న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌ మైండ్‌గేమ్స్‌ ఆడడం నేనెప్పుడూ చూడలే..ఇన్నాళ్ల తర్వాత పైన్‌ మాట్లాడటం ఆశ్చర్యమే!అతని మాట ఎవరు వింటారు?

I Don’t Think India Played Any Mind Game: Deep Dasgupta respond on Tim Paines Sideshows comments
Team India Former Cricketer Deep Dasgupta Slams Tim Paine || Oneindia Telugu

ముంబై: భారత జట్టుపై ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్‌ పైన్‌ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ దీప్‌దాస్‌ గుప్తా ఘాటుగా జవాబిచ్చారు. భారత్‌ మైండ్‌గేమ్స్‌ ఆడడం, పక్కదారి పట్టించడం తానెప్పుడూ చూడలేదనన్నారు. సిరీస్ ముగిసి చాన్నాళ్లు అయిన తరవాత టీమిండియా పక్కదారి పట్టించి తమను ఓడించిందని పైన్‌ చేసిన వ్యాఖ్యలు తనను విస్మయం కలిగించాయని దీప్‌దాస్‌ పేర్కొన్నారు.

ఆసీస్ పర్యటనలో భారత జట్టు క్వారంటైన్‌ ఇబ్బందులు పడటం వాస్తవమేనన్నారు. ఈ ఏడాది ఆరంభంలో ముగిసిన పర్యటనలో భారత్ 2-1తో టెస్టు సిరీస్‌ గెలిచింది. 2018-19లో కూడా కోహ్లీసేన అక్కడ సిరీస్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.

అది వాళ్ల తప్పే

అది వాళ్ల తప్పే

తాజాగా దీప్‌దాస్‌ గుప్తా ఇండియా టుడేతో మాట్లాడుతూ.. 'టిమ్‌ పైన్‌ సాకులు చెబుతున్నాడని నేను అనుకోను. జట్టు ఓటమి పాలైన కొన్ని నెలల తర్వాత అతడు ఈ విషయంపై మాట్లాడాడు. పైన్‌ ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చాడా అన్నది పక్కన పెడితే.. భారత్ పక్కదారి పట్టించిందనడం విస్మయం కలిగించింది. నిజానికి బంతిపై దృష్టి పెట్టలేకపోవడం వాళ్ల తప్పే. క్వారంటైన్‌ అంశంలో నిజాయితీ ఉంది.

భర్త ఉద్దేశ పూర్వకంగా ఏమీ చేయలేదు. గబ్బా టెస్టుకు ముందు జట్టును ఐసోలేషన్‌లో ఉండమన్నారు. ఆటగాళ్లు, జట్టు నిర్వహణ మరియు కోచింగ్ సిబ్బంది ఎవరూ దీని గురించి బహిరంగంగా మాట్లాడలేదు. అవి కేవలం పుకార్లు మాత్రమే. చాలాసార్లు వదంతులు రావడం చూస్తూనే ఉంటాం' అని అన్నారు.

భారత్‌ ఎలాంటి మైండ్‌గేమ్స్‌ ఆడలేదు

భారత్‌ ఎలాంటి మైండ్‌గేమ్స్‌ ఆడలేదు

'ఇంతకు అధికారిక ప్రకటనే లేనప్పుడు ఆసీస్‌ కెప్టెన్ దేని గురించి మాట్లాడుతున్నాడు?. ఇంతకు అతడి మాట ఎవరు వింటున్నట్టు? నిజానికి వాళ్ల ఓటమి స్వయంకృతం. 30 ఏళ్ల తర్వాత గబ్బాలో ఓడిపోయారు. టీమిండియాకు ప్రధాన ఆటగాళ్లు లేకున్నా.. భారత్ చేతిలో వరుస సిరీసులు కోల్పోయారు. దీన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. బంతిపై దృష్టి పెట్టలేకపోవడం వాళ్ల తప్పే.

భారత్‌ ఎలాంటి మైండ్‌గేమ్స్‌ ఆడలేదు. భారత్ మైండ్‌గేమ్స్‌ ఆడటం, పక్కదారి పట్టించడం నేనెప్పుడూ చూడలేదు. ఏదేమైనా ఇన్నాళ్ల తర్వాత ఆసీస్ ఓటమిపై మాట్లాడటం ఆశ్చర్యకరమే' అని దీప్‌దాస్‌ గుప్తా పేర్కొన్నారు.

మెస్సీ, రొనాల్డో, ఫెదరర్‌లను వెన‌క్కినెట్టిన మెక్‌గ్రెగర్.. 16 నుంచి నంబర్ వన్‌కు! టాప్-10లో మనోళ్లు లేరు!

ఏకాగ్రతను పక్కదారి పట్టించి

ఏకాగ్రతను పక్కదారి పట్టించి

గురువారం టిమ్‌ పైన్‌ న్యూస్.కామ్ ద్వారా మాట్లాడాడు. 'పక్కదారి పట్టించడంలో భారత్ బాగుంది. ఏ మాత్రం ప్రాధాన్యం లేని సమాచారంతో ఏకాగ్రత చెడగొడుతుంది. సిరీస్‌లో అలాంటి వాటికి మేం వెనకబడిన సందర్భాలు ఉన్నాయి. దీనిని ఎదుర్కోవడం సవాలే. ఇందుకో ఉదాహరణ కూడా చెబుతా. టీమిండియా ఆటగాళ్లు గబ్బాకు వెళ్లమని చెప్పారు. అప్పుడు మ్యాచ్‌ ఎక్కడ జరుగుతుందో మాకు తెలియదు. ఇలాంటి పక్కదారి పట్టించే పనుల సృష్టిలో వారు బాగున్నారు. దాంతో మేం బంతిపై దృష్టి పెట్టలేకపోయాం' అని పైన్‌ అన్నాడు.

2-1తో సిరీస్‌ను కైవసం

2-1తో సిరీస్‌ను కైవసం

పెటర్నిటీ లీవ్‌పై బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో‌ని మూడు మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమవ్వగా.. తాత్కలిక సారథిగా అజింక్య రహానే జట్టును ముందుండి నడిపించాడు. సూపర్ కెప్టెన్సీతో పాటు యువ ఆటగాళ్ల అండతో ఆసీస్‌ను సొంతగడ్డపై ఓడించి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాడు. అడిలైడ్‌ టెస్టులో 36 పరుగులకే కుప్పకూలిన భారత్.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది.

కోహ్లీ లేకున్నా.. సీనియర్‌ పేసర్లు గాయపడ్డా.. అనుభవం లేని ఆటగాళ్లే బౌలింగ్‌ చేసినా పైన్‌ బృందాన్ని చిత్తుచిత్తుగా ఓడించింది. శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్ పంత్‌, మహ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, చేటేశ్వర్ పుజారా అద్భుతంగా ఆడారు.

Story first published: Friday, May 14, 2021, 11:46 [IST]
Other articles published on May 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X