For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గువహటిలో తొలి వన్డే: డ్రింక్స్ విరామానికి వెస్టిండిస్ 200/5

India vs West Indies, 1st ODI in Guwahati: Shami dismisses Hope as Windies lose their 4th wicket

హైదరాబాద్: గువహటి వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండిస్ ధాటిగా ఆడుతోంది. డ్రింక్స్ విరామానికి అంటే 32 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ జాసన్ హోల్డర్(2), హెట్‌మైర్ (76) పరుగులతో ఉన్నారు. అంతకముందు వెస్టిండిస్ జట్టు కీలక వికెట్లను కోల్పోయింది.

ఐదో వికెట్ కోల్పోయిన వెస్టిండిస్

ఐదో వికెట్ కోల్పోయిన వెస్టిండిస్

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండిస్ జట్టు 188 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్ 31వ ఓవర్‌ మూడో బంతికి రోవ్మన్ పావెల్ (22) పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. అనంతరం అంఫైర్లు డ్రింక్స్ విరామాన్ని ప్రకటించారు.

నాలుగో వికెట్ కోల్పోయిన వెస్టిండిస్

నాలుగో వికెట్ కోల్పోయిన వెస్టిండిస్

32 పరుగులు చేసిన హోప్ షమీ బౌలింగ్‌లో ధోనీకి కీపర్ క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. చంద్రపాల్ హేమరాజ్, పావెల్, శామ్యూల్స్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న విండిస్‌కు హోప్ ఔట్ కావడం పెద్ద ఎదురుదెబ్బ. హోప్ ఔట్ అయిన అనంతరం రోవ్‌మన్‌ పావెల్‌ క్రీజులోకి వచ్చాడు. మరోవైపు హెట్‌మైర్ దూకుడుగా ఆడుతున్నాడు.

మూడో వికెట్ కోల్పోయిన వెస్టిండిస్

మూడో వికెట్ కోల్పోయిన వెస్టిండిస్

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండిస్ జట్టు 86 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. చాహల్ బౌలింగ్‌లో శామ్యూల్స్ డకౌట్ అయి పెవిలియన్ బాట పట్టాడు.

రెండో వికెట్ కోల్పోయిన వెస్టిండిస్

రెండో వికెట్ కోల్పోయిన వెస్టిండిస్

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్‌ రెండో వికెట్‌ చేజార్చుకుంది. కలీల్ అహ్మద్ బౌలింగ్‌లో పావెల్ ధావన్‌కు క్యాచ్‌గా చిక్కి ఔటయ్యాడు. హాఫ్ సెంచరీ సాధించి ధాటిగా ఆడుతున్న కీరన్‌ పావెల్‌ (51) ఔటయ్యాడు. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన 14.5వ బంతిని లాంగాన్‌లో భారీ షాట్‌ ఆడబోయి ఫీల్డర్‌ ధావన్‌ చేతికి చిక్కాడు. 39బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 51పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం మూడు వికెట్ల నష్టానికి వెస్టిండిస్ జట్టు 19 ఓవర్లలో 96 పరుగులు చేసింది.

తొలి వికెట్ కోల్పోయిన వెస్టీండీస్

భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్‌ జట్టు 19 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చంద్రపాల్‌ హేమరాజ్.. షమీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో విండీస్ ఆదిలోనే కీలక వికెట్ కోల్పోయింది. చంద్రపాల్ హేమరాజ్ ఔట్ కావడంతో హోప్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 5 ఓవర్లు పూర్తయ్యేసరికి వెస్టిండీస్‌ వికెట్‌ నష్టానికి 26 పరుగులు చేసింది.

1
44266
Story first published: Sunday, October 21, 2018, 16:13 [IST]
Other articles published on Oct 21, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+