న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'#మీటూ' ఎఫెక్ట్: లైంగిక వేధింపులపై క్రికెటర్లకు ఐసీసీ పాఠాలు

ICC takes stand on sexual harassment; players to be educated in off-field conduct

హైదరాబాద్: '#మీటూ' ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తనుశ్రీదత్తా మొదలెట్టిన ఈ రచ్చ, ఇప్పుడు కేవలం సినిమా రంగానికి పరిమితం కాకుండా మీడియా, రాజకీయ రంగాల నుంచి క్రికెట్ దాకా వ్యాపించిన సంగతి తెలిసిందే.

అయితే, క్రికెటర్లు అలాంటి ఆరోపణల్లో చిక్కుకోకుండా ఉండేందుకు గాను ఐసీసీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మైదానం బయట క్రికెటర్లు ఎలా ఉండాలో అనే దానిపై కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. సింగపూర్‌లో జరిగిన మూడు రోజుల ఐసీసీ బోర్డు సమావేశాల్లో ఈ #మీటూ ఉద్యమం కూడా చర్చకు వచ్చింది.

 లైంగిక వేధింపులను నిరోధించడానికి

లైంగిక వేధింపులను నిరోధించడానికి

దీంతో లైంగిక వేధింపులను నిరోధించడానికి ఓ కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్, ఐసీసీ కార్యక్రమాలలో పని చేసే ప్రతి సభ్యుడు, స్థానిక ఆర్గనైజింగ్ కమిటీలోని సభ్యులు మైదానం బయట ఎలా వ్యవహరించాలో అనే అంశాలను ఐసీసీ అందులో పొందుపరిచింది.

గువహటిలో తొలి వన్డే: డ్రింక్స్ విరామానికి వెస్టిండిస్ 200/5

 లైంగిక వేధింపులకు గురి కాకుండా రక్షణ

లైంగిక వేధింపులకు గురి కాకుండా రక్షణ

ఈ కొత్త విధానంలో భాగంగా లైంగిక వేధింపులకు గురి కాకుండా రక్షణ కల్పించడంతోపాటు అసభ్యకర ప్రవర్తన, టోర్నీలోని స్టాఫ్‌తో అనుచితంగా ప్రవర్తించడంలాంటి చర్యలను నిరోధించడానికి కొన్ని నిబంధనలను ఐసీసీ రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా జూనియర్ స్థాయిలోనూ టోర్నీలు జరుగుతుండటంతో పిల్లలపై లైంగిక వేధింపులను అడ్డుకోవడాన్ని కూడా ఇందులో చేర్చారు.

 ప్రతి సభ్య దేశం అమలు చేయాలని ఐసీసీ స్పష్టం

ప్రతి సభ్య దేశం అమలు చేయాలని ఐసీసీ స్పష్టం

దీనిని ప్రతి సభ్య దేశం అమలు చేయాలని ఐసీసీ స్పష్టం చేసింది. అన్ని విధాలుగా క్రికెట్‌ను ఓ మంచి రక్షణ కలిగిన ప్రదేశంగా మార్చాలన్నదే తమ ప్రయత్నమని ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్‌సన్ ఈ సందర్భంగా వెల్లడించారు. #మీటూ ఉద్యమంలో భాగంగా శ్రీలంకకు చెందిన పలువురు క్రికెటర్లపై లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీపై ఆరోపణలు

బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీపై ఆరోపణలు

బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ సైతం ఈ ఆరోపణలు వచ్చాయి. దీంతో అక్టోబర్ 16 నుంచి 19 వరకు సింగపూర్ వేదికగా జరగనున్న ఐసీసీ సమావేశం నుంచి రాహుల్ జోహ్రీ పేరుని తప్పించారు. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా బీసీసీఐ పాలకుల కమిటీ ఇప్పటికే రాహుల్ జోహ్రీని ఆదేశించిన సంగతి తెలిసిందే.

Story first published: Sunday, October 21, 2018, 16:59 [IST]
Other articles published on Oct 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X