న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ వెళ్లిపోవడం.. టీమిండియాకు బొక్కే: ఇయాన్ చాపెల్

Ian Chappell says Virat Kohlis return will create big hole, series fate lies on selection choices

సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీ భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అన్నాడు. కోహ్లీ అందుబాటులో ఉండకపోవడం భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌కు బొక్కపడ్డేట్లేనని అభిప్రాయపడ్డాడు. భారత్ టీమ్ సెలెక్షన్‌పై సిరీస్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయన్నాడు. ఇక అడిలైడ్ వేదికగా జరిగే ఫస్ట్ టెస్ట్ అనంతరం కోహ్లీ భారత్‌కు తిరుగురానున్న విషయం తెలిసిందే. అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనుండటంతో విరాట్ పెటర్నిటీ లీవ్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే మిగతా మూడు టెస్టులకు కోహ్లీ దూరమవడం టీమిండియా బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇయాన్‌ చాపెల్‌ తెలిపాడు.

మంచి అవకాశం..

మంచి అవకాశం..

తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫొతో మాట్లాడుతూ.. కోహ్లీ స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయమై భారత సెలక్టర్లకు పరీక్షగా మారిందని చెప్పాడు. అయితే అతని గైర్హాజరీ ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు చక్కని అవకాశంగా పేర్కొన్నాడు. ‘కోహ్లీ గైర్హాజరీ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌కు పెద్ద బొక్క. అయితే ప్రతిభావంతులైన భారత యువ ఆటగాళ్లకు చక్కని అవకాశం. అతని స్థానంలో వచ్చే ఆటగాడు కీలకం. అతని ఆట విజయవకాశాలపై ప్రభావం చూపుతుంది.

 క్వారంటైన్ కలిసొచ్చింది..

క్వారంటైన్ కలిసొచ్చింది..

ఇక భారత జట్టుకు క్వారంటైన్‌లో ప్రాక్టీస్ సెషన్ అనుమతించడం కలిసి వచ్చిందన్నాడు. కరోనా లాక్‌డౌన్ తర్వాత ప్రాక్టీస్ లేని క్రమంలో ఇక్కడ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఈ పర్మిషన్ దోహదపడిందన్నాడు. భారత సెలెక్టర్లు కనుక వారి పని సక్రమంగా చేసుంటే ఈ క్వారంటైన సమయాన్ని ఆ జట్టు చక్కగా వాడుకున్నట్లేనని తెలిపాడు. టీమ్ సెలెక్షన్‌పైనే జట్టు విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయని తెలిపాడు.

 వార్నర్‌కు అతనే సరైన జోడీ..

వార్నర్‌కు అతనే సరైన జోడీ..

ఆసీస్‌ జట్టుకు కూడా వార్నర్‌తో పాటు ఓపెనింగ్‌కు దిగే జోడి సెలక్షన్‌ కష్టంగా మారిందని, యువ క్రికెటర్‌ పుకోవ్‌స్కీ దానికి సరిపోతాడని అనుకుంటున్నట్టు చాపెల్‌ తెలిపాడు. ఇక ఇరు దేశాల మధ్య జరగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రపంచ టెస్టు చాంపియన్‌ షిప్‌లో భాగం. టెస్టు చాంపియన్‌ షిప్‌లో ప్రస్తుతం భారత్‌-ఆస్ట్రేలియాలు టాప్‌లో ఉన్నాయి. ఇక విరాట్‌ కోహ్లి సారథ్యంలోని టీమిండియా ఆసీస్‌ గడ్డపై 2018-19 బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫిని సాధించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా మళ్లీ అదే మ్యాజిక్‌ చేయాలని ఉవ్విళ్లూరుతోంది.

IPL 2020 రికార్డు వ్యూయర్‌షిప్‌‌కు సెహ్వాగ్ ఒక కారణం: సౌరవ్ గంగూలీ

Story first published: Monday, November 23, 2020, 10:38 [IST]
Other articles published on Nov 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X