న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లోబడ్జెట్ రాజస్థాన్ రాయల్స్‌కు హిట్టర్‌ను అలా గుర్తించాం: ద్రవిడ్

How Rahul Dravid helped Rajasthan Royals find an explosive batsman

న్యూఢిల్లీ: ప్రతిభావంతమైన ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురావడం, వారిని సానబెట్టడంలో భారత దిగ్గిజ క్రికెటర్ రాహుల్‌ ద్రవిడ్‌‌కు సాటి లేరు. భారత్‌-ఏ, అండర్‌-19 కోచ్‌గా అద్భుతమైన క్రికెటర్లను టీమిండియాకు అందించాడు. హార్దిక్‌ పాండ్య, మనీశ్‌ పాండే, రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, విజయ్‌ శంకర్‌, శుభ్‌మన్‌ గిల్‌, పృథ్వీ షా, హనుమ విహారి, మయాంక్‌ అగర్వాల్‌ వంటి ఆటగాళ్లంతా ద్రవిడ్ నేతృత్వంలోనే రాటే దేలారు. వారందరని ది వాల్ మానసికంగా బలవంతులుగా మార్చాడు.

ఆర్సీబీతో మొదలు పెట్టి..

ఆర్సీబీతో మొదలు పెట్టి..

ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)లో రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున మూడేళ్లు ఆడిన ద్రవిడ్ ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ తరఫున మరో మూడేళ్లు బరిలోకి దిగాడు. ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం ఆ జట్టుకే మెంటార్‌గా పనిచేస్తున్నాడు. ఇక 2011, 2012 సీజన్‌లలో దారుణంగా విఫలమైన రాజస్థాన్‌.. 2013లో మాత్రం మూడో స్థానంలో నిలిచి చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించింది. అయితే ఆస్ట్రేలియా ప్లేయర్ బ్రాడ్ హడ్జ్ కారణంగానే రాజస్థాన్ ఈ విజయాలనందుకుంది.

అతని రికార్డులు పరిశీలించి..

అతని రికార్డులు పరిశీలించి..

అయితే లో బడ్జెట్ కలిగిన రాజస్థాన్ రాయల్స్‌ జట్టుకు హిట్టర్ లేని లోటు ఎలా తీర్చామో తాజాగా ద్రవిడ్ వివరించాడు. ‘ఆర్సీబీ తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌, మెంటార్‌గా పనిచేశా. బడ్జెట్‌లో 40-60 శాతంతోనే పెద్ద జట్లతో పోటీపడాలి. అందరి దగ్గర విస్తృతంగా సమాచారం, విజ్ఞానం ఉన్నప్పుడు అదెంతో కష్టం. అప్పుడే మేం బ్రాడ్‌హడ్జ్‌ను పరిశీలించాం. ఆస్ట్రేలియా తరఫున టీ20ల్లో అతడికి మంచి రికార్డు ఉంది. అయితే భారత గడ్డపై మాత్రం అతను విఫలమయ్యాడు. అతడి డేటాను పరిశీలించి పేస్‌ బౌలింగ్‌లో మాత్రమే రెచ్చిపోతున్నాడని గమనించాం.

సీఎస్కేలో ధోనీలా..

సీఎస్కేలో ధోనీలా..

మేం బాగా ఆలోచించి అతడిని చివరి నాలుగు, ఐదు ఓవర్లలో దించాలనుకున్నాం. ఎందుకంటే అప్పుడు పేసర్లు మాత్రమే బంతులు వేస్తారు. దాంతో అతడిని వేలంలో కొనుగోలు చేశాం. సాధారణంగా బ్రాడ్‌ హడ్జ్‌ ఆసీస్‌ తరఫున టాప్-3లో ఆడతాడు. మేం చివరి ఓవర్లలో ఆడాలని చెప్పినప్పుడు మొదట తిరస్కరించాడు. ఫాస్ట్‌ బౌలింగ్‌లో విజయవంతమైన రికార్డు, మిగతా డేటాను మేం అతడికి చూపించాం. అతడి వీరబాదుడు మాకెంత అవసరమో వివరించాం. సీఎస్కేలో ధోనీ, ముంబైలో పొలార్డ్‌, ఆర్సీబీలో ఏబీ తరహాలో మాకెవరూ హిట్టర్లు లేరని చెప్పాం. ఆ స్థానాన్ని నీతో భర్తీ చేయాలనుకుంటున్నామని ఒప్పించాం. ఆ తర్వాత అతడు చెలరేగి ఆడాడు. ఇది జట్టు విజయాలకు ఉపయోగపడింది' అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

రాజస్థాన్ తరఫున ..

రాజస్థాన్ తరఫున ..

ఇక ఐపీఎల్ ప్రారంభ మూడు సీజన్లు కోల్‌కతా నైట్ రైడర్స్ , కోచ్చి టస్కర్స్ తరఫున బరిలోకి దిగిన బ్రాడ్ హడ్జ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కోల్‌కతా తరఫున 19 మ్యాచ్‌ల్లో 476 పరుగులు, కొచ్చి టస్కర్స్‌తో 14 మ్యాచ్‌ల్లో 285 రన్స్ మాత్రమే చేశాడు. ఇక రాయల్ చాలెంజర్స్ తరఫున బరిలోకి దిగిన తర్వాత అతని రాత పూర్తిగా మారింది. రాజస్థాన్ తరఫున రెండు సీజన్లలో అతను 140, 134.40 స్ట్రైక్ రేట్‌తో 245, 293 రన్స్ చేశాడు. 41.85 సగటుతో రాణించి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ధోనీ నన్ను ముసలోడా అంటాడు.. నా భార్య కూడా అలాగే ఏడిపిస్తుంటుంది: ఇషాంత్​

Story first published: Tuesday, August 4, 2020, 20:00 [IST]
Other articles published on Aug 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X