న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బెన్ స్టోక్స్‌ జెర్సీపై భారతీయుడి పేరు.. ఎందుకో తెలుసా?!!

His name on Ben Stokes’s jersey, Dr. Vikas Kumar of Indian origin is overwhelmed

సౌతాంప్ట‌న్: క‌రోనా వైరస్ మహమ్మారి కారణంగా వచ్చిన భారీ విరామం త‌ర్వాత సౌతాంప్ట‌న్ వేదికగా ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ మ‌ధ్య జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌తో క్రికెట్ సంద‌డి మొదలైన సంగ‌తి తెలిసిందే. అయితే ప్రాక్టీస్‌ సెషన్‌లో భాగంగా తాత్కాలిక ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ జెర్సీపై ఓ భారతీయుడి పేరు కనిపించింది. ఆ పేరు 'వికాస్‌ కుమార్'‌. అతడు భారత సంతతికి చెందిన ఓ వైద్యుడు. స్టోక్స్‌ జెర్సీపై వికాస్‌ పేరు ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నారా?. విషయంలోకి వెలితే...

ఐసీయూ విభాగంలో ప్రత్యేక సేవలు:

ఐసీయూ విభాగంలో ప్రత్యేక సేవలు:

వైద్య వృత్తిలో ఉన్న వికాస్‌ కుమార్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని డార్లింగ్‌టన్‌లో ఉన్న జాతీయ ఆరోగ్య సేవల (ఎన్‌హెచ్‌ఎస్‌) ట్రస్టు ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నాడు. అతడు ఐసీయూ విభాగంలో ప్రత్యేక సేవలు అందిస్తున్నాడు. కొవిడ్‌పై యుద్ధంలో ముందు నిలిచి పోరాడుతున్న వైద్య సిబ్బంది గౌరవార్థం ఆ దేశ టెస్టు క్రికెటర్ల జెర్సీలపై వాళ్ల పేర్లు ఉండేలా చూడాలని అక్కడి క్రికెట్‌ బోర్డు నిర్ణయించింది. 'రైజ్ ది బాట్' ప్రచారంలో భాగంగా ఇంగ్లండ్‌లోని క్రికెట్ క్లబ్‌లు నామినేట్ చేసిన వారిలో వికాస్‌ ఒకడు.

గొప్ప గుర్తింపు ఇది:

గొప్ప గుర్తింపు ఇది:

ప్రచారంలో భాగంగా వికాస్‌ పేరుతో ఉన్న జెర్సీని బెన్ స్టోక్స్‌ ధరించాడు. స్టోక్స్‌ జెర్సీపై తన పేరు ఉండడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని వికాస్‌ చెప్పాడు. 'స్టోక్స్‌తో పాటు ఇతర ఆటగాళ్లు మాకు మద్దతుగా నిలవడం ఆనందంగా ఉంది. మా అందరికీ ఇది కఠిన సమయం. ఎన్‌హెచ్‌ఎస్‌ సిబ్బంది ఎన్నో త్యాగాలు చేశారు. భారత్‌లో ఉన్న నా వైద్య మిత్రులతో పాటు ఆ రంగంలో ఉన్న వాళ్లందరికీ దక్కిన గొప్ప గుర్తింపు ఇది. క్రికెట్‌ అభిమానినైన నేను వైద్య కళాశాల జట్టు తరపున క్రికెట్‌ ఆడేవాడిని. విధుల అనంతరం నేను ఇంట్లో ఒంటరిగా ఉంటాను. నా భార్య నా కొడుకును చూసుకుంటుంది' అని వికాస్‌ చెప్పాడు. మూడేళ్ల కిత్రం డిల్లీలో జరిగిన భారత్‌-శ్రీలంక క్రికెట్‌ మ్యాచ్‌కు వైద్యుడిగా అతను విధులు నిర్వర్తించాడు.

తొలిసారి నాయకత్వం:

తొలిసారి నాయకత్వం:

ఇంగ్లండ్‌ టెస్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ జో రూట్‌ వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్ట్ మ్యాచ్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో వైస్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తొలిసారి నాయకత్వం వహిస్తున్నాడు. దీంతో స్టోక్స్‌.. ఇంగ్లిష్‌ జట్టుకు 81వ సారథి అయ్యాడు. తొలి టెస్ట్ సందర్భంగా స్టోక్స్ లండ‌న్ దిన‌ప‌త్రిక మిర్ర‌ర్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... 'బుధ‌వారం నా జీవితంలో గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే తొలిసారి జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నా.‌ దాదాపు నాలుగు నెల‌ల విరామం త‌ర్వాత క్రికెట్‌లో మొద‌టి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. నాకు కెప్టెన్సీ క‌న్నా జ‌ట్టు గెలుపే ముఖ్యం. రూట్ గైర్హాజ‌రీలో నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌డం నా క‌ర్త‌వ్యం. కానీ దృష్టి మొత్తం మ్యాచ్ గెల‌వాల‌నే దానిపైనే ఉంది' అని అన్నాడు.

ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి:

ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి:

మామూలుగా అయితే ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌పై పెద్దగా ఆసక్తి ఉండేది కాదేమో. కానీ కరోనాతో వచ్చిన నాలుగు నెలల విరామం తర్వాత ఈ మ్యాచ్‌లపై ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టీ నెలకొంది. ఇక బయో సెక్యూర్‌ వాతావరణంలో జరిగే ఈ సిరీస్ సఫలీకృతమైతే.. సిరీస్‌లు నిర్వహించాలని మిగిలిన దేశాల బోర్డులు కూడా చూస్తున్నాయి.

జాతి వివక్షకు లుంగి ఎన్గిడి మద్దతు.. ద‌క్షిణాఫ్రికా క్రికెట్‌లో పెను దుమారం!!

Story first published: Saturday, July 11, 2020, 13:46 [IST]
Other articles published on Jul 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X