న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెస్సీ, రొనాల్డో, ఫెదరర్‌లను వెన‌క్కినెట్టిన మెక్‌గ్రెగర్.. 16 నుంచి నంబర్ వన్‌కు! టాప్-10లో మనోళ్లు లేరు!

Mixed martial arts star Conor McGregor get tops place in Forbes highest-paid athletes list
Top 10 Highest Paid Athletes In The World | Mcgregor Tops Forbes List || Oneindia Telugu

అమెరికా: మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ స్టార్ కోనార్ మెక్‌గ్రెగర్ గత సంవత్సరంలో అత్యధిక ఆదాయం పొందిన అథ్లెట్‌గా నిలిచాడు. స్టార్ ఆట‌గాళ్ల‌ను వెన‌క్కి నెట్టి మ‌రీ అగ్ర‌ స్థానంలో నిలిచాడు. ఫుట్‌బాల్ ద్వయం లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో.. టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌లను అధిగమించి.. గత సంవత్సరంతో పోలిస్తే రూ.971 కోట్లు ఎక్కువ సంపాదించాడు. 16వ స్థానం నుంచి ఏకంగా నంబర్ వన్‌కు రావడం ఇక్కడ విశేషం. మాజీ టు-డివిజన్ యుఎఫ్‌సి ఛాంపియన్ అయిన మెక్‌గ్రెగర్ వార్షిక ఆదాయం దాదాపు 180 మిలియన్ డాలర్లు (రూ.1,324 కోట్లు).

150 కిలోమీటర్ల వేగంతో కరోనా దూసుకొస్తోంది.. చేతులను తరచూ శుభ్రపరుచుకుంటూ ఔట్‌ చేద్దాం!!150 కిలోమీటర్ల వేగంతో కరోనా దూసుకొస్తోంది.. చేతులను తరచూ శుభ్రపరుచుకుంటూ ఔట్‌ చేద్దాం!!

 అగ్రస్థానంలో మెక్‌గ్రెగర్:

అగ్రస్థానంలో మెక్‌గ్రెగర్:

అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్-2021లో అత్యధిక ఆదాయం పొందిన టాప్-10 అథ్లెట్ల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఇందులో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ స్టార్ కోనార్ మెక్‌గ్రెగర్ అగ్రస్థానంలో ఉన్నాడు. మెక్‌గ్రెగర్ ఆదాయాల పరంగా స్టార్ ప్లేయర్స్ లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో ​​రొనాల్డో, రోజర్ ఫెదరర్‌లను అధిగమించడాం విశేషం. ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. కోనార్‌ మెక్‌గ్రెగర్ వార్షిక ఆదాయం దాదాపు రూ.1,324 కోట్లు. ఈ జాబితా త‌యారుచేసేందుకు క్రీడాకారుల ఆదాయాన్ని గ‌త ఏడాది మే 1 నుంచి ఈ ఏడాది మే 1 వ‌ర‌కు లెక్క‌లోకి తీసుకున్నారు ఫోర్బ్స్ అధికారులు.

విస్కీ బ్రాండ్ ద్వారా :

విస్కీ బ్రాండ్ ద్వారా :

కోనార్‌ మెక్‌గ్రెగర్ వార్షిక ఆదాయం రూ.1,324 కోట్లు కాగా ఇందులో ఎండార్స్‌మెంట్, అడ్వర్టైజింగ్, ఇతర‌త్రాల నుంచి దాదాపు రూ.1,163 కోట్లు సంపాదించాడు. ఐరిష్ వ్యక్తి అయిన మెక్‌గ్రెగర్.. తన విస్కీ బ్రాండ్ ద్వారా మెజారిటీ వాటాను పొందినట్టు ఫోర్బ్స్ పేర్కొంది. ఇక క్రీడల ద్వారా దాదాపు రూ.161 కోట్లు ఆదాయం పొందాడు. గతేడాది మెక్‌గ్రెగర్ ఆదాయం దాదాపు రూ.353 కోట్లతో ఫోర్బ్స్ జాబితాలో 16వ స్థానంలో ఉన్నాడు. ఈసారి 16వ స్థానం నుంచి ఏకంగా నంబర్ వన్‌కు దూసుకొచ్చాడు. ఫోర్బ్స్ జాబితాలో తన స్థానంపై మెక్‌గ్రెగర్ ఆనందం వ్యక్తం చేశాడు.

మెస్సీ2:

మెస్సీ2:

ఈ జాబితాలో అర్జెంటీనాకు చెందిన స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ రెండో స్థానంలో ఉన్నాడు. మెస్సీ వార్షిక ఆదాయం దాదాపు రూ.956 కోట్లు. 2020లో ఇవి దాదాపు రూ.765 కోట్లుగా ఉండేవి. గత సంవత్సరం రెండవ స్థానంలో ఉన్న క్రిస్టియానో రొనాల్డో ఈసారి మూడవ స్థానానికి పడిపోయాడు. అతని వార్షిక ఆదాయం దాదాపు రూ. 883 కోట్లు. గత ఏడాది రొనాల్డో సంపాద‌న రూ.772 కోట్లు. అమెరికన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డెక్ ప్రెస్‌కాట్ వార్షిక ఆదాయం రూ.791 కోట్లతో నాలుగో స్థానంలో.. బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు లెబ్రాన్ జేమ్స్ రూ.710 కోట్లతో ఐదవ స్థానంలో ఉన్నారు. ఇక టాప్-10 జాబితాలో మన భారత దేశానికి చెందిన ఒక్క అథ్లెట్‌ కూడా లేడు.

టాప్-10 జాబితా ఇదే:

టాప్-10 జాబితా ఇదే:

1. కోనార్‌ మెక్‌గ్రెగర్

2. లియోనెల్ మెస్సీ

3. క్రిస్టియానో రొనాల్డో

4. డెక్ ప్రెస్‌కాట్

5. లెబ్రాన్ జేమ్స్

6. నేమార్

7. రోజర్ ఫెదరర్

8. లూయిస్ హామిల్టన్

9. టామ్ బ్రాడి

10. కెవిన్ డ్యూరాంట్

Story first published: Friday, May 14, 2021, 10:51 [IST]
Other articles published on May 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X