసీసీకి స్పష్టం చేశాం' అని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు అన్నారు.

లాక్‌డౌన్‌తో..

లాక్‌డౌన్‌తో..

భారత్‌ వేదికగా 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ నుంచి పన్నుల విషయంలో బీసీసీఐ, ఐసీసీ నడుమ వివాదం నడుస్తోంది. దీనిపై ఐసీసీ ట్రిబ్యునల్‌లో కేసు కూడా నడుస్తోంది. మరోవైపు రెండు ప్రపంచ కప్‌లకు పన్ను మినహాయింపుల అంశాన్ని బీసీసీఐ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కానీ కరోనాతో రెండు నెలలుగా దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉండడం, ప్రభుత్వాధికారులంతా కొవిడ్‌-19 చర్యల్లో నిమగ్నం కావడంతో పన్ను మినహాయింపుల ప్రతిపాదన మరుగున పడింది.

 ఆగ్రహంగా బీసీసీఐ..

ఆగ్రహంగా బీసీసీఐ..

ఈ పరిస్థితుల్లో పన్ను మినహాయింపులపై ఐసీసీ.. ఒత్తిడి తేవడంపై బీసీసీఐ గుర్రుగా ఉంది. టీ20 వరల్డ్‌ కప్‌కు పన్ను మినహాయింపుల తుది గడువు ఏప్రిల్‌లో ముగిసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఆ గడువును పొడిగించాలని ఈనెల 26 నుంచి జరగనున్న ఐసీసీ సమావేశంలో కోరతామని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. కాగా.. పన్నుల సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొనేందుకు ప్రయత్నిస్తున్నామని ఐసీసీ బోర్డు సభ్యుడొకరు చెప్పడం కొసమెరుపు.

శాండ్‌విచ్ తింటుంటే బ్యాటింగ్‌కు వెళ్లమన్నాడు: సురేశ్ రైనా

Story first published: Monday, May 25, 2020, 10:52 [IST]
Other articles published on May 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X