న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC ODI Rankings: టీమిండియా ర్యాంకు మరింత పదిలం!

 ICC ODI Rankings: India gain rating points after series sweeps in Zimbabwe

దుబాయ్: ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పులేకుండా టీమిండియా తన మూడో ర్యాంకును నిలబెట్టుకుంది. జింబాబ్వేపై మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో గెలిచిన భారత్ మరో మూడు రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకొని 111 పాయింట్లతో తమ ర్యాంకును మరింత పదిలం చేసుకుంది. ఇక నెదర్లాండ్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన పాకిస్థాన్‌ సైతం సైతం ఒక పాయింట్‌ను పెంచుకొని 107తో నాలుగో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌ (124), ఇంగ్లండ్‌ (119) మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఐదు, ఆరు స్థానాల్లోకొనసాగుతున్నాయి.

సోమవారం జింబాబ్వేతో జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో జింబాబ్వే అంత ఈజీగా తలొగ్గలేదు. విజయం కోసం గొప్పగా పోరాడింది. సికందర్‌ రజా (115; 95 బంతుల్లో 9×4, 3×6) సంచలన ఇన్నింగ్స్‌తో జింబాబ్వేను గెలిపించేందుకు గట్టి ప్రయత్నమే చేశాడు. చివర్లో భారత్ బౌలర్లు పుంజుకోవడంతో 13 పరుగులతో గట్టెక్కింది. అంతకుముందు శుభ్‌మన్ గిల్(130) సెంచరీతో రాణించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆతిథ్య జట్టును భారత్‌ చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్‌లో 189 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా చేధించగా.. రెండో మ్యాచ్‌లో దాదాపు సగం ఓవర్లు మిగిలుండగానే విజయం సాధించింది.

ప్రస్తుతం టీమిండియా ఆసియాకప్ కోసం యూఏఈకి చేరుకుంది. ఆగస్టు 28న పాకిస్థాన్‌తో జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌తో భారత్ తమ క్యాంపైన్ ప్రారంభించనుంది. ఈ క్రమంలోనే వారం రోజుల ముందుగానే యుఏఈ చేరిన టీమిండియా టైటిలే లక్ష్యంగా సన్నాహకాలు మొదలుపెట్టనుంది. పాక్‌తో మ్యాచ్‌కు ముందు మూడు రోజులు భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించనున్నారు.

మరోవైపు పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా యూఏఈకి చేరుకున్నారు. నెదర్లాండ్స్ నుంచి నేరుగా దుబాయ్‌కు చేరుకున్నారు. ఇక ఆగస్టు 27న శ్రీలంక, ఆఫ్గనిస్తాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో 15వ ఆసియాకప్‌కు తెరలేనుంది. ఆ మరుసటి రోజు (ఆగస్టు 28) టీమిండియా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో హైవోల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్ కూడా టైటిల్ కోసం పోటీపడతుంది.

Story first published: Tuesday, August 23, 2022, 20:43 [IST]
Other articles published on Aug 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X