న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరగలేదు: ఐసీసీ

ICC says No reason to doubt integrity of 2011 World Cup final


దుబాయ్:
భారత్-శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఎలాంటి ఫిక్సింగ్‌ జరగలేదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్పష్టం చేసింది. ఫైనల్ మ్యాచ్‌పై అనుమానాలు వ్యక్తం చేయడానికి అవకాశమే లేదని పేర్కొంది. భారత్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక అమ్ముడుపోయిందని ఆ దేశ మాజీ క్రీడాశాఖమంత్రి అలుత్గమాగే మహిందానంద చేసిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న లంక ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
2011 World Cup : No Reason To Doubt Integrity Of Final - ICC || Oneindia Telugu
ప్రత్యేక విచారణ:

ప్రత్యేక విచారణ:

2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ను భారత్‌కు శ్రీలంక అమ్మేసుకుందని లంక మాజీ క్రీడాశాఖ మంత్రి మహిందానంద ఆరోపించిన సంగతి తెలిసిందే. తన అనుమానాలను 14అంశాలుగా ఆయన వెల్లడించారు. దీంతో ఫైనల్‌ మ్యాచ్‌పై విచారణ జరిపేందుకు శ్రీలంక క్రీడాశాఖ.. పోలీసు అధికారులతో ఓ ప్రత్యేక దర్యాప్తు విభాగాన్ని ఏర్పాటు చేసి క్రిమినల్‌ విచారణకు ఆదేశించింది. 2011 శ్రీలంక జట్టు కెప్టెన్‌, ప్రస్తుత ఎంసీసీ అధ్యక్షుడు కుమార సంగక్కరను 10గంటలు, ఫైనల్‌లో శతకం చేసిన మహేలా జయవర్దనేను అధికారులు ఆరు గంటల పాటు ప్రశ్నించి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఓపెనర్‌ ఉపుల్‌ తరంగ సహా అప్పటి సెలెక్టర్‌ అరవింద డిసిల్వాను కూడా విచారించారు.

 ఎలాంటి ఆధారాల్లేవు:

ఎలాంటి ఆధారాల్లేవు:

ఫైనల్ మ్యాచ్‌లో ఫిక్సింగ్‌ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాల్లేవంటూ విచారణను అర్ధంతరంగా ఆపేశారు లంక పోలీసులు. ఫైనల్‌లో ఫిక్సింగ్‌ జరిగినట్టు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని దర్యాప్తు విభాగం అధికారి, ఎస్పీ జగత్‌ ఫొనెస్కా స్పష్టం చేశారు. మరింత మంది ఆటగాళ్లను విచారించాల్సిన అవసరం తమకు కనిపించడం లేదని అన్నారు. 'మాకు విచారణ బాధ్యతలు అప్పగించిన క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శికి నివేదిక పంపాం. మా విచారణ ఇంతటితో ముగిసింది. ఆటగాళ్లను ఇంతకుమించి విచారించాల్సిన అవసరం మాకు కనిపించలేదు. అందరు ఆటగాళ్లనూ పిలిచి వాంగ్మూలాలు తీసుకుంటే అనవసర రాద్దాంతం అవుతుందని భావించాం' అని తెలిపారు.

ఫిక్సింగ్ జరగలేదు:

ఫిక్సింగ్ జరగలేదు:

మరోవైపు 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఐసీసీ స్పష్టం చేసింది. ' 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌పై అనుమానాలు వ్యక్తం చేయడానికి అవకాశమే లేదు. విచారణ జరిపించే దిశగా ఎలాంటి ఆధారాలనూ ఎవరూ మా ముందు ఉంచలేదు. శ్రీలంక క్రీడల శాఖ మాకు ఈ విషయమై లేఖ రాయలేదు. మేం ఏ ఆరోపణనైనా తీవ్రంగానే పరిగణిస్తాం. కానీ అందుకు సరైన ఆధారాలు ఉండాలి' అని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం జనరల్‌ మేనేజర్‌ అలెక్స్‌ స్పష్టం చేశారు.

జయవర్ధనే సెంచరీ:

జయవర్ధనే సెంచరీ:

ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 274/6 స్కోరు చేసింది. జయవర్ధనే సెంచరీ చేసాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌.. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ వీరేందర్ సెహ్వాగ్‌ (0), సచిన్‌ టెండూల్కర్ (18)ల వికెట్లను త్వరగా కోల్పోయింది. ఆ క్లిష్ట స్థితిలో గౌతమ్ గంభీర్ (97) అద్భుత పోరాటానికి.. ఎంఎస్ ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ తోడవడంతో ఆరు వికెట్లతో టీమిండియా విజయం సాధించి 28 ఏళ్ల తర్వాత రెండో ప్రపంచకప్‌ను అందుకుంది.

శ్రీలంకలో మ్యాచ్ అంటూ భారత్‌లో నిర్వహించారు‌.. బెట్టింగ్‌ కోసమేనా?!!

Story first published: Saturday, July 4, 2020, 11:59 [IST]
Other articles published on Jul 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X