న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డివిలియర్స్ మళ్లీ జట్టులోకి వస్తానంటే వద్దని చెప్పిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు

ICC Cricket world Cup 2019: De Villiers sought World Cup recall, SA management said no

హైదరాబాద్: ఏబీ డివిలియర్స్.... మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడు. తన అద్భుతమైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ గతేడాది మే నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అయితే, ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న 12వ ఎడిషన్ వన్డే వరల్డ్‌కప్‌లో మళ్లీ జ‌ట్టులోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేశాడని... అయితే, డివిలియర్స్ ప్ర‌య‌త్నాల‌ను సఫారీ జట్టు మేనేజ్‌మెంట్ తోసిపుచ్చిన‌ట్లు గురువారం వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా వరుసగా మూడ మ్యాచ్‌ల్లో ఓడింది.

సఫారీ జట్టు ప్రదర్శనపై

సఫారీ జట్టు ప్రదర్శనపై

దీంతో ఈ మెగా టోర్నీలో ఆ జట్టు సెమీఫైనల్‌కు చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే, టోర్నీలో ప్రస్తుతం జట్టు ప్రదర్శనను చూసిన అభిమానులు ఏబీ డివిలియర్స్ ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వచ్చింది.

గతేడాది మే నెలలో డివిలియర్స్ వీడ్కోలు

గతేడాది మే నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఏబీ డివిలియర్స్ ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న వరల్డ్‌కప్ కోసం దక్షిణాఫ్రికా జాతీయ జట్టులోకి రావాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని గత ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్, హెడ్ కోచ్ ఒట్టిస్ గిబ్సన్, సెలక్టర్ల కన్వీనర్ లిండా జోండిలను కలిసి మళ్లీ జట్టుకు ఆడాలని ఉందని తన మనుసులోని మాటను వెల్లడించాడు.

ఇంగ్లాండ్‌కు ప‌య‌న‌మ‌వ్వడానికి ముందు

ఇంగ్లాండ్‌కు ప‌య‌న‌మ‌వ్వడానికి ముందు

వరల్డ్‌కప్‌ కోసం 15 మంది స‌భ్యుల బృందం ఇంగ్లాండ్‌కు ప‌య‌న‌మ‌వ్వడానికి ముందు 24 గంట‌ల ముందే డివిలియర్స్ ఈ విషయాన్ని చెప్పినట్లు తాజాగా వెల్లడైంది. అయితే, డివిలియర్స్ అభ్య‌ర్థ‌న‌ను జట్టు మేనేజ్‌మెంట్ ఎంత మాత్రం పరిగణనలోకి తీసుకోక పోవడం విశేషం. ఇందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది.

డివిలియర్స్‌ను మళ్లీ జట్టులోకి తీసుకుంటే

డివిలియర్స్‌ను మళ్లీ జట్టులోకి తీసుకుంటే

డివిలియర్స్‌ను మళ్లీ జట్టులోకి తీసుకుంటే అతడి స్థానంలో వ‌చ్చిన ఆటగాళ్లతో పాటు జట్టులోని మిగతా క్రికెటర్లు సైతం అస‌హ‌నానికి లోన‌వుతార‌న్న ఉద్దేశంతో జట్టు మేనేజ్‌మెంట్ యాజ‌మాన్యం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. తన రిటైర్మెంట్‌ను వెన‌క్కి తీసుకోవాల‌నుకున్నా దక్షిణాఫ్రికా బోర్డు మాత్రం డివిలియర్స్ ఆభ్యర్ధనను పరిగణనలోకి తీసుకోలేదు.

ట్విట్టర్‌లో డివిలియర్స్ ఇలా

మరోవైపు ఈ వార్తలపై ఏబీ డివిలియర్స్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. "వరల్డ్‌కప్ మన జట్టుకి మద్దతు తెలపడంపై మనమంతా శ్రద్ధ పెట్టాలి. ఇంకా టోర్నీలో ఆడాల్సిన మ్యాచ్‌లు చాలా ఉన్నాయి. మన బాయ్స్ పుంజుకుంటారని నేను నమ్ముతున్నాను" అని ఏబీ డివిలియర్స్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

Story first published: Thursday, June 6, 2019, 15:41 [IST]
Other articles published on Jun 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X