న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ మాటలే భారత క్రికెట్ తలరాతను మార్చాయి: రోజర్ బిన్ని

How Kapil Dev, Sunil Gavaskar inspired Indian dressing room during 1983 World Cup final

న్యూఢిల్లీ: 1983 ప్రపంచకప్ విజయం.. భారత క్రికెట్‌ చరిత్రలోనే ఓ అద్భుతమైన ఘట్టం.! యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని నేడు భారత్‌ శాసిస్తుందన్నా.. దేశంలో క్రికెట్‌ ఓ ఆటగా కాకుండా మతంలా మారిందన్నా ఆ విజయమే కారణం. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్‌దేవ్ నేతృత్వంలోని భారత బృందం.. యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఆటతీరుతో ఏకంగా విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఈ విజయానికి కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌ల స్పూర్తిదాయక మాటలే కారణమని నాటి లీడింగ్ వికెట్ టేకర్, భారత దిగ్గజ క్రికెటర్ రోజర్ బిన్ని తెలిపాడు.

టీమ్ స్పిరిట్‌తో..

టీమ్ స్పిరిట్‌తో..

ఆ టోర్నీలో 8 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసిన రోజర్ బిన్నీ.. ఫైనల్లో వెస్టిండీస్‌ను టీమ్ స్పిరిట్‌తో ఓడించామన్నాడు. తాజాగా స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి క్షణాలను నెమరవేసుకున్నాడు. ‘అసలు నేను 18 వికెట్లు తీస్తానని, మేం ప్రపచంకప్ గెలుస్తామని ఏమాత్రం ఊహించలేదు. నాకైతే ఇది పునరాగమనంలాంటింది. దీనికి ఇంగ్లండ్‌కు మించిన మంచి ప్రదేశం లేదనిపించింది. ప్రపంచకప్‌లో వెస్టిండీస్ ఓడటం అదే తొలిసారి. టీమ్ స్పిరిట్‌తో ఈ విజయాన్నందుకున్నాం.'అని తెలిపాడు.

ఆత్మవిశ్వాసం రెట్టింపైంది..

ఆత్మవిశ్వాసం రెట్టింపైంది..

ఇక ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అద్భుత ఫీల్డింగ్‌తో గెలిచామని, ఆ విజయం తమ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని బిన్ని గుర్తు చేసుకున్నాడు. ‘మాకు మంచి ఫీల్డర్లు లేరు. కానీ మా ఫీల్డింగ్ చూస్తే అర్థమవుతుంది. సునీల్ గవాస్కర్ పెద్దగా పరుగులు చేయకున్నా.. ఫీల్డింగ్‌లో రాణించాడు. మమ్మల్ని అలవోకగా ఓడిస్తామనుకున్న ఇంగ్లండ్‌ను మేం మట్టి కరిపించాం. వారు భారత జట్టు మరో టీమ్ మాత్రమేనని విర్రవీగారు. కానీ ఈ గెలుపుతో మాలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది.'అని తెలిపాడు.

ఆ ఇద్దరి మాటలే..

ఆ ఇద్దరి మాటలే..

ఇక మార్షల్, మైఖేల్ హోల్డింగ్, సర్ అండీ రోబర్ట్స్‌లతో భీకర బ్యాటింగ్ లైనప్ కలిగిన వెస్టిండీస్ ముందు 183 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంచామని, అప్పటికే రెండు సార్లు విశ్వవిజేత అయిన విండీస్ అలవోకగా గెలుస్తుందనుకున్నామని బిన్ని చెప్పుకొచ్చాడు. కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ తమతో అన్న స్పూర్తిదాయకమైన మాటలు పోరాడేలా చేశాయన్నాడు.

‘ఫైనల్ మ్యాచ్ జరిగిన ఉదయం మాకు తీవ్ర నిరాశ కలిగింది. 220, 240 పరుగుల చేయాలనుకున్న మేం కేవలం 183కే పరిమితమయ్యాం. నలబై నిమిషాల పాటు ఆడకుండా డ్రెస్సింగ్ రూమ్‌‌లో దిగాలుగా కూర్చున్నాం. ఏ ఒక్కరు మాట్లాడటం లేదు. అయితే సడెన్‌గా కపిల్ దేవ్ వాయిస్ వినిపించింది. ‘జరిగిందేదో జరిగింది మర్చిపోండి. వెళ్లి వారిని ఔట్ చేయండి'అని అన్నాడు. ఈ మాటలకు వత్తాసుగా సునీల్ కూడా తన గళాన్ని విప్పాడు. దీంతో మాలో మరింత ఉత్సాహం వచ్చింది. చిన్న స్కోర్లు మరింత పోరాడేలా చేస్తాయి. ఒకవేళ మేం 270 రన్స్ చేసి ఉండే విండీస్ మాపై గెలిచేదేమో'అని రోజర్ బిన్ని తెలిపాడు.

 మళ్లీ 28 ఏళ్ల తర్వాత..

మళ్లీ 28 ఏళ్ల తర్వాత..

ఇక నాటి ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 183 పరుగులు చేయగా.. శ్రీకాంత్ (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ భారత బౌలర్ల ధాటికి 140 పరుగులకే కుప్పకూలింది. దీంతో కపిల్‌దేవ్ సేన తొలి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఆ విజయం తర్వాత మరో 28 ఏళ్ల వరకు భారత్ విశ్వవిజేతగా నిలవలేకపోయింది. ధోనీ సారథ్యంలోని జట్టు మరోసారి 2011 ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే.

నన్ను ఆ మాటంటే సెహ్వాగ్ బతికేవాడా? మైదానంలోనే కొట్టేవాడిని: షోయబ్ అక్తర్

Story first published: Wednesday, August 5, 2020, 17:29 [IST]
Other articles published on Aug 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X