న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉప్పల్ వేదికగా మరో మ్యాచ్! టీమిండియా పూర్తి షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ!

 Hyderabad to host Ind-NZ 1st ODI, BCCI announce schedule for INDs home series against SL, NZ and AUS

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది టీమిండియా బిజి బిజీగా గడపనుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా.. ఈ టూర్ అనంతరం సొంతగడ్డపై వరుస సిరీస్‌లు ఆడనుంది. శ్రీలంక, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా‌ జట్లకు ఆతిథ్యం ఇవ్వనున్న టీమిండియా.. వరుసగా టీ20, వన్డే, టెస్ట్‌ సిరీస్‌లు ఆడనుంది. ఈ మూడు దేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది.

బంగ్లాదేశ్ పర్యటన అనంతరం సొంతగడ్డపై శ్రీలంకతో మూడేసి వన్డేలు, టీ20 సిరీస్‌లు ఆడనున్న టీమిండియా.. తర్వాత న్యూజిలాండ్‌తో వరుసగా 3 మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల్లో తలపడనుంది. అనంతరం.. వరల్డ్‌టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ 2021-23 భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఆ తర్వాత ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌‌లో తలపడనుంది. జనవరి నుంచి మార్చి వరకు తీరిక లేకుండా ఆడనున్న భారత ఆటగాళ్లు.. ఆ తర్వాత ధనాధన్ లీగ్ ఐపీఎల్‌లో సందడి చేయనున్నారు.

ఉప్పల్‌లో మ్యాచ్..

ఉప్పల్‌లో మ్యాచ్..

ఈ మూడు నెలల షెడ్యూల్‌లో హైదరాబాద్‌కు ఓ మ్యాచ్ ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కింది. న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో జనవరి 18న జరగనున్న తొలి వన్డేకు భాగ్యనగరంలోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. టీ20 ప్రపంచకప్ ముందు హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ కోసం అభిమానులు ఎగబడ్డారు. టికెట్ల పంపిణీ విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నిర్లక్ష్యం కారణంగా తొక్కిసలాట కూడా జరిగింది. పెద్ద ఎత్తున టికెట్లు పక్కదారి పట్టాయనే విమర్శలు కూడా వచ్చాయి. చివరకు ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. సుమారు నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరగడంతో అభిమానులు పోటెత్తారు. మరోసారి మ్యాచ్ జరగనుండటంతో హెచ్‌సీఏ ఎలా ఏర్పాట్లు చేస్తుందో చూడాలి.

వైజాగ్‌లోనూ మ్యాచ్..

వైజాగ్‌లోనూ మ్యాచ్..

విశాఖపట్నం కూడా ఓ మ్యాచ్‌కు ఆతిథ్య ఇవ్వనుంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో మార్చి 19న జరగనున్న రెండో వన్డేకు విశాఖ పట్నం వేదికగా ఎంపికైంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు కూడా అభిమానులు పోటెత్తనున్నారు. వైజాగ్ వేదికగా మ్యాచ్ జరిగి చాలా రోజులు అయ్యింది. ఇక్కడ ఐపీఎల్ 2023 మ్యాచ్‌లు జరిగే అవకాశం లేకపోవడంతో ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు.

శ్రీలంక భారత పర్యటన: జనవరి 3- జనవరి 15

శ్రీలంక భారత పర్యటన: జనవరి 3- జనవరి 15

టీ20 సిరీస్‌

తొలి టీ20: జనవరి 3- ముంబై

రెండో టీ20: జనవరి 5- పుణె

మూడో టీ20: జనవరి 7- రాజ్‌కోట్‌

వన్డే సిరీస్‌

తొలి వన్డే: జనవరి 10- గువాహటి

రెండో వన్డే: జనవరి 12- కోల్‌కతా

మూడో వన్డే: జనవరి 15- త్రివేండ్రం

న్యూజిలాండ్‌ భారత పర్యటన: జనవరి 18- ఫిబ్రవరి 1

న్యూజిలాండ్‌ భారత పర్యటన: జనవరి 18- ఫిబ్రవరి 1

వన్డే సిరీస్‌

తొలి వన్డే: జనవరి 18- హైదరాబాద్‌

రెండో వన్డే: జనవరి 21- రాయ్‌పూర్‌

మూడో వన్డే: జనవరి 24- ఇండోర్‌

టీ20 సిరీస్‌

తొలి టీ20: జనవరి 27- రాంచీ

రెండో టీ20: జనవరి 29- లక్నో

మూడో టీ20: ఫిబ్రవరి 1- అహ్మదాబాద్‌

ఆస్ట్రేలియా భారత పర్యటన: ఫిబ్రవరి 13- మార్చి 22

ఆస్ట్రేలియా భారత పర్యటన: ఫిబ్రవరి 13- మార్చి 22

నాలుగు టెస్టులు

తొలి టెస్ట్: ఫిబ్రవరి 9- 14: నాగ్‌పూర్‌

రెండో టెస్ట్: ఫిబ్రవరి 17- 21: ఢిల్లీ

మూడో టెస్ట్: మార్చి 1-5: ధర్మశాల

నాలుగో టెస్ట్: మార్చి 9- 13: అహ్మదాబాద్‌

3 వన్డేలు

తొలి వన్డే: మార్చి 17- ముంబై

రెండో వన్డే: మార్చి 19- వైజాగ్‌

మూడో వన్డే: మార్చి 22- చెన్నై

Story first published: Thursday, December 8, 2022, 16:40 [IST]
Other articles published on Dec 8, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X