న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Deepak Chahar's inspiring story: గ్రెగ్ ఛాపెల్ వద్దనడం నుంచి ధోని పాత్ర వరకు!

Deepak Chahar's Inspiring Story : From Greg Chappell To Hat Trick Wickets || Oneindia Telugu
Deepak Chahars inspiring story: From getting rejected by Greg Chappell, nurtured by MS Dhoni & making it to Team India

హైదరాబాద్: దీపక్‌ చాహర్‌.. నాగ్‌పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో హ్యాట్రిక్ వికెట్లు తీసి అంతర్జాతీయ క్రికెట్‌ను ఒక్కసారిగా తనవైపునకు తిప్పుకున్నాడు. 18 ఏళ్ల వయస్సులోనే రాజస్థాన్ తరుపున రంజీ క్రికెట్‌లో అబ్బురపరిచే ప్రదర్శన చేశాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగులకే 8 వికెట్లు తీసిన ఆశ్చర్యపరిచాడు.

ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు చాహర్ దెబ్బకు 21 పరుగులకే ఆలౌటై ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ టీ20ల్లో ఒక మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీయడంతో పాటు భారత్‌ తరఫున హ్యాట్రిక్‌ వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గానూ చరిత్ర సృష్టించాడు. అయితే, ఈ ప్రదర్శన వెనుక అకుంఠిత దీక్ష దాగుంది.

<strong>బుమ్రా లాగా నిన్ను ఉపయోగిస్తా, నీతో బౌలింగ్‌ చేయిస్తా: రోహిత్ చెప్పిన మాటలతోనే!</strong>బుమ్రా లాగా నిన్ను ఉపయోగిస్తా, నీతో బౌలింగ్‌ చేయిస్తా: రోహిత్ చెప్పిన మాటలతోనే!

చాహర్‌ను బౌలింగ్‌కే పనికిరాడన్న గ్రెగ్ చాఫెల్

చాహర్‌ను బౌలింగ్‌కే పనికిరాడన్న గ్రెగ్ చాఫెల్

నిజానికి దీపక్ చాహర్‌ను ఒకానొక సమయంలో అసలు బౌలింగ్‌కే పనికిరాడని అన్నారు. అది 2008... రాజస్థాన్‌ క్రికెట్‌లో యువ ఆటగాళ్ల కోసం ట్రయల్స్‌ సాగుతున్నాయి. ఈ ట్రయల్స్‌కు 16 ఏళ్ల దీపక్‌ చాహర్‌ కూడా హాజరయ్యాడు. అప్పట్లో ఆ రాష్ట్ర క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న గ్రెగ్‌ చాపెల్‌.. చాహర్‌ బౌలింగ్‌ను అసలు పరిగణనలోకి తీసుకోలేదు.

టాప్‌-50లోకి కూడా ఎంపిక చేయకపోగా

టాప్‌-50లోకి కూడా ఎంపిక చేయకపోగా

అతడిని టాప్‌-50లోకి కూడా ఎంపిక చేయకపోగా అసలు నీకు క్రికెట్‌లో భవిష్యత్తే లేదని తేల్చి చెప్పాడు. గ్రెగ్ ఛాపెల్ వ్యాఖ్యలతో చాహర్ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఆ సమయంలో అతడి తండ్రి మాజీ భారత వాయుసేన ఉద్యోగి లోకేంద్రసింగ్‌ మద్దతుగా నిలవడంతో తనకు క్రికెటర్‌గా భవిష్యత్తు లేదని చెప్పిన చోటే తానెంటో నిరూపించుకున్నాడు.

150 కిలోమీటర్ల వేగంతో

150 కిలోమీటర్ల వేగంతో

దీపక్ చాహర్ 1992 ఆగస్టులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో జన్మించినప్పటికీ... ఉద్యోగరీత్యా వారు జైపూర్‌లో స్థిరపడటంతో చాహర్‌ రాజస్థాన్‌ జట్టునే ఎంచుకున్నాడు. కెరీర్‌ ఆరంభంలో 125 కిలోమీటర్ల వేగంతోనే బౌలింగ్‌ చేసిన దీపక్‌ చాహర్... ఆ తర్వాత ఫిట్‌నెస్‌‌ను మరింతగా మెరుగుపర్చుకొని 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్నాడు.

చాహర్ విజయం వెనుక ధోని

చాహర్ విజయం వెనుక ధోని

చాహర్ విజయం వెనుక టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పాత్ర ఎనలేనిది. ఐపీఎల్‌లో పుణె సూపర్‌జెయింట్స్‌కు ఆడుతున్న తరుణంలో చాహర్ ప్రతిభను టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గుర్తించాడు. దీపక్ చాహర్ స్వింగ్, కచ్చితమైన వేగం ధోనీని ఆకట్టుకున్నాయి. 2018 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై పునరాగమనం చేయడంతో చాహర్‌ను ధోనీ జట్టులోకి తీసుకున్నాడు.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు!

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు!

ప్రతీ మ్యాచ్‌లోనూ కొత్త బంతిని చాహర్ చేతికే అందించాడు. కెప్టెన్ ధోని నమ్మకాన్ని వమ్ము చేయకండా దీపక్‌ చాహర్ సైతం ఆకట్టుకోవడంతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ప్రధాన బౌలరయ్యాడు. ఈ సీజన్‌లో 22 వికెట్లతో చేసిన అద్భుత ప్రదర్శన టీమిండియా తరుపున టీ20ల్లో చోటు దక్కేలా చేసింది. గతేడాది జులైలో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన చాహర్ ఇప్పటి వరకు 7మ్యాచ్‌లు ఆడి 14వికెట్లను పడగొట్టాడు.

Story first published: Tuesday, November 12, 2019, 10:59 [IST]
Other articles published on Nov 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X