న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాహుల్‌కు అప్పుడు తిట్లు.. ఇప్పుడు ప్రశంసలు..

KL Rahul : Here's How Cricket Fans Reacts On KL Rahul's Bad Time And Good Time ! || Oneindia Telugu
How Netizens React KL Rahul bad time and good time

హైదరాబాద్ : జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మనమెంతో ఆనందంగా జీవిస్తే .. మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయని అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు జీవితమనేది కొత్తగానే కనిపిస్తుంది. మారుతూ ఉంటుంది. ఈ వ్యాఖ్యలకు టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ నిదర్శనంగా నిలుస్తాడు.

ప్రస్తుతం ఈ ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ కమ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మానియా నడుస్తోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.. వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాతో అదరగొట్టిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్.. న్యూజిలాండ్ టూర్‌లోను రఫ్ఫాడిస్తున్నాడు. గత రెండు టీ20ల్లో హాఫ్ సెంచరీలతో మెరిసిన రాహుల్.. అటు కీపింగ్‌లోను అదరగొడుతున్నాడు. ఇలా తన అద్భుత పెర్ఫామెన్స్‌తో అందరి మన్ననలు .. ప్రశంసలు అందుకుంటున్నాడు. కానీ ఇదే రాహుల్ గతేడాది ఈ సమయంలోనే ఎన్నో కష్టాలు.. అవమానాలు ఎదుర్కొన్నాడు. సహచర ఆటగాడు.. స్నేహితుడితో కలిసి ఓ షోలో పాల్గొన్న పాపానికి ఇదే దేశం.. ఈ అభిమానులే.. ఈ మాజీ క్రికెటర్లే తిట్టని తిట్లు తిట్టారు. అమ్మాయిలంటే గౌరవం లేదని దుమ్మెత్తి పోశారు. ఆ ఎపిసోడ్ రాహుల్ జీవితంలోనే ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత్ కరణ్ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘కాఫీ విత్ కరణ్' షోకి హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వెళ్లారు. ఈ టాక్ షోలో కేఎల్ రాహుల్ ఆచితూచి బదులిచ్చినప్పటికీ పాండ్య మాత్రం నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు. ముఖ్యంగా కరణ్ జోహార్ హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ గురించి అడగ్గా.. తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు. రాహుల్ కూడా తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి ‘ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు' అంటూ ప్రశంసించాడని వివాదాస్పదరీతిలో చెప్పుకొచ్చాడు.

మహిళలను కించపరిచే విధంగా ఉన్న ఈ వ్యాఖ్యల పట్ల అప్పట్లో తీవ్ర దూమారం రేగింది. కుర్రాళ్లకు ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలా వ్యవహరించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో బీసీసీఐ వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు కొన్నాళ్లు నిషేధం కూడా విధించింది. దీంతో తమ తప్పును తెలుసుకున్న ఈ ఇద్దరు ట్విటర్ వేదికగా క్షమాపణలు కూడా కోరారు. మరోవైపు తమ ‘షో' కొందరి మనోభావాలను గాయపరిచినట్లు గుర్తించిన హాట్‌స్టార్‌ కూడా ఈ వీడియోను తొలగించింది. ఈ వ్యవహారంలో ఏ ఒక్కరు రాహుల్‌కు మద్దతుగా నిలవలేదు. అతను పాండ్యాలా మాట్లాడకపోయినా కేవలం అతనితో ఉండటంతో శిక్షను అనుభవించాడు.

అదో చేదు జ్ఞాపకం..

అదో చేదు జ్ఞాపకం..

అప్పట్లో ఈ వివాదంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రాహుల్ ఈ ఘటనన తన జీవితంలోనే ఓ చేధు జ్ఞాపకంగా అభివర్ణించాడు.‘అది నా కెరీర్‌లో చాలా కష్ట సమయం. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రతీ ఒక్కరి జీవితంలో కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి. అలానే నేను కూడా ఒక కఠినమైన పరిస్థితిన చవిచూశాను. ఆ వివాదం తర్వాత నేను జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆటపైనే పూర్తిగా దృష్టి పెట్టా. ప్రతీ ఒక్క క్రికెటర్‌కు దేశం తరఫున ఆడాలనే కోరిక ఉంటుంది. ఇక్కడ నేను వేరు కాదు. నాకు కూడా దేశానికి సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడి విజయాల్లో పాలు పంచుకోవాలనేదే నా కోరిక. నేను ఎక్కడ ఉన్నానో, జట్టులో నాకు ఇచ్చే గౌరవం ఏమిటో తెలుసు. నాకు వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకోవడమే నా పని. తలవంచుకుని నాకు అప్పగించిన పనిని సమర్ధవంతంగా నిర్వర్తించడమే నా ముందున్న లక్ష్యం' అని అప్పట్లో రాహుల్ పేర్కొన్నాడు.

ఇప్పుడు ప్రశంసల జల్లు..

గతేడాది ఎవరైతే రాహుల్‌ను అనరాని మాటలన్నారో.. ఇప్పుడు వారే ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. అతని క్లాస్, నిలకడైనా ఆటకు దాసోహం అంటున్నారు. ఇక టీమ్‌‌మేనేజ్‌మెంట్‌కు కూడా రాహుల్ వెలకట్టలేని ఆస్తిగా మారాడు. ఓపెనర్, మిడిలార్డర్, కీపర్ ఏ బాధ్యత అప్పగించిన సమర్థవంతంగా నిర్వహిస్తూ జట్టుకు విజయాన్నందిస్తున్నాడు. మొత్తానికి టైమ్ ఒకేలా ఉండదని, కష్టాలతో పాటు సంతోష క్షణాలు కూడా వస్తాయని, క్లిష్ట సమయాల్లో మనోధైర్యం కోల్పోకుండా చేసిన తప్పులను ఓ గుణపాఠంగా భావిస్తే విజయం తప్పదని రాహుల్ నిరూపించాడు.

Story first published: Tuesday, January 28, 2020, 18:56 [IST]
Other articles published on Jan 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X