న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మైదానంలో బెయిర్ స్టో అతి: ఐసీసీ మందలింపు, ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్!

Bairstow Receives Demerit Point For Audible Obscenity || Oneindia Telugu
ICC reprimands Jonny Bairstow for audible obscenity during Auckland T20I

హైదరాబాద్: ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టోను సోమవారం ఐసీసీ తీవ్రంగా మందలించింది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్కులో ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో పరుష పదాలను ఉపయోగించినందుకు ఐసీసీ అతడిపై ఈ చర్యలకు ఉపక్రమించింది.

ఈ మ్యాచ్‌లో 18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 47 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన జానీ బెయిర్ స్టో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుని కూడా అందుకున్నాడు. అయితే, ఐసీసీ ప్రవర్తనా నియమావళిని లెవల్ 1 ఉల్లంఘించినందుకు గాను అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ చేర్చబడింది.

<strong>చాహర్ టీవీ ఇంటర్యూలో చిటపటలు: అయ్యర్‌తో అలా, దీపక్ చాహర్‌తో ఇలా(వీడియో)</strong>చాహర్ టీవీ ఇంటర్యూలో చిటపటలు: అయ్యర్‌తో అలా, దీపక్ చాహర్‌తో ఇలా(వీడియో)

అసలేం జరిగింది?

అసలేం జరిగింది?

ఐదో టీ20లో దూకుడుగా ఆడుతున్న జానీ బెయిర్ స్టోను ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో జేమ్స్‌ నీషమ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. పెవిలియన్‌కు చేరే క్రమంలో అతడి క్యాచ్ పట్టిన న్యూజిలాండ్ ఫీల్డర్ టిమ్‌ సీఫర్ట్‌‌ని బూతులు తిట్టాడు. వాటిని స్టంప్ మైక్‌తో పాటు టీవీలో విన్న ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లు వెయ్న్‌ నైట్స్‌, క్రిస్‌గఫానీ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు.

ఒక డీమెరిట్‌ పాయింట్‌ కూడా

ఒక డీమెరిట్‌ పాయింట్‌ కూడా

మరోవైపు మ్యాచ్ అనంతరం బెయిర్‌స్టో తన తప్పుని ఒప్పుకోవడంతో ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ లెవెల్‌ 1 కింద అతడి ఖాతాలో ఒక డీమెరిట్‌ పాయింట్‌ చేర్చారు. ఐసీసీ కోడ్‌ ఆఫ్ కండక్ట్‌ ఫర్‌ ప్లేయర్స్‌ అండ్‌ ప్లేయర్స్‌ సపోర్ట్‌ పర్సనల్‌ ఆర్టికల్‌ 2.3 ప్రకారం ఏదైనా అంతర్జాతీయ మ్యాచ్‌లో పరుష పదాలు ఉపయోగించరాదు.

Deepak Chahar's inspiring story: గ్రెగ్ ఛాపెల్ వద్దనడం నుంచి ధోని పాత్ర వరకు!

నిబంధనను అతిక్రమిస్తే

నిబంధనను అతిక్రమిస్తే

ఈ నిబంధనను అతిక్రమిస్తే ఐసీసీ మందలింపుతో పాటు మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత ఉంటుంది. అలాగే ఒకటి లేదా రెండు డీమెరిట్‌ పాయింట్లను ఐసీసీ శిక్షగా విధిస్తారు. ఇదిలా ఉంటే, వరుణుడు అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. దీంతో నిర్ణీత ఓవర్లలో న్యూజిలాండ్ 146 పరుగులు చేసింది.

3-2తో సిరిస్ ఇంగ్లాండ్ కైవసం

3-2తో సిరిస్ ఇంగ్లాండ్ కైవసం

అనంతరం 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేయడంతో మ్యాచ్‌ ‘టై' అయింది. మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్‌ ఆడించారు. సూపర్ ఓవర్‌లో బెయిర్‌స్టో, మోర్గాన్‌ 17 పరుగులు చేయగా.. న్యూజిలాండ్‌ కేవలం 8 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఐదు టీ20ల సిరిస్‌ను ఇంగ్లాండ్ 3-2తో కైవసం చేసుకుంది.

Story first published: Tuesday, November 12, 2019, 11:40 [IST]
Other articles published on Nov 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X