న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జాతి వివక్షకు వ్యతిరేకంగా లుంగి ఎన్గిడి మద్దతు.. ద‌క్షిణాఫ్రికా క్రికెట్‌లో పెను దుమారం!!

Lungi Ngidi said he believed his team-mates should make a stand the next time the squad meets


జోహ‌న్నెస్‌బ‌ర్గ్‌: అమెరికా న‌ల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హ‌త్య త‌రువాత జాతి వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ తమ గళాన్ని వినిపించారు. తాజాగా 'బ్లాక్ లైవ్స్ మేటర్' ఉద్యమానికి తాను మద్దతు ఇస్తానని దక్షిణాఫ్రికా స్టార్‌ పేసర్ లుంగి ఎన్గిడి శుక్ర‌వారం పేర్కొన్నాడు. అయితే ఎన్గిడి చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా క్రికెట్‌లో పెను దుమారాన్నే రేపుతున్నాయి.
ద‌క్షిణాఫ్రికాలోనూ జాత్యాహంకారం జ‌ర‌గుతుంది:

ద‌క్షిణాఫ్రికాలోనూ జాత్యాహంకారం జ‌ర‌గుతుంది:

శుక్రవారం లుంగి ఎన్గిడి మాట్లాడుతూ... 'బ్లాక్ లైవ్స్ మేట‌‌ర్‌‌కు నేను మ‌ద్ద‌తు ఇస్తున్నా. ఈ అంశంలో ఇత‌ర ఆట‌గాళ్ల మ‌ద్ద‌తు నాకు ఉంటుంద‌నే ఆశిస్తున్నా. గ‌డిచిన కొన్ని సంవ‌త్స‌రాల్లో ద‌క్షిణాఫ్రికాలోనూ జాత్యాహంకారం జ‌ర‌గుతుంది. క్రికెట్‌లోనూ ఇది కొన‌సాగుతుంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న బ్లాక్ లైవ్స్ మేట‌‌ర్‌కు మా జ‌ట్టులోని ఆటగాళ్లు కూడా క‌లిసి వ‌స్తార‌ని ఆశిస్తున్నా' అని పేర్కొన్నాడు.

నిజంగా మూర్ఖుడివి:

నిజంగా మూర్ఖుడివి:

లుంగి ఎన్గిడి వ్యాఖ్య‌ల‌పై ప‌లువురు మాజీ ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్లు మండిపడుతున్నారు. 'లుంగి ఎన్గిడి నువ్వు నిజంగా మూర్ఖుడివి. బ్లాక్ లైవ్స్ మేటర్‌కు మ‌ద్ద‌తు ఇవ్వాలా వ‌ద్దా అనేది నీ సొంత నిర్ణయం. నువ్వు మ‌ద్ద‌తు ఇవ్వాల‌నుకుంటే ఇవ్వు.. నీ ఇష్టం అది. కానీ మొత్తం ద‌క్షిణాఫ్రికా ప్ర‌జ‌ల‌ను ఇందులోకి లాగొద్దు' అంటూ ద‌క్షిణాఫ్రికా మాజీ స్పిన్న‌ర్ పాట్ సిమ్‌కాక్స్ అన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో పాట్ సిమ్‌కాక్స్ 20 టెస్టుల్లో, 80 వన్డేల్లో ద‌క్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

రాజ‌కీయ ఉద్య‌మం త‌ప్ప మ‌రొక‌టి లేదు:

రాజ‌కీయ ఉద్య‌మం త‌ప్ప మ‌రొక‌టి లేదు:

'బ్లాక్ లైవ్స్ మేటర్ ప్ర‌చారం వెనుక రాజ‌కీయ ఉద్య‌మం త‌ప్ప మ‌రొక‌టి లేద‌ని నేను భావిస్తున్నా. ఎన్గిడి.. మ‌ద్ద‌తు ఇచ్చే ముందు థామ‌స్ సోవ‌ల్‌, లారీ ఎల్డ‌ర్‌, వాల్ట‌ర్ విలిమ‌మ్స్ లాంటి తెల్ల‌జాతి రైతుల‌పై జ‌రిగిన దారుణాల‌ను ఓసారి గుర్తు తెచ్చుకో. ఈ విష‌యంలో నువ్వు సానుభూతి ప్ర‌క‌టిస్తే.. బ్లాక్ లైవ్స్ మేటర్ ప్ర‌చారంలో నేను నీతో పాటు వ‌స్తా' అని మాజీ బ్యాట్స్‌మ‌న్ బొటా డిప్పెనార్ తెలిపాడు. డిప్పెనార్ ప్రొటీస్ తరఫున 38 టెస్టులు, 107 వన్డేలు, 1 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

మా మద్దతు తెలుపుతాం:

మా మద్దతు తెలుపుతాం:

'బ్లాక్ లైవ్స్ మేటర్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసు. అందులో మా పాత్ర గురించి మాకు బాగా తెలుసు. అయితే అందులో ఎలా పాల్గొనాలి, ఏ విధంగా 'బ్లాక్ లైవ్స్ మేటర్'కు మా మద్దతు తెలపాలి అనేది మేము ఆలోచిస్తున్నాం. మా ఆటగాళ్లు అందరూ ఇందుకు మద్దతిస్తారు. మేము ఈ విరామం తర్వాత ఆడే మొదటి మ్యాచులో వారికి మద్దతు తెలుపుతాం' అని సీఎఏ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ అన్నాడు.

నీ వెనుక మేమంతా ఉన్నాం:

నీ వెనుక మేమంతా ఉన్నాం:

లుంగి ఎన్గిడి వ్యాఖ్య‌ల‌కు తాను మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి తెలిపాడు. 'బ్లాక్ లైవ్స్ మేటర్ ప్ర‌చారానికి ఎన్గిడి మ‌ద్ద‌తివ్వ‌డం చాలా సంతోషంగా ఉంది. నీ వెనుక ఎవ‌రు లేకున్నా మేమంతా నీతోనే ఉన్నాం . ఈ విష‌య‌లంలో క‌లిసి పోరాడుదాం' అంటూ ట్విట‌ర్‌లో పేర్కొన్నాడు.

వింబుల్డన్‌ రద్దయినా.. క్రీడాకారులకు ప్రైజ్‌మనీ!!

Story first published: Saturday, July 11, 2020, 13:39 [IST]
Other articles published on Jul 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X